MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పక్షులు , వాటితో పెట్టుకుంటే అంతే సంగతులు..

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పక్షులు , వాటితో పెట్టుకుంటే అంతే సంగతులు..

బర్డ్ అంటే చాలా క్యూట్ గా  ఉంటాయని తెలుసు.. కాని అందులో కూడా చాలా డేంజరస్  బర్డ్స్ ఉంటాయని మీకు తెలుసా..? ప్రపంచంలో అత్యంత ప్రమాదరకమైన పక్షుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..? 

4 Min read
Mahesh Jujjuri
Published : Jan 03 2025, 03:19 PM IST | Updated : Jan 03 2025, 03:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
17
Asianet Image

సాధారణంగా బర్డ్ అంటే చాలా క్యూట్ గా.. అందంగా ఉంటాయి. పక్షి ప్రేమికులు అయితే వాటిని ముద్దాడుతూ.. తెగ గారం చేస్తుంటారు.  వాటికి ఏమైనా అయితే అస్సలు ఊరుకోరు.. అండ్ అఫ్ కోర్స్... మన రోబో2.0 లో కూడా చూశాం.. పక్షిరాజు.. పక్షులను కాపాడటానికి ఏం చేశాడో.. మన వల్ల పక్షులకు ఎంత ఇబ్బంది కలుగుతుంది. సో అవన్నీ పక్కన పెడితే.. ఈరోజు మన టాపిక్ పక్షులు..  మామూలు పక్షులు కాదు చాలా డేంజరస్ పక్షుల గురించి తెలుసుకుందాం. ప్రమాదం అంతే అంతా ఇంతా కాదు.. అత్యంత ప్రమాదరకమైన పక్షుల గురించి మాట్లాడుకుందందాం.
 

27
Asianet Image

పిటోహుయి  ఈ పక్షులు చూడటానికి చాలా అంటే చాలా అందంగా ఉంటాయి. కాని ఇవి చాలా డేంజురెస్.. విలన్స్ మాధిరి అన్నమాట.. వీటి గురించి ఓ విషయం చెప్పాలి. వీటికి బోన్ మారో అంటే చాలా ఇష్టం.  మనం మటన్ తింటాం కదా.. తీనేప్పుడు బోన్ లోపలి మీట్ కోసం తెగ కష్టపడుతుంటాం.. ప్లేట్ కేసి కొట్టడం.. నోటితో పీల్చడం. చేస్తాం కదా.. ఇవి కూడా సరిగ్గా బోన్ మారో కోసం తెగ ట్రై చేస్తుంది.

అయితే మన కోడి.. మేక బోన్ మారోలాగ కాదు.. ఈ పక్షులు ఏ జంతువు అయిన.. మనిషి అయినా సరే ఎముకలోని బోన్ మారో కోసం ఆ ఎముకలను గట్టిగా బండలకేసి కొడుతుంది. అవి పగిలే వరకు బలంగా  కొడతాయి.  ఈ పిటోహుయ్ పక్షులు ఎక్కువగా  న్యూ గినియాలో కనిపిస్తాయి. అన్ని పక్షుల్లా ఈ పక్షిని తినడానికిలేదు.  ఈపక్షి ఈకలు మరి చర్మంలో చాలా పవర్ పుల్  న్యూరోటాక్సిక్ ఆల్కలాయిడ్లు కలిగి ఉంటాయి. వీటి వల్లనే ఈ పక్షులు చాలా సేఫ్ గా ఉంటాయి. మనం ఏదైనా చేయాలి అని చూస్తే అంతే సంగతులు. 

37
Asianet Image

కొమ్ముల గుడ్లగూబలు వీటిని హూల్ గుడ్లగూబలు అని పిలుస్తారు. ఇవి ఉత్తరమెరికాలో ఎక్కువగా కనిపిస్తాయి. వీటి స్పెషల్ ఏంటీ అంటే ఇవి ఐదు అడుగుల వరకూ పెరుగుతాయి. వీటిముఖం మన మనిషిని పోలి ఉంటుంది.  వీటి రెక్కలయితే 17 నుండి 25 అంగుళాల వరకు ఉంటాయి. వీటి సగటు బరువు 3.2 పౌండ్లు. అయితే ఇవి  ఉత్తర అమెరికాలోనే రెండవ భారీ గుడ్లగూబ.. మొదటిది  స్నోవీ గుడ్లగూబలు.

ఇవి కూడా చాలా స్పెషల్..ఇక ఈ కొమ్ముల గుడ్లగూబల గురించి చూస్తే.. ఇవి చాలా శక్తి వంతమైనవి.  బాగా బలిష్టంగా ఎదిగిన పెద్ద కుందేలును పట్టుకుని పిండి పిండి చేసి తినగల శక్తి వీటి సొంతం. వీటికి చాలా టాలెంట్ ఉంటుంది. ఈ గుడ్లగూబలుమంచి సింగర్లు  కూడా. మంచి హమ్మింగ్ బార్డ్స్ గా వీటికి పేరుంది.  ఇవి ఉన్న అడవిలోకి వెళ్తే.. రాత్రివేళ వినసొంపైన హమ్మింగ్ వినిపిస్తుంది.  కాని ఇది వినడానికి అడవికి వెళ్ళడం కుదరనిపని.. ఎందుకంటే.. అవి  అంత భయకరమైన అడవుల్లోనే ఉంటాయి.

వీటిలో ఓ స్పెషల్  ఏంటీ అంటే ఇవి 180 డిగ్రీల కోణంలో కూడా చూడగలవు. కాని గుడ్లు మాత్రం తిప్పలేవు. వీటి వెన్ను పూస,గర్భాశంలోని కోన్ని స్పెషల్ క్యాలిటీస్ వల్ల ఇవి తలను అలా తిప్పగలవు. వీటికి వినికిడి శక్తి చాలా ఎక్కువ. వీటి మెదడు కూడా మనకంటే చురుగ్గా పనిచేస్తుంది. వీటని కనుకు  ఏ ఐఏఎస్ ట్రైయినింగ్ కో పంపిస్తే అవే ఫస్ట్ వస్తాయి.. ఎందకుంటే మనకంటే బుర్రను అవే ఎక్కువగా వాడతాయి. 

47
Asianet Image

ఫాల్కన్ పెరేగ్రినాస్ వీటినే.. పెరెగ్రైన్ గద్ద  అంటారు. వీటిని  పక్షులు అనే కంటే.. క్రూర మృగాలు అంటే మంచిదేమో.. ఎందుకుంటే జంతువులలో సాదు జంతువులు.. క్రూర మృగాలు ఎలా ఉంటాయో.. పక్షిజాతిలో ఇవి అంత క్రూరమైనవి అన్న మాట.

ఈ ఫాల్కన్ కుటుబంలో జంతువులన్నీ అంతే. అయితే ఇవి ఒక్క అంటార్కిటికా తప్పితే.. ప్రపంచంలో అన్ని చోట్ల కనిపిస్తాయి.  వీటిలో దాదాపు పదిహేడు జాతులు ఉన్నాయి. ఇవి బూడిద రంగులో ఉంటాయి. ఈకలు మాత్రం ముదురు రంగులో ఉంటాయి. అంతే కాదు వీటికి మంచి అట్రాక్టీవ్ మీసం కూడా ఉంటుంది.

అది నల్లగా ఉంటుంది. వీటిలో ఉండే పదిహేడు జాతుల్లో ఒక్కోక్క జాతికి.. ఒక్కోక్క రకం లక్షణాలు ఉంటాయి. ఈఫాల్కన్ చాలా స్పీడ్.. ఆ స్పీడ్ ను అందుకోవడం చాలా కష్టం. ఈపక్షి గంటతకు మూడు వదల కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతోంది. అంటే సెకండ్ కు 9 మీటర్ల వరకూ వెళ్లగలవు.  

57
Fastest bird peregrine falcon

Fastest bird peregrine falcon

ఇక వీటి కళ్లు హై ఎండ్ కెమెరా లెన్స్ తో సమానం. ఇవి చాలా  ఎత్తులో కూర్చుని తన ఎరను గమనిస్తూ ఉంటాయి. ఏమాత్రం వీలు ఉన్నా.. వాయు వేగంతో ఆ ఎరును పట్టుకునే ప్రయత్నం చేస్తాయి. ఎంత ఫాస్ట్ గా వస్తాయో అంత ఫాస్ట్ గా నేలమీద ఉన్న జంతువును కాని.. పక్షులను కాని కాళ్ళతో పట్టుకుని తీసుకుపోగలవు.

వీటి పంజాలో అంత పవర్ ఉంటుంది మరి. పావురాలు, బాతులు, నీటిలో చేపలు చిన్న క్షీరదాలను కూడా వదిలిపెట్టవు. ఇవి ఎక్కువగా చిత్తడి నేలలు.. రాతి శిఖరాలు.. ఓంటరి భవనాలలో పై కనిపిస్తాయి.  

67
Harpy Eagle

Harpy Eagle

లాటిన్ అమెరికాలోని వర్షారణ్యాల్లో సంచరించే హార్పల్ ఈగల్స్ గద్దలు సుమారు మూడన్నర అడుగులు ఉంటాయి. వీటి  మొహం అచ్చంగా మనిషిని పోలి ఉంటుంది. అందుకే ఈ గద్దెల జాతిలోనే వీటకి ప్రత్యేక స్థానం ఉంటుంది. అన్నింటికంటే పెద్దగా ఉండటంతో వాటిని చూస్తే మన ఒళ్లు జలదరిస్తుంది.

అయితే మన దేశంలో ఉండే గద్దలు ఇంచుమించు అన్నీ ఒకే సైజులో ఉంటాయి. అయితే విదేశాల్లో ఉండే కొన్ని జాతుల గద్దలు మాత్రం  హెవీ బాడీతో ఉంటాయి.  వీటిలో  హార్పీ ఈగల్‌’ అనే రకం గద్దలు దాదాపు మూడున్నర అడుగుల ఎత్తుతో చూడగానే జడుసుకునే విధంగా ఉంటాయి. 
 

77
Harpy Eagle

Harpy Eagle

ఇక ఇవి మాత్రం  రెక్కలు విప్పితే వాటి వెడల్పు ఏడు అడుగులపైనే ఉంటుంది. అందుకే ఇవి ప్రపంచంలోనే అతిపెద్ద గద్దలుగా పేరుపొందాయి.గంటకు 50 మైళ్ల వేగంతో ప్రయాణించగలిగే ఈ గద్దలు లాటిన్‌ అమెరికాలోని వర్షారణ్యాలలో ఎక్కువగా ఉంటాయి.

హార్పీ గద్దలు ఎక్కువగా కాపుచిన్‌ రకం కోతుల్ని వేటాడతాయట. అయితే ఈ  కోతుల మెయిన్ ఫుడ్ ఏంటీ అంటే  పక్షుల గూళ్లలోని గుడ్లే. అవి ఈ గద్దల గుడ్లను తింటుంటాయి.. దాంతో ఈ గద్దలు కూడా వాటిని వేటాడి చంపి తింటుంటాయి.  దీంతో ఈ రెండు జంతువులు ఎనిమీస్ గా మారిపోయాయి.

ఈ గద్దలు ఆ కోతుల సంఖ్యను అదుపులో ఉంచడం వల్ల చాలా రకాల పక్షి జాతుల్ని అంతరించకుండా కాపాడగలుగుతున్నాయి.  రెండేళ్లకోసారి ఒకే ఒక్క పిల్లను పొదగడం వల్ల హార్పీ గద్దల సంఖ్య పెరగడం లేదు. దీనికి తోడు అడవుల నరికివేత వల్ల ఈ జాతి గద్దలు క్రమంగా అంతరించిపోతున్నాయి. 

About the Author

Mahesh Jujjuri
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
 
Recommended Stories
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved