MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఆయన ఒక్క మాట చెబితే చిరంజీవి అల్లు రామలింగయ్య అల్లుడు అయ్యేవాడు కాదు, పెళ్లి వెనుక ఇంత తతంగం నడిచిందా? 

ఆయన ఒక్క మాట చెబితే చిరంజీవి అల్లు రామలింగయ్య అల్లుడు అయ్యేవాడు కాదు, పెళ్లి వెనుక ఇంత తతంగం నడిచిందా? 

ఒక నిర్ణయం జీవితాన్నే మార్చేస్తుంది. చిరంజీవి-సురేఖల పెళ్ళికి ముందు జరిగిన తతంగం తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది. 

2 Min read
Author : Sambi Reddy
| Updated : Sep 14 2024, 10:57 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Megastar Chiranjeevi

Megastar Chiranjeevi

నటుడిగా కనీస గుర్తింపు రాకముందే అల్లు రామలింగయ్య చిరంజీవిని అల్లుడు చేసుకున్నారు. సురేఖ మెడలో తాళి కట్టే నాటికి చిరంజీవికి స్టార్డం రాలేదు. 1978లో విడుదలైన ప్రాణం ఖరీదు సినిమాతో చిరంజీవి నటుడిగా మారాడు. ఆయన నటించిన మొదటి చిత్రం పునాదిరాళ్లు అయినప్పటికీ ప్రాణం ఖరీదు మొదట విడుదలైంది. 
 

27
Allu Ramalingaiah

Allu Ramalingaiah

చిరంజీవిలోని టాలెంట్ గమనించిన అల్లు రామలింగయ్య అతన్ని అల్లుడు చేసుకోవాలనుకున్నారు. ఎప్పటికైనా స్టార్ అవుతాడనే నమ్మకం చిరంజీవి మీద అల్లు రామలింగయ్యకు కలిగింది. దీంతో చిరంజీవిని పిలిచి సురేఖను వివాహం చేసుకుంటావా? అని అడిగారట.

37
Allu Ramalingaiah

Allu Ramalingaiah

అప్పటికే అల్లు రామలింగయ్య స్టార్ కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్. డబ్బు, హోదా, స్టేటస్ లో అల్లు రామలింగయ్య ఎక్కడో ఉన్నారు. అయినా ఓ సాధారణ వర్ధమాన హీరోకి కూతుర్ని ఇవ్వాలనుకున్నాడు. అల్లు రామలింగయ్య ప్రతిపాదన చిరంజీవికి షాక్ ఇచ్చింది. చిరంజీవి ఆనందంగా ఒప్పుకున్నారు.

47

కానీ అల్లు రామలింగయ్యకు ఎక్కడో ఓ సందేహం. నేను చేస్తున్న పని కరెక్టేనా...  అని చిన్న పీకులాట ఉంది. మరో వైపు సురేఖకు గొప్ప గొప్ప సంబంధాలు వస్తున్నాయి. అదే  సమయంలో సురేఖకు కలెక్టర్ సంబంధం వచ్చిందట. నటుడు చిరంజీవికి ఇవ్వాలా...  సెటిల్డ్ పొజిషన్ లో ఉన్న కలెక్టర్ కి ఇవ్వాలా? అనే మీమాంసలో అల్లు రామలింగయ్య పడ్డారట. 
 

57
Megastar Chiranjeevi

Megastar Chiranjeevi

అప్పుడు అల్లు రామలింగయ్య తనకు అత్యంత సన్నిహితుడు, శ్రేయోభిలాషి అయిన నటుడు ప్రభాకర్ రెడ్డిని కలిశారట. సురేఖ పెళ్లి విషయంలో ఆయన సలహా కోరారట. ఏమండి రెడ్డిగారూ... ఇలా రెండు సంబంధాలు వచ్చాయి . చిరంజీవి సురేఖను వివాహం చేసుకుంటాను అంటున్నాడు. మరోవైపు కలెక్టర్ సంబంధం ఉంది. ఇద్దరిలో ఎవరితో సురేఖ పెళ్లి చేస్తే మంచిది, అని అడిగారట. 

అల్లు రామలింగయ్య ప్రశ్నకు ప్రభాకర్ రెడ్డి నేరుగా సమాధానం చెప్పారట. పెళ్లి విషయంలో అమ్మాయి ఇష్టం అనేది చాలా ముఖ్యం. ఆడపిల్లకు ఇష్టం లేకుండా ఎంత గొప్పింటికి పంపినా సంతోషంగా ఉండదు. అందుకే సురేఖనే అడుగు,  అమ్మాయి ఇష్టప్రకారం పెళ్లి చేయమని సలహా ఇచ్చాడట. 
 

67


ప్రభాకర్ రెడ్డి సలహా మేరకు సురేఖను అడుగగా... ఆమె చిరంజీవిని పెళ్లి చేసుకుంటాను అన్నారట. అమ్మాయి ఒప్పుకుందే తడవుగా అల్లు రామలింగయ్య చిరంజీవితో వివాహం నిశ్చయించారు. 1980 ఫిబ్రవరి 20న చిత్ర ప్రముఖుల సమక్షంలో చిరంజీవి-సురేఖల వివాహం జరిగింది. 

ఒక వేళ సురేఖ కలెక్టర్ ని చేసుకొని ఉంటే సమీకరణాలు వేరుగా ఉండేవి. చిరంజీవి స్టార్ గా ఎదిగాక గీతా ఆర్ట్స్ బ్యానర్ ఎక్కడికో వెళ్ళిపోయింది. మామ కోసం ఆ బ్యానర్ లో చిరంజీవి అనేక చిత్రాలు చేశారు. చిరంజీవి-గీతా ఆర్ట్స్ బ్యానర్ లో చేసిన అనేక చిత్రాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. 

77

అదే విధంగా అల్లు రామలింగయ్య అల్లుడయ్యాక చిరంజీవికి పరిశ్రమలో ఎదగడానికి మార్గం సుగమం అయ్యింది. అల్లు రామలింగయ్య  కారణంగా చిరంజీవికి ఆఫర్స్ వచ్చాయి. ఆ అవకాశాలను తన టాలెంట్ తో విజయాలుగా మలిచి చిరంజీవి స్టార్ అయ్యారు. చిరంజీవి-సురేఖల పెళ్లికి ముందు జరిగిన ఈ వ్యవహారాన్ని నటుడు ప్రభాకర్ రెడ్డి భార్య ఓ సందర్భంలో బయటపెట్టారు. 

బిగ్ బాస్ హౌజ్ నుంచి రెండో వారం ఎగ్జిట్ అయ్యేది ఎవరు?

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Illu Illalu Pillalu: భాగ్యం శాడిజం, సాగర్ ని చావబాదిన రామరాజు, నీకు పిల్లల్ని పెంచడం రాదన్న నర్మద తండ్రి
Recommended image2
Samantha: నాగచైతన్య నుంచి విడిపోవడానికి సమంత ఎన్నికోట్ల భరణం తీసుకుందో తెలుసా? ఆమె గట్స్ కి సెల్యూట్‌ చేయాల్సిందే
Recommended image3
Virosh Wedding: పెళ్లి తర్వాత తొలిసారి జంటగా విజయ్-రష్మిక..కొత్త జంట సందడి, వైరల్ ఫోటోస్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved