MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Revenge: 18 ఏళ్ల క్రితం భార్య దీపికా కి జరిగిన అన్యాయానికి పగ తీర్చుకున్న రణవీర్ సింగ్

Revenge: 18 ఏళ్ల క్రితం భార్య దీపికా కి జరిగిన అన్యాయానికి పగ తీర్చుకున్న రణవీర్ సింగ్

Revenge: సినిమా ఇండస్ట్రీలో కొన్ని యాదృచ్చికాలు అభిమానులకు భలే కిక్కు ఇస్తుంటాయి. దీపికా, రణవీర్ సినిమాల విషయంలో ఇదే జరిగింది. వీరి సినిమాలకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 

2 Min read
Author : ramya Sridhar
Published : Mar 23 2026, 12:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
భార్యపై ప్రేమ..
Image Credit : our own

భార్యపై ప్రేమ..

బాలీవుడ్ మోస్ట్ లవ బుల్ కపుల్స్ లో దీపికా -రణవీర్ ముందు వరసలో ఉంటారు. వీరికి సంబంధించి ఏ విషయం అయినా నెట్టింట వైరల్ అవుతూనే ఉంటుంది. అంతేకాదు.. దీపికపై రణవీర్ ఎప్పటికప్పుడు తన ప్రేమను చూపిస్తూనే ఉంటాడు.తాజాగా మరోసారి భార్యపై ప్రేమను నిరూపించుకున్నాడు. అది కూడా 18 ఏళ్ల క్రితం ఒక సినిమాలో తన భార్య దీపికా కి జరిగిన అన్యాయానికి తాజాగా తన సినిమా ద్వారా పగ తీర్చుకున్నాడు. ఇంతకీ విషయం ఏమిటంటే...

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
23
 ఫ్లాష్ బ్యాక్.. ( ఓం శాంతి ఓం)
Image Credit : instagram

ఫ్లాష్ బ్యాక్.. ( ఓం శాంతి ఓం)

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె దాదాపు 18 ఏళ్ల క్రితం తన సినీ కెరీర్ ని ప్రారంభించింది. బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ జంట గా ‘ ఓం శాంతి ఓం’ అనే సినిమాలో నటించి అందరినీ మెప్పించింది. ఆ మూవీలో అర్జున్ రాంపాల్ ( ముఖేష్ మెహ్రా పాత్రలో) విలన్ పాత్రలో నటించారు. ఆయన తన కెరీర్, స్వార్థం కోసం.. హీరోయిన్ శాంతి ప్రియ( దీపికా) ను ఒక సెట్ లో బంధించి, నిప్పు పెట్టి అత్యంత దారుణంగా చంపేస్తాడు. ఆ సీన్ కి తాజాగా రణవీర్ రివేంజ్ తీర్చుకోవడం గమనార్హం.

Related Articles

Related image1
Niharika : అవార్డు వచ్చిన సంతోషమే లేదు.. బాగా హర్ట్ అయిన మెగా డాటర్
Related image2
Mega Star చిరంజీవిని కించపరిచిన జర్నలిస్ట్... ధీటుగా సమాధానం ఇచ్చిన మెగా కోడలు లావణ్య త్రిపాఠి
33
ప్రెజెంట్ .. ( దురంధర్)
Image Credit : X

ప్రెజెంట్ .. ( దురంధర్)

దాదాపు ఓం శాంతి ఓం వచ్చిన 18 ఏళ్ల తర్వాత రణవీర్ సింగ్ హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ దురంధర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలోనూ అర్జున్ రాంపాల్ ఒక పవర్ ఫుల్ నెగటివ్ పాత్ర పోషించాడు. కథలో భాగంగా క్లైమాక్స్ లో రణవీర్ సింగ్.. అర్జున్ రాంపాల్ పాత్రను అంతం చేస్తాడు. ఓం శాంతి ఓం లో దీపిక పాత్ర ఎలా అయితే అగ్నికి ఆహుత అవుతుందో.. దురంధర్ లో అర్జున్ రాంపాల్ పాత్ర కూడా అలానే అగ్నికి ఆహుతి అవుతుంది.

దీంతో.. ఈ రెండు సీన్ లను కలిపి నెట్టింట అభిమానులు వైరల్ చేస్తున్నారు. భార్యకు జరిగిన అన్యాయానికి రణవీర్ ఇలా పగ తీర్చుకున్నాడు అంటూ.. అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఓం శాంతి ఓం సినిమాలో శాంతి పాత్రకు ఇప్పటికి న్యాయం జరిగింది అంటూ అభిమానులు సంబరపడుతున్నారు. దీంతో.. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమాలు వేరైనా, పాత్రలు వేరైనా.. విలన్ మాత్రం ఒకడే కావడంతో.. ఈ కోయిన్సిడెన్స్ బాలీవుడ్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారింది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
నాగబాబు 'మేము కాప్‌లం' సిరీస్ షూటింగ్ లో మతిపోగొట్టే మ్యాటర్.. జస్ట్ 17 రోజుల్లోనే ఫినిష్, ఎలా సాధ్యమైంది ?
Recommended image2
Karuppu Movie: త్రిష, సూర్య మరోసారి ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయాల్సింది.. ఎలా మిస్సయ్యారో తెలుసా ?
Recommended image3
Cast Fees: మృణాల్ ఠాకూర్ ముందు తేలిపోయిన పూజా హెగ్డే.. రెమ్యునరేషన్ లో క్లియర్ డామినేషన్
Related Stories
Recommended image1
Niharika : అవార్డు వచ్చిన సంతోషమే లేదు.. బాగా హర్ట్ అయిన మెగా డాటర్
Recommended image2
Mega Star చిరంజీవిని కించపరిచిన జర్నలిస్ట్... ధీటుగా సమాధానం ఇచ్చిన మెగా కోడలు లావణ్య త్రిపాఠి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved