MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పవిత్ర లోకేష్ పై ఫైర్ అవుతున్న మాజీ భర్త, నరేష్ భార్య.. బయటపడ్డ సంచలన నిజాలు.!

పవిత్ర లోకేష్ పై ఫైర్ అవుతున్న మాజీ భర్త, నరేష్ భార్య.. బయటపడ్డ సంచలన నిజాలు.!

నరేష్ - పవిత్రా లోకేష్ పెళ్లి విషయం ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో నటి పవిత్రా లోకేష్ పై ఆమె మాజీ భర్త, ఇటు నరేష్ భార్య ఫైర్ అవుతున్నారు. పవిత్ర గురించి సంచనల వ్యాఖ్యలు చేస్తున్నారు. 

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Jul 02 2022, 11:58 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

టాలీవుడ్ సీనియర్ నటీనటులు నరేష్ - పవిత్రా లోకేష్ పెళ్లి చేసుకోబోతున్నట్టు ఇటీవల జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంగా ఇటు నటి పవిత్రా లోకేష్, నటుడు నరేష్ పైనా వారి మాజీల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా పవిత్రా లోకేష్ పైన ఆమె మాజీ భర్తతో పాటు, నరేష్ భార్య సంచలన వ్యాఖ్యలు చేసింది.
 

28

కర్ణాటకకు చెందిన పవిత్రా లోకేష్  (Pavitra Lokesh) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కన్నడ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ప్రేక్షకులను అలరించింది. సెకండ్ ఇన్నింగ్ లో మాత్రం మదర్, అత్త తదితర పాత్రలను పోషిస్తోంది. పవిత్రా లోకేష్ అటు కన్నడతో పాటు ఇటు టాలీవుడ్ లో నూ వందకు పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు సుపరిచితురాలైంది.
 

38

ఆమె పర్సనల్ విషయానికొస్తే కర్ణాటకలోని మైసూర్ లో జన్మించింది. అక్కడే ఉన్నత విద్యనభ్యసించిన పవిత్రా నటన రంగాన్ని లక్ష్యంగా ఎంచుకొని బెంగళూరుకు వచ్చింది. సినీ రంగంలో కాస్తా నిలదొక్కుకున్నాక ఓ సాఫ్ట్ వేర్ వ్యక్తితో మొదటి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత కన్నడ నటుడు సుచేంద్ర ప్రసాద్ (Suchendra Prasad)తో లివిన్ రిలేషన్ షిప్ మెయింటేన్ చేసింది. 
 

48

గతంలో తన మొదటి భర్తతో విడిపోగా.. రెండో భర్త సుచేంద్ర ప్రసాద్ తో 2018లో బంధం తెంచేసుకుంది. తాజాగా ఆమె మూడోసారి టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ (Naresh)తో పెళ్లికి సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తోంది. తాజాగా పవిత్రా లోకేష్ పై మాజీ భర్త సుచేంద్ర ప్రసాద్ స్పందించారు. 
 

58

ఈ సందర్భంగా సుచేంద్ర సంచన వ్యాఖ్యలు చేశారు. పవిత్రాకు కాపురాలు కూల్చడం మామూలేనని, పెళ్లైన తొలినాళ్లలో కాస్తా బాగుందన్నారు.  తమకు ఇద్దరు పిల్లలు పుట్టాక వదిలేసి వెళ్లిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఆమె లగ్జరీ లైఫ్, మనీ మైండెడ్ అంటూ విమర్శించారు. ఆర్థికంగా ఆమె అంచనాలకు చేరుకోకపోవడంతో తనను వదిలి వెళ్లిపోయిందని తెలిపారు.

68

అలాగే, పవిత్రాది దోచుకునే మనస్తత్వం అని, ఆమెది శ్రమించే తత్వం కాదని స్పందించారు. ప్రస్తుతం నటుడు నరేష్ ను పట్టుకుందని మండిపడ్డారు. చేతికి డబ్బులు రాగానే ఆరు నెలల గడవకముందే నరేష్ పరిస్థితి కూడా అంతేనని విమర్శించారు. పవిత్ర వ్యక్తిత్వాన్ని చాలా లోతుగా చూశానని తెలిపారు. 

78

ఇక అటు నరేష్ మూడో భార్య రమ్య కూడా పవిత్ర గురించి సంచనల వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. పవిత్రా వల్లే నరేష్ తనకు దూరమవుతున్నాడని విమర్శించింది. వీరిద్దరి రిలేషన్ పై ఎప్పుడు రూమర్లు వచ్చిన అనూమానించలేదని, తను కర్ణాటకలోనే పుట్టడంతో పవిత్రాను కన్నడ వాసిగా ఎంతో దగ్గర చేశానని పేర్కొంది. కానీ తనకే వెన్నుపోటు పొడుస్తుందని ఊహించలేకపోయానని, చాలా బాధగా ఉందని తెలిపారు. 
 

88

అటు నరేష్ పైనా రమ్య మండిపడుతోంది. తనకు విడాకులు ఇవ్వకుండానే పెళ్లి చేసుకున్నాడని ఆరోపించింది. ఎట్టి పరిస్థితుల్లో నరేష్ కు విడాకులు ఇచ్చే ప్రసక్తే లేదంటూ రమ్య రఘుపతి వ్యాఖ్యానించారు. ఇక నరేష్ మాత్రం రమ్య తనను మోసం చేసిందంటూ ఆరోపిస్తున్నారు. డబ్బు కోసమే తనను బ్లాక్ మెయిల్ చేస్తోందని మండిపడుతున్నారు. ఇక ఈ సమస్య ఎలా సద్దుమణుగుతుందో చూడాలి.
 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Superstar krishna: ఎన్టీఆర్‌ వార్నింగ్‌ ఇచ్చాడు, డైరెక్టర్‌ చనిపోయాడు, అయినా కృష్ణ తగ్గలేదు.. ఇండస్ట్రీ రికార్డులన్నీ షెడ్డుకి
Recommended image2
50 ఏళ్ల మహేష్ బాబు హీరోయిన్, 50 కోట్ల ఆస్తులు.. సిమ్రాన్ బ్యూటీ సీక్రెట్ ఏంటో తెలుసా?
Recommended image3
4000 కోట్ల సినిమా, సాయిపల్లవి, రణ్‌బీర్, యష్ ల రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved