- Home
- Entertainment
- `ది గర్ల్ ఫ్రెండ్` మూవీ ఐదు రోజుల కలెక్షన్లు.. ఫస్ట్ సినిమాతోనే బాక్సాఫీసుని షేక్ చేస్తోన్న రష్మిక మందన్నా
`ది గర్ల్ ఫ్రెండ్` మూవీ ఐదు రోజుల కలెక్షన్లు.. ఫస్ట్ సినిమాతోనే బాక్సాఫీసుని షేక్ చేస్తోన్న రష్మిక మందన్నా
రష్మిక మందన్నా తాను నటించిన తొలి లేడీ ఓరియెంటెడ్ మూవీతోనే హిట్ కొట్టింది. తాజాగా ఆమె నటించిన `ది గర్ల్ ఫ్రెండ్` మూవీ ఐదు రోజుల కలెక్షన్లని ప్రకటించింది టీమ్.

థియేటర్లో సందడి చేస్తోన్న రష్మిక మందన్నా `ది గర్ల్ ఫ్రెండ్` మూవీ
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా మొదటిసారి లేడీ ఓరియెంటెడ్ కథతో `ది గర్ల్ ఫ్రెండ్` మూవీ చేసింది. నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని బ్యానర్స్ పై ఈ చిత్రం రూపొందింది. గత శుక్రవారం ఆడియెన్స్ ముందుకు వచ్చిందీ చిత్రం. లవ్ స్టోరీ నేపథ్యంలో అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో సాగే ఈ సినిమాకి ఆడియెన్స్ నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. మహిళలు, అమ్మాయిలు చూడాల్సిన సినిమా అని రివ్యూస్ చెప్పాయి.
ది గర్ల్ ఫ్రెండ్ ఐదు రోజుల కలెక్షన్లు
ఇక కమర్షియల్‌గా ఈ చిత్రం ఎంత వరకు సత్తా చాటుతుంది. ఎంత వరకు వసూళ్లని రాబడుతుందనే సస్పెన్స్ కొనసాగింది. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కలెక్షన్లని ప్రకటించింది టీమ్. ఐదు రోజుల్లో ఈ సినిమా రూ.20కోట్లు కలెక్ట్ చేసిందట. తాజాగా టీమ్ ఈ మూవీ కలెక్షన్ పోస్టర్ ని విడుదల చేసింది. రూ.20.4 కోట్లు వసూలు చేసినట్టు టీమ్ వెల్లడించింది. ఈ సినిమాకి కలెక్షన్లు ఎంత వస్తాయనే డౌట్ అందరిలో ఉంది. బ్రేక్ ఈవెన్ అవుతుందా అని భావించారు. నిర్మాత అల్లు అరవింద్ కూడా ఇది రిస్క్ ప్రాజెక్ట్ అని తెలిపారు.
బ్రేక్ ఈవెన్ దాటి సక్సెస్ దిశగా ది గర్ల్ ఫ్రెండ్
కానీ కలెక్షన్లు డీసెంట్‌గానే ఉండటం విశేషం. అయితే ఈ చిత్రం ఇప్పటికే బ్రేక్ ఈవెన్ దాటింది. `ది గర్ల్ ఫ్రెండ్` చిత్రానికి థియేట్రిక్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.6.5కోట్లు అయ్యింది. నైజాం రెండు కోట్లు, ఆంధ్రా రెండు కోట్లు, సీడెడ్ యాభై లక్షలు, ఇతర స్టేట్స్ కలిపి ఒక కోటి, ఓవర్సీస్‌లో కోటి వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ అయ్యింది. అయితే ఈ చిత్రానికి ఓవర్సీస్‌లోనే సుమారు ఐదు కోట్లు రావడం విశేషం. అక్కడ ఇది దుమ్మురేపుతుంది. ఇక తెలుగు స్టేట్స్ లోనూ మంచి వసూళ్లని రాబట్టింది. దీంతో ఇప్పటికే ఇది బ్రేక్ ఈవెన్ దాటి లాభాల్లోకి వెళ్లిందని చెప్పొచ్చు. బయ్యర్లు సేఫ్‌లో ఉన్నారు. ఈ రెండు మూడురోజులు కూడా ఈ చిత్రానికి మంచి వసూళ్లు వచ్చే అవకాశం ఉంది.
ప్రియుడిపై లవర్ తిరుగుబాటు
రష్మిక మందన్నా తొలిసారి లేడీ ఓరియెంటెడ్ మూవీ చేసింది. తొలి చిత్రంతోనే ఆమె హిట్ కొట్టడం విశేషం. పాన్ ఇండియా చిత్రాలతో సక్సెస్ అందుకోవడం ఓ విశేషమైతే, తన లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతోనూ సక్సెస్ అందుకోవడం మరో విశేషం. ఇకపై రష్మిక మహిళా ప్రధానమైన కథలకు కేరాఫ్‌గా నిలుస్తుందని చెప్పొచ్చు. `ది గర్ల్ ఫ్రెండ్` చిత్రంలో దీక్షిత్ శెట్టి హీరోగా నటించగా, రావు రమేష్, రాహుల్ రవీంద్రన్ కీలక పాత్రలు పోషించారు. అమ్మాయి మగాడి చెప్పుచేతల్లో ఉండే బొమ్మ కాదు, ఆయన చెప్పినట్టు విని ఇంట్లో పడి ఉండే అబ్బాయి కాదని, తనకంటూ కొన్ని డ్రీమ్స్ ఉంటాయని, ఆ దిశగా ప్రోత్సహించాలని చెప్పే చిత్రమిది. తనని అర్థం చేసుకోలేని బాయ్ ఫ్రెండ్‌పై ఒక లవర్, తక్కువ చేసి చూసే తండ్రిపై కూతురు చేసే తిరుగుబాటే ఈ చిత్రం.