MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Ilaiyaraaja: ఎస్పీ బాలు కాదు.. ఇళయరాజా కెరీర్‌ను నిలబెట్టిన తెలుగు సింగర్ ఎవరో తెలుసా?

Ilaiyaraaja: ఎస్పీ బాలు కాదు.. ఇళయరాజా కెరీర్‌ను నిలబెట్టిన తెలుగు సింగర్ ఎవరో తెలుసా?

ఇళయరాజా సంగీత దర్శకుడిగా పరిచయమైన తొలి సినిమా 'అన్నకిళి'.  ఈ సినిమా వెనుక ఓ తెలుగు గాయని పాత్ర చాలా ఉందని మీకు తెలుసా. ఈ సినిమా వెనుకు ఉన్న ఆసక్తికరమైన కథ ఏంటంటే? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 29 2026, 12:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఇళయరాజా సినిమా ప్రస్థానం..
Image Credit : our own

ఇళయరాజా సినిమా ప్రస్థానం..

తమిళ సినీ పరిశ్రమలో 'ఇసైజ్ఞాని'గా ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ఇళయరాజా ప్రయాణం మొదట్లో అంత సులువుగా సాగలేదు. 1970లలో నిర్మాత పంజు అరుణాచలం ఒక పల్లెటూరి నేపథ్యంలో సినిమా తీయాలనుకున్నారు. దేవరాజ్-మోహన్ దర్శకత్వంలో, ఆర్. సెల్వరాజ్ కథతో 'అన్నకిళి' సినిమాను మొదలుపెట్టారు. నిజానికి అప్పటికే గాయకుడిగా మంచి ఫామ్ లో ఉన్న ఎస్పీ బాలు ఇళయారాజాను ప్రోత్సహించి.. అవకాశాలు కల్పించాడని అంటుంటారు. కానీ ఇక్కడ మరో కొత్త కథ కూడా వైరల్ అవుతోంది. అదేంటంటే?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఇళయరాజా పేరు ఎలా వచ్చిందంటే?
Image Credit : facebook

ఇళయరాజా పేరు ఎలా వచ్చిందంటే?

అన్నకిళి సినిమాలో శివకుమార్, సుజాత హీరోహీరోయిన్లుగా నటించారు. అయితే ఈసినిమా ద్వారా కొత్త సంగీత దర్శకుడిని పరిచయం చేయాలని పంజు అరుణాచలం భావించారు. అప్పుడు కథా రచయిత సెల్వరాజ్, 'రాజా' అనే యువకుడిని ఆయనకు పరిచయం చేశారు. రాజా కంపోజ్ చేసిన కొన్ని ట్యూన్లు విని పంజు అరుణాచలం చాలా ఇంప్రెస్ అయ్యారు. అప్పటికే ఇండస్ట్రీలో 'రాజా' పేరుతో మరొకరు ఉండటంతో, ఈ యువకుడికి 'ఇళయరాజా' అని ఆయనే పేరు పెట్టారు.

36
ఇళయరాజా వైపు నిలబడ్డ పంజు అరుణాచలం..
Image Credit : Ilaiyaraaja/ Facebook

ఇళయరాజా వైపు నిలబడ్డ పంజు అరుణాచలం..

 అయితే ఈ కొత్త సంగీత దర్శకుడిని దర్శకులు వెంటనే ఒప్పుకోలేదు. అతని టాలెంట్‌పై పూర్తి నమ్మకం లేక, వేరే మ్యూజిక్ డైరెక్టర్‌ను పెట్టుకుందామని సూచించారు. కానీ, పంజు అరుణాచలం మాత్రం ఈ సినిమాకు ఇళయరాజానే సరైనోడని బలంగా నిలబడ్డారు. దీంతో దర్శకులు ఒక పరీక్ష పెట్టాలని నిర్ణయించారు. ఒక కల్యాణ మండపంలో చిన్న మ్యూజిక్ ప్రోగ్రాం పెట్టి, అక్కడ ఇళయరాజా తన పాటలతో టాలెంట్ నిరూపించుకోవాలని చెప్పారు.

46
ఎస్ జానకి వల్ల ఇళయరాజాకు అవకాశం..
Image Credit : Facebook

ఎస్ జానకి వల్ల ఇళయరాజాకు అవకాశం..

ఆ కార్యక్రమానికి అప్పటి స్టార్ సింగర్ ఎస్. జానకి రావడం ఓ విశేషం. సాధారణంగా పెద్ద గాయకులు ఇలాంటి టెస్ట్ ప్రోగ్రామ్‌లకు రారు. కానీ, ఒక టాలెంట్ ఉన్న యువకుడికి అవకాశం పోకూడదనే ఉద్దేశంతో ఆమె వచ్చారని చెబుతారు. ఆ మ్యూజిక్ ప్రోగ్రామ్‌లో ఇళయరాజా కంపోజ్ చేసిన ట్యూన్స్ అందరినీ కట్టిపడేశాయి. ఆ తర్వాతే 'అన్నకిళి' సినిమాకు ఆయన అధికారికంగా మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంపికయ్యారు.
56
మొదటి ఐదు పాటలూ సూపర్ హిట్
Image Credit : Instagram

మొదటి ఐదు పాటలూ సూపర్ హిట్

ఈ సినిమా కోసం ఇళయరాజా కంపోజ్ చేసిన ఐదు పాటలూ సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా 'అడి రాక్కాయి మూక్కాయి', 'అన్నకిళి ఉన్నై తేడుదే', 'మచ్చాన పార్థీంగళా', 'సొందం ఇల్లై బందం ఇల్లై' వంటి పాటలు ఊరూవాడా మార్మోగాయి. ఈ సినిమా తొలి పాట రికార్డింగ్ సమయంలో కరెంట్ పోవడంతో పని మధ్యలోనే ఆగిపోయింది. రెండోసారి ప్రయత్నించినప్పుడు సౌండ్ సిస్టమ్‌లో టెక్నికల్ ప్రాబ్లమ్ వచ్చింది. మూడో ప్రయత్నంలో పాటను విజయవంతంగా రికార్డ్ చేశారు.
66
బ్లాక్ బస్టర్ హిట్ సినిమా..
Image Credit : our own

బ్లాక్ బస్టర్ హిట్ సినిమా..

1976 మే నెలలో 'అన్నకిళి' సినిమా రిలీజైంది. తక్కువ బడ్జెట్ సినిమా కావడంతో మొదట్లో డిస్ట్రిబ్యూటర్లు కొనడానికి వెనుకాడారు. దీంతో చాలా తక్కువ ధరకే అమ్మాల్సి వచ్చింది. మొదటి రోజు థియేటర్లలో పెద్దగా స్పందన రాలేదు. కానీ, మౌత్ టాక్‌తో సినిమా నెమ్మదిగా పుంజుకుంది. ముఖ్యంగా వారపత్రికల్లో వచ్చిన పాజిటివ్ రివ్యూలు సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. ఆ తర్వాత 'అన్నకిళి' తమిళనాడు అంతటా హిట్టై, చాలా థియేటర్లలో 100 రోజులకు పైగా ఆడింది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Varshini: ఆమెని సుధీర్ మీదికి తోమడానికి పంపుతున్నాడు.. వర్షిణి, షాలిని మధ్య మంటలు.. నరేష్ కూడా తగ్గేదేలే
Recommended image2
Samantha: ఘనంగా సమంత సీమంతం..సంప్రదాయాలంటే నాకు ఎప్పుడూ గౌరవమే, బలమైన శక్తి దాగుంది
Recommended image3
Daali Dhananjay: కొడుక్కి వెరైటీ పేరు పెట్టిన పుష్ప విలన్.. ఆ పేరుకు పెద్ద కథే ఉంది!
Related Stories
Recommended image1
Peddi piracy: పెద్ది రిలీజ్ కు ముందే ఐబొమ్మా కు షాక్, పైరసీపై మద్రాస్ హైకోర్డ్ సంచలన తీర్పు..
Recommended image2
Lady Superstar: 50 కోట్ల ప్రైవేట్ జెట్, 200 కోట్ల పైగా ఆస్తి, CA అవ్వాలనుకుని.. హీరోయిన్ అయిన బ్యూటీ ఎవరు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved