- Home
- Entertainment
- ఆ విషయంలో ప్రియమణిని ఇబ్బంది పెట్టిన స్టార్ ప్రొడ్యూసర్.. తప్పని పరిస్థితిలో ఒప్పుకుందంట.!?
ఆ విషయంలో ప్రియమణిని ఇబ్బంది పెట్టిన స్టార్ ప్రొడ్యూసర్.. తప్పని పరిస్థితిలో ఒప్పుకుందంట.!?
హీరోయిన్ ప్రియమణికి గతంలో సినీ ఇండస్ట్రీలో చేధు అనుభవం కలిగింది. తను నటించిన మూవీకి సంబంధించిన స్టార్ ప్రొడ్యూసర్ ఆమెను ఒక విషయంలో చాలా టార్చర్ పెట్టాడంట. ప్పని పరిస్థితుల్లో ఒప్పుకోవాల్సి వచ్చిందంట. ప్రస్తుతం నెట్టింట ఈ మేటర్ వైరల్ అవుతోంది.

సినీ ఫీల్డ్ లో నెగ్గాలంటే నటీనటులు ఎన్నో ఇబ్బందులకు ఓర్చుకోవాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా హీరోయిన్లు ప్రతి సవాల్ ను ఎదుక్కోక తప్పదు. వాటన్నింటిని దాటుకొని నిలిస్తేనే వరుస ఆఫర్లు అందుకుంటూ వెండితెరపై వెలుగొందే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో కేరీర్ ప్రారంభంలోనే స్టార్ హీరోయిన్ ప్రియమణి (Priyamani) కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ను ఫేస్ చేయాల్సి వచ్చింది.
బెంగళూరుకు చెందిన హీరోయిన్ ప్రియమణి తన కేరీర్ ను మోడలింగ్ తో నే ప్రారంభించింది. తను 12th స్టాండడ్ లోనే భరణి సిల్క్స్ మరియు లక్ష్మి సిల్క్స్ కు యాడ్ షూట్ చేసింది. 19 ఏండ్లకే హీరోయిన్ గా వెండితెరపై మెరిసింది. టాలీవుడ్ లోనే తన డెబ్యూ ఫిల్మ్స్ ‘ఎవరే అతగాడు’తో హీరోయిన్ గా తెలుగు ఆడియెన్స్ కు పరిచయం అయ్యింది.
గ్లామర్ పరంగా, పెర్ఫామెన్స్ పరంగా అదరగొట్టే ప్రియణి కేరీర్ ప్రారంభం లో చాలా ఆఫర్లను అందుకుంది. ఆమె కేరీర్ లో తెలుగులో నటించి బెస్ట్ చిత్రాల్లో ‘పెళ్లైన కొత్తలో, టాస్, యమదొంగ, నవ వసంతం, హరే రామా, కింగ్, ద్రోణ, శంభో శివ శంభో, సాధ్యం, గోలీమార్, రక్త చరిత్ర’ ఉన్నాయి. వీటిలోనూ ప్రియమణి పేరు చెప్పగానే ఇప్పటికే గుర్తుకు వచ్చే చిత్రం ‘యమదొంగ’ అని చెప్పొచ్చు.
అయితే కేరీర్ ప్రారంభంలో ఇలా వరుస ఆఫర్లు అందుకుంటున్న క్రమంలో ఓ స్టార్ ప్రొడ్యూసర్ నిర్మించే సినిమాలో హీరోయిన్ గా అవకాశం వచ్చిందట. అదీ పెద్ద సినిమా ఏం కాదు. అయితే ఈ చిత్రంలోని ఓ సన్నివేశంలో ప్రియమణి బొడ్డుపై టాటూ వేసుకోవాలని ఆదేశించారంట. దీనికి తను నిరాకరించిందంట.
కాగా కథ చెప్పినప్పుడు, సినిమాకు ఒకే చేసేప్పుడు ఇలాంటి కండీషన్ ఏమీ తనతో చెప్పలేదని ఆ ప్రొడ్యూసర్ తో చెప్పిందంట. కానీ అప్పటికే రెమ్యూనరేషన్ తీసుకోవడం.. చిత్ర షూటింగ్ కాస్తా ముందుకు వెళ్లడంతో ప్రియమణి చేసేదేమీ లేక ఒప్పుకుందట. అసలు విషయం ముందే తెలిస్తే సినిమాను రిజెక్ట్ చేసే ఉండేదంట. సినిమాల ఎంపికలో ఆమె అంతా క్లియర్ గా ఉంటారంట.
కొన్నాళ్లు సినిమాల్లో జోరు తగ్గించినా.. టీవీ షోస్ ల ద్వారా ఆడియెన్స్ ను అలరించింది. ‘ఢీ’షో ద్వారా టీవీ ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో ప్రియమణి మరింత గ్లామర్ తో ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఆఫర్లు కూడా అందుకుంటోంది. చివరిగా ‘భామా కలాపం’,‘విరాట పర్వం’ చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రియమణి నాలుగైదు చిత్రాల్లో నటిస్తోంది.