Janaki kalaganaledu: గర్భవతైన జానకి.. సంతోషంలో జ్ఞానాంబ, గోవిందరాజు!
Janaki kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు (Janaki kalaganaledu) సీరియల్ మంచి కుటుంబ కథ నేపథ్యంలో ప్రసారం కావడంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. జ్ఞానాంబ (Jnanaamba) దంపతులు ఒకరికొకరు స్వీట్స్ తినిపించుకుంటూ ఉండగా ఫ్యామిలీ మొత్తం ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ ఉంటారు.

ఇక మల్లిక (Mallika) మాత్రం పోలేరమ్మ.. పెద్దకోడలను పొగడడం నాకు ఏమాత్రం నచ్చడం లేదని జలసీ గా ఫీల్ అవుతుంది. ఈలోపు అక్కడకు నీలావతి వచ్చి వాళ్ళిద్దరూ కు శుభాకాంక్షలు తెలిపి జ్ఞానాంబ (Jnanaamba) ఇంకా మనవడు పుట్టడానికి నోచుకోలేదని పాపం అంటూ దెప్పి పొడుస్తుంది.
దానికి జ్ఞానాంబ (Jnanaamba) ఎంతో ఫీల్ అవుతుంది. దాంతో గోవింద రాజు (Govindaraju).. నీలావతి పై ఏ సమయంలో ఏం మాట్లాడాలో తెలియదా అంటూ ఘోరంగా విరుచుకుపడతాడు. ఇక నీలావతి బిడ్డ విషయంలో వైజయంతి తో జ్ఞానాంబ సవాల్ చేసిన విషయం చెబుతుంది.
ఇక నీలావతి మాటలకు అసహనం వ్యక్తం చేసిన జ్ఞానాంబ (Jnanaamba) అక్కడి నుంచి వెళ్లి పోతుంది. ఇక ఆ తరువాత ఫ్యామిలీ అంతా బాధపడానికి కారణం నీలావతి (Neelavathi) వల్లనే అని చర్చించుకుంటారు. అదే క్రమంలో ఎవరో ఒకరు పిలవకుండానే నీలావతి అక్కడికి ఎందుకు వస్తుంది అని డౌట్ వ్యక్తం చేస్తారు.
ఇక మల్లిక (Mallika) ఆమె యాక్టింగ్ తో ఆ విషయాన్ని కవర్ చేస్తుంది. మరోవైపు జ్ఞానాంబ (Jnanaamba) ఇన్నేళ్లు అయినా నా కోడళ్ళు బిడ్డను కనడానికి నోచుకోవడానికి కారణం ఏంటో తెలుసుకునే బాధ్యత నాదే అంటూ బాధపడుతుంది.
ఇక లేట్ అయినా తప్పకుండా నీ కోరిక నెరవేరుతుందని గోవిందరాజు (Govinda raju) బాధపడకు అని ధైర్యం చెబుతాడు. ఆ తర్వాత జానకి (Janaki) వాంతులు చేసుకుంటూ ఉండగా జ్ఞానాంబ దంపతులు జానకి నీల్లోసుకుందని గ్రహించుకుంటారు.
దాంతో వారిద్దరు దంపతులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తారు. ఇక ఆ గుడ్ న్యూస్ ని జ్ఞానాంబ (Jnanaamba).. నీలావతికి రిటర్న్ గిఫ్ట్ గా ఇస్తుంది. అంతేకాకుండా ఈ విషయాన్ని వైజయంతి కి (Vaijayanthi) కూడా చెప్పమని ప్రౌడ్ గా చెబుతుంది ఇక ఈ క్రమంలో రేపటి భాగంలో ఎం జరుగుతుందో చూడాలి.