భారీ స్థాయిలో చిరంజీవి - బాలకృష్ణ మల్టీస్టారర్.. సైలెంట్ గా ప్లాన్ చేస్తున్న స్టార్ ప్రొడ్యూసర్.!
మెగా స్టార్ చిరంజీవి - నందమూరి బాలకృష్ణ మల్టీస్టారర్ గా ఓ మూవీ రాబోతుందనే విషయం గతేడాది నుంచి ఆసక్తికరంగా మారింది. తాజాగా ఈ సినిమాపై స్టార్ ప్రొడ్యూసర్ స్పందించారు. సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
టాలీవుడ్ లో మల్టీస్టారర్ చిత్రాలకు ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు హీరోలు కలిసి నటిస్తున్న చిత్రాలకు దేశవ్యాప్తంగా ఆదరణ దక్కుతున్న విషయమూ తెలిసిందే. ‘బాహుబలి’లో ప్రభాస్ - రానా, ‘ఆర్ఆర్ఆర్’లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ - రామ్ చరణ్ దుమ్ములేపిని విషయం తెలిసిందే.
మల్టీస్టారర్ చిత్రాలకు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సైతం బ్రేక్ అవుతుండటం విశేషం. గతంలోనే టాలీవుడ్ సీనియర్ హీరోలు కలిసి నటించి ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతమూ ఆ ట్రెండ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో తాజాగా చిరంజీవి (Chiranjeevi) - బాలకృష్ణ (Balakrishna) మల్టీస్టారర్ మరోసారి తెరపైకి వచ్చింది.
చిరంజీవి, బాలయ్య మధ్య మంచి సన్నిహితం ఉంటుంది. ఇండస్ట్రీలో కొంత మేరకు మెగా వర్సెస్ నందమూరి అంటూ ప్రచారం జరిగినా.. ఇటీవల మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ స్థాపించిన ‘ఆహా’లో బాలయ్య టాక్ షోతో అదరగొడుతుండటంతో పాటు.. ఓ సందర్భంలో కథ సెట్ అయితే, చిరు ఒప్పుకుంటే నాకేమీ అభ్యంతరం లేదని బాలయ్య అనడంతో ఈ మల్టీస్టారర్ పై ఆశలు చిగురించాయి. గతంలో వీరిద్దరూ ‘నకిలీ మనిషి’ చిత్రంలో నటించారు. ఈ చిత్రం 1980లో విడుదలైంది. ఇన్నాళ్లకు ఈ కాంబినేషన్ మళ్లీ సెట్ కాబోతోంది.
ఏడాది కిందనే బాలకృష్ణ - చిరంజీవి మల్టీ స్టారర్ ను ప్లాన్ చేశారు. ‘అఖండ’,‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన బాలయ్యతో చిరంజీవి సినిమా దాదాపు ఓకే అయ్యిందనే వార్తలు వచ్చాయి. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ భారీ మల్టీస్టారర్ రూపుదిద్దుకుంటుందని సినీ వర్గాల్లో తెగ ప్రచారం జరిగింది.
అప్పటికే చిరంజీవి... నాలుగైదు చిత్రాల్లో నటిస్తుండటంతో ఈ క్రేజీ కాంబోకు బ్రేక్ పడింది. ప్రస్తుతం చిరంజీవి ఒక్కో ప్రాజెక్ట్ ను పూర్తిచేసుకుంటూ వస్తున్నాడు. వచ్చే ఏడాది వరకు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ పూర్తికానున్నాయి. ఆ తర్వాత బాలయ్య - చిరంజీవి మల్టీస్టారర్ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ (Allu Aravind) కూడా అదిరిపోయే కామెంట్స్ చేశారు.
‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే’ సీజన్ 2 టాక్ షోకు లేటెస్ట్ ఎపిసోడ్ కు నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు, ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు గెస్ట్స్ గా హాజరయ్యారు. ఈ షోలో అల్లు అరవింద్ చిరంజీవి - బాలకృష్ణ మల్టీస్టారర్ పై స్పందించారు. త్వరలో ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నామని తెలిపారు.
చిరంజీవి - బాలయ్య కాంబినేషన్ లో సినిమాను ప్లాన్ చేస్తున్నానని అన్నారు. దీనిిపై బాలయ్య స్పందిస్తూ.. ‘అప్పుడది పాన్ వరల్డ్’ సినిమా అవుతుందని అన్నారు. ప్రస్తుతం సీనియర్లు హీరోలుగా బాలయ్య, చిరు దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ క్రేజీ కాంబో సెట్ అయితే మంచి మార్కెట్ కూడా ఉంటుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇక ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్, నందమూరి ఫ్యామిలీ నుంచి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి ‘ఆర్ఆర్ఆర్’లో నటించిన విషయం తెలిసిందే. వీరి పెర్ఫామెన్స్ కు సినిమా ప్రపంచ వ్యాప్తంగా దుమ్ములేపింది. ఈ తరుణంలో చిరు- బాలయ్య కలిసి నటిస్తే బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందేనంటూ.. మెగా, నందమూరి అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం బాలయ్య - చిరంజీవి.. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలతో సంక్రాంతి బరిలో దిగబోతున్నారు. ఇద్దరూ ఇండస్ట్రీలో హిట్స్ తో దూసుకెళ్తుండటంతో ఈసారి మరింత పోటీ కనిపిస్తోంది.