MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • సిమ్రాన్‌ ఫస్ట్ శాలరీ ఎంతో తెలుసా? యాంకర్‌గా చూసి జయా బచ్చన్‌ పిలుపు, దశ తిరిగింది ఇక్కడే

సిమ్రాన్‌ ఫస్ట్ శాలరీ ఎంతో తెలుసా? యాంకర్‌గా చూసి జయా బచ్చన్‌ పిలుపు, దశ తిరిగింది ఇక్కడే

Simran: హీరోయిన్‌ సిమ్రాన్‌ బాలీవుడ్‌ సినిమాలతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. కానీ ఆమె మొదట చేసింది యాంకరింగ్‌. ఆ సమయంలో సిమ్రాన్‌ పారితోషికం ఎంతో తెలుసా? 

3 Min read
Author : Aithagoni Raju
Published : Nov 11 2025, 12:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
`టూరిస్ట్ ఫ్యామిలీ`తో మళ్లీ వైరల్‌గా మారిన సిమ్రాన్‌
Image Credit : instagram/simran

`టూరిస్ట్ ఫ్యామిలీ`తో మళ్లీ వైరల్‌గా మారిన సిమ్రాన్‌

బాలకృష్ణతో నటించిన `సమరసింహారెడ్డి` చిత్రంతో తెలుగులో ఒక్కసారిగా పాపులర్‌ అయ్యింది హీరోయిన్‌ సిమ్రాన్‌. ఈ చిత్రంతో స్టార్‌ అయిపోయింది. తెలుగులో బిజీ అయిపోయింది. అయితే సిమ్రాన్ కేవలం తెలుగులోనే కాదు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడలోనూ సినిమాలు చేసి మెప్పించింది. అక్కడ కూడా స్టార్‌గా రాణించింది. అప్పట్లో బిగ్‌ స్టార్స్ అందరితోనూ కలిసి నటించింది. వరుస విజయాలతో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. పెళ్లి తర్వాత కొంత కాలం గ్యాప్‌ తీసుకున్న సిమ్రాన్‌ ఇటీవల మళ్లీ వైరల్‌గా మారింది. ఆ మధ్య తమిళంలో ఆమె నటించిన `టూరిస్ట్ ఫ్యామిలీ` చిత్రం పెద్ద విజయం సాధించింది. దీంతో మరోవైపు అందరి చూపు సిమ్రాన్‌పై పడింది. తెలుగు మేకర్స్ కూడా ఆమెని మళ్లీ టాలీవుడ్‌లోకి తీసుకురావాలని ప్లాన్‌ చేస్తున్నారట.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
తెలుగులో సిమ్రాన్‌ సినిమాలు మానేసి 17 ఏళ్లు
Image Credit : instagram/simran

తెలుగులో సిమ్రాన్‌ సినిమాలు మానేసి 17 ఏళ్లు

సిమ్రాన్‌ ఇప్పుడు చాలా సెలక్టీవ్‌గా వెళ్తోంది. ఏడాదికి రెండు మూడు సినిమాలు తప్ప ఎక్కువగా చేయడం లేదు. అందులోనూ తమిళంకే పరిమితమయ్యింది. ఇక తెలుగులో ఆమె `ఒక్కమగాడు`, `జాన్‌ అప్పారావు 40 ప్లస్‌` చివరి చిత్రాలుగా చెప్పొచ్చు. 2008 తర్వాత మళ్లీ తెలుగువైపు చూడలేదు. సిమ్రాన్‌ టాలీవుడ్‌ని వదిలేసి ఆల్మోస్ట్ 17ఏళ్లు అవుతుందని చెప్పొచ్చు. తెలుగులోకి రీఎంట్రీ ఇస్తుందా? కోలీవుడ్‌ కే పరిమితమవుతుందా? అనేది సస్పెన్స్ గా మారిన నేపథ్యంలో సిమ్రాన్‌కి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఆమె అరుదైన ఇంటర్వ్యూ విషయాలు ఇంట్రెస్టింగ్‌గా మారాయి.

35
సిమ్రాన్‌ ఫస్ట్ శాలరీ
Image Credit : instagram/simran

సిమ్రాన్‌ ఫస్ట్ శాలరీ

మహారాష్ట్రకి చెందిన సిమ్రాన్‌ సినిమాల్లోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదు. ఫ్యాషన్‌ డిజైనర్‌ కావాలనుకుందట. డ్రెసెస్‌ అంటే చాలా ఇష్టం. కొత్త కొత్త సూట్‌లు డిజైన్లు చేయాలని కలలు కన్నదట. కానీ అనుకోకుండా యాంకర్‌గా మారాల్సి వచ్చిందని చెప్పింది సిమ్రాన్‌. ఈనాడుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను పంచుకుంది. డీడీ(దూరదర్శన్‌) మెట్రోలో యాంకర్‌ సెలక్షన్స్ జరుగుతున్నాయంటే వెళ్లితే, అనుకోకుండా సెలక్ట్ అయ్యిందట. అమ్మ కూడా ప్రోత్సహించడంతో ఆ రంగంలోకి కొనసాగింది. డీడీలో `సూపర్‌హిట్‌ ముకాబులా` షోకి యాంకర్‌గా చేసి పాపులర్‌ అయ్యింది. ఆ టైమ్‌లో తాను తీసుకున్న పారితోషికం రూ.3500. ఇది సిమ్రాన్‌ తొలి పారితోషికం. ఇది ముప్పై(1995) ఏళ్ల క్రితం పారితోషికం కావడం విశేషం.

45
సిమ్రాన్‌ రెమ్యూనరేషన్‌
Image Credit : instagram/simran

సిమ్రాన్‌ రెమ్యూనరేషన్‌

డీడీలో సిమ్రాన్‌ యాంకరింగ్‌, చలాకీతనం, లుక్స్, ఫిజిక్‌ చూసి బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ భార్య, నటి జయా బచ్చన్‌ ముచ్చటపడింది. ఆ టైమ్‌లో వాళ్లు తన ప్రొడక్షన్‌లో సినిమాని నిర్మిస్తున్నారు. అంతా కొత్తవాళ్లతోనే ఈ మూవీని రూపొందిస్తున్నారట. హీరోయిన్‌ పాత్ర కోసం సిమ్రాన్‌ అయితే బాగుంటుందని ఆమెని పిలిపించారు. అమితాబ్‌ బచ్చన్‌ ప్రొడక్షన్‌ నుంచి పిలుపు అంటే మామూలు విషయం కాదు, దీంతో మరో మాట లేకుండా ఆడిషన్‌కి వెళ్లిందట సిమ్రాన్‌. అలా `సనమ్‌ హార్‌జాయ్‌` అనే చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైంది సిమ్రాన్‌. తొలిసారిగా మేకప్‌ వేసుకుని, ఖరీదైన దుస్తులు ధరించి హీరోయిన్‌గా కెమెరా ముందు నిలబడ్డ క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపింది సిమ్రాన్‌. అలా తన సినిమా జీవితం ప్రారంభమైందని చెప్పింది. అయితే మధ్యలో మళ్లీ ఫ్యాషన్‌ డిజైనింగ్‌ సైడ్‌ వెళ్లాలని అనుకుందట. కానీ వరుసగా సినిమా ఆఫర్లు రావడంతో ఇక బ్యాక్‌ వెళ్లలేకపోయినట్టు చెప్పింది సిమ్రాన్. రూ.3500 తో కెరీర్‌ ప్రారంభించిన సిమ్రాన్‌ హీరోయిన్‌గా పీక్‌లో ఉన్నప్పుడు దాదాపు రూ.కోటి వరకు తీసుకుందట. ఇప్పుడు ఒక్కో మూవీకి రూ.30-40లక్షల వరకు తీసుకుంటుందని సమాచారం.

55
తెలుగు ఆడియెన్స్ ని మళ్లీ పలకరిస్తుందా?
Image Credit : simran insta

తెలుగు ఆడియెన్స్ ని మళ్లీ పలకరిస్తుందా?

తెలుగులో తనకు తొలి చిత్రం `అబ్బాయిగారి పెళ్లి`, అది పెద్దగా ఆడలేదని, ఆ తర్వాత రెండేళ్లపాటు తెలుగులో మూవీస్‌ చేసినా గుర్తింపు రాలేదని, ఆ సమయంలో బాలకృష్ణతో `సమరసింహారెడ్డి` మూవీలో నటించే ఛాన్స్ వరించిందని, ఆ మూవీ పెద్ద విజయం సాధించడంతో తెలుగులో వరుసగా ఆఫర్లు వచ్చినట్టు తెలిపింది సిమ్రాన్‌. తెలుగు ఆడియెన్స్ తనని ఎంతగానో ప్రేమించి, ఆదరించారని చెప్పింది సిమ్రాన్‌. ఇంతటి ప్రేమ, ఆదరణ తనకు దక్కిన అదృష్టమని వెల్లడించింది. దాదాపు 13ఏళ్ల క్రితం తన ఇంటర్వ్యూలో సిమ్రాన్‌ ఈ విషయాలను పంచుకున్నారు. యాభై ఏళ్లు వచ్చినా ఇప్పటికీ తరగని అందంతో ఆకట్టుకుంటోంది సిమ్రాన్‌. మరి తెలుగులోకి మళ్లీ ఎప్పుడు కమ్‌ బ్యాక్‌ అవుతుందో చూడాలి.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Katrina Kaif Trolling: కత్రినా ట్రోల్ అవుతుంటే సల్మాన్ ఫైర్ అయ్యాడు.. మరి భర్త విక్కీ కౌశల్ ఎందుకు సైలెంట్?
Recommended image2
The Paradise Review: నాని జాతకం మారబోతోందా? స్టార్ హీరోల లిస్ట్ లో చేరినట్టేనా? ది పారడైజ్ మూవీ ఫస్ట్ రివ్యూ..
Recommended image3
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Related Stories
Recommended image1
తీవ్ర అస్వస్థతలో లెజెండరీ నటుడు ధర్మేంద్ర.. రూమర్లపై స్పందించిన కూతురు
Recommended image2
శివ మూవీ రివ్యూ, నాగార్జున ట్రెండ్ సెట్టింగ్‌ సినిమా రీ రిలీజ్‌ లో ఆ మ్యాజిక్ రిపీట్‌ చేసిందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved