- Home
- Entertainment
- 150 దేశాలు బ్యాన్ చేసిన సినిమా, డైరెక్టర్ ను హత్య చేసేంత వివాదం అయిన మూవీ ఏదో తెలుసా?
150 దేశాలు బ్యాన్ చేసిన సినిమా, డైరెక్టర్ ను హత్య చేసేంత వివాదం అయిన మూవీ ఏదో తెలుసా?
దాదాపు 150 దేశాల్లో నిషేదం విధించిన సినిమా గురించి మీకు తెలుసా? ఈసినిమా ఎంత వివాదం అయ్యిందంటే.. ఈసినిమా కాంట్రవర్సీవల్ల డైరెక్టర్ ను హత్య కూడా చేశారు. ఇంతకీ ఎంటా సినిమా? ఎప్పుడు రిలీజ్ అయ్యింది?

కొన్ని సినిమాలు సమాజంపై చెడు ప్రభావాన్ని చూపిస్తాయి. అటువంటి సినిమాలను బ్యాన్ చేయడం సహజంగా జరుగుతుంటుంది. కాని కొన్ని దేశాల్లో మాత్రంఇటువంటివి పట్టించుకోరు. కాని కొన్ని సినిమాలు మాత్రం దేశాలనే భయపడుతుంటాయి. అలా ప్రపంచంలోచాలా దేశాలను భయపెట్టిన సినిమా గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.
ఈ సినిమా పేరు సోలో: ది 120 డేస్ ఆఫ్ సోడోమ్. ఈసినిమా ఇప్పటివరకు రిలీజైన అత్యంత వివాదాస్పద సినిమాల్లో ఇదే ముందుంది. సోలో: ది 120 డేస్ ఆఫ్ సోడోమ్ సినిమాను ఏకంగా 150 దేశాలలో నిషేధించారు. 1975లో విడుదలైన ఈ ఇటాలియన్ సినిమా కథ, సన్నివేశాల కారణంగా వివాదం అయ్యింది. అందుకే నిషేదానికి గురయ్యింది.
అంతేకాదు చాలా విచిత్రమైన పరిస్థితి ఏంటంటే.. ఈ సినిమా రిలీజైన తర్వాత దర్శకుడు పియర్ పాలో పసోలి హత్యకు గురైయ్యాడు. దాంతో ఈ సినిమాపై మరింత వివాదాం చెలరేగింది. మార్క్విస్ డి సేడ్ రాసిన 1785 నవల 'ది 120 డేస్ ఆఫ్ సోడోమ్' ఆధారంగా ఈసినిమా రూపొందించబడింది. అయితే ఇందులో రెండవ ప్రపంచ యుద్ధానికి సబంధిచిన కథను తెరెక్కించారు. హింస, లైంగిక వేధింపుల సన్నివేశాల కారణంగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వివాదానికి దారితీసింది. అదే వివాదానికి కేంద్రబిధువుగా మారింది.
ఈ సినిమాలో కిడ్నాప్ చేయబడిన కొంతమంది పిల్లలను నాజీల కీలుబొమ్మలుగా మార్చినట్లు చిత్రీకరించారు. ఈ సినిమాలో లైంగిక వేధింపులు, హత్యలతో పాటు కిడ్నాప్ చేయబడిన పిల్లలను క్రూరంగా హింసించడం వంటి హింసాత్మక దృశ్యాలు ఉన్నాయి. 18 మంది యువకులను కిడ్నాప్ చేసి నాలుగు నెలల పాటు శారీరకంగా, మానసికంగా హింసిస్తారు. అది చూడటానికి ఇబ్బందికరంగా ఉండటం.. పిల్లలు చూసే విధంగా లేకపోవడంతో చాలా దేశాలు ఈసినిమాను నిషేదించాయి. అయితే అమెజాన్ ప్రైమ్ లో ఈసినిమా అందుబాటులో ఉంది.