వార్ 2 కంటే ముందు వైఆర్ఎఫ్ని నిలువునా ముంచేసిన మూవీ.. ఏడేళ్ల క్రితం ఓ పీడకల
7 ఏళ్ల క్రితం ఒక సినిమా రిలీజైంది. అప్పట్లో అదే అత్యంత ఖరీదైన సినిమా. దేశంలోని ఇద్దరు పెద్ద సూపర్ స్టార్లు, ఒక టాప్ హీరోయిన్ ఇందులో నటించారు. అయినా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఆ సినిమా గురించి తెలుసుకోండి...

7 ఏళ్ల క్రితం వచ్చిన ఆ సినిమాలో ఇద్దరు దిగ్గజ స్టార్లు
ఏడేళ్ల క్రితం ఓ సినిమాలో సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్, మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ నటించారు. కత్రినా కైఫ్, ఫాతిమా సనా షేక్ కూడా కీలక పాత్రలు పోషించారు. ఆ మూవీ మరేదో కాదు.. 2018 నవంబర్ 8న రిలీజైన ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’.
దేశంలోనే అత్యంత ఖరీదైన సినిమాల్లో ఒకటి
'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్' దేశంలోనే అత్యంత ఖరీదైన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. బాక్స్ ఆఫీస్ ఇండియా రిపోర్ట్ ప్రకారం, ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ.310 కోట్లు. విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహించగా, ఆదిత్య చోప్రా యశ్‌రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మించారు.
థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ బాక్సాఫీస్ కలెక్షన్
BOI ప్రకారం, 'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్' మొదటి రోజు ఇండియాలో రూ.48.27 కోట్లు వసూలు చేసింది. మొదటి వారాంతంలో రూ.98.45 కోట్లు సంపాదించింది. కానీ లైఫ్‌టైమ్ కలెక్షన్ రూ.138.34 కోట్లతో ఆగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా కూడా కేవలం రూ.245.08 కోట్లు మాత్రమే రాబట్టింది. అంటే సినిమా డిజాస్టర్‌గా నిలిచింది.ఈ చిత్రం విడుదలై ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా నెటిజన్లు మరోసారి ట్రోల్ చేస్తున్నారు.
అమితాబ్ బచ్చన్-అమీర్ ఖాన్ మొదటి సినిమా
'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్' నటులుగా అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్‌ల మొదటి, ఇప్పటివరకు ఉన్న ఏకైక సినిమా. అంతకుముందు అమీర్ ఖాన్ 'లగాన్' సినిమాకు అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఆ సినిమాకు ఆయన వ్యాఖ్యాత.
7 ఏళ్లుగా సూపర్ హిట్ కోసం అమీర్ ఖాన్ ఎదురుచూపు
'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్' డిజాస్టర్ ఫలితాన్ని అమీర్ ఖాన్ ఎక్కువగా అనుభవించారు. గడిచిన 7 ఏళ్లలో ఆయనవి రెండే సినిమాలు వచ్చాయి, అవి కూడా సూపర్ హిట్ కాలేదు. 'లాల్ సింగ్ చద్దా' డిజాస్టర్ అయితే, 'సితారే జమీన్ పర్' ఆశించినంతగా ఆడలేదు. 'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్'కు ముందు అమీర్ సినిమాలు బ్లాక్‌బస్టర్లు అయ్యేవి.
వార్ 2 తో సేమ్ సీన్ రిపీట్
'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్' కోసం మొదట హృతిక్ రోషన్, దీపికా పదుకొణెను సంప్రదించారు. కానీ ఇద్దరూ సినిమాను తిరస్కరించారు. దీపిక తన పాత్రతో, హృతిక్ స్క్రిప్ట్‌తో సంతృప్తి చెందలేదు. అలాగే, ఓ కీలక పాత్ర కోసం జాకీ ష్రాఫ్‌ను సంప్రదించగా, డేట్స్ సమస్యలతో ఆయన కూడా తిరస్కరించారు. ఏడేళ్ల క్రితం థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ చిత్రం వైఆర్ఎఫ్ సంస్థకి నష్టాల్లో ఓ పీడకలలా మిగిలింది. ఏడేళ్ల తర్వాత ఇప్పుడు ఎన్టీఆర్, హృతిక్ నటించిన వార్ 2 అలాంటి ఫలితాన్నే ఎదుర్కొంది.