- Home
- Entertainment
- ఈ వారం ఎలిమినేషన్ లో బిగ్ ట్విస్ట్, హౌస్ నుంచి వెళ్లిపోయేది ఇతడే.. ఓటింగ్ అంత దారుణమా ?
ఈ వారం ఎలిమినేషన్ లో బిగ్ ట్విస్ట్, హౌస్ నుంచి వెళ్లిపోయేది ఇతడే.. ఓటింగ్ అంత దారుణమా ?
బిగ్ బాస్ తెలుగు 9లో ఈ వారం ఎలిమినేషన్ లో బిగ్ ట్విస్ట్ ఉండబోతోంది. అందరూ ఊహించన కంటెస్టెంట్ కాకుండా మరొకరు ఎలిమినేటి అవుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

బిగ్ బాస్ తెలుగు 9
కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఈ వారం బిగ్ ట్విస్ట్ ఉండబోతోంది. ఆదివారం ఎపిసోడ్ లో ఓ కంటెస్టెంట్ ఎలిమినేట్ కాబోతున్నాడు. ఈ వారం నామినేషన్స్ లో సంజన, తనూజ, భరణి, కళ్యాణ్, రాము, సాయి శ్రీనివాస్, సుమన్ శెట్టి నామినేషన్స్ లో ఉన్నారు. వీరిలో ఎవరు సేఫ్ జోన్ లో ఉన్నారు ? ఎవరు బాటమ్ లో ఉన్నారు అనే విషయంలో ప్రేక్షకులకు ఓ క్లారిటీ ఉంది. ఎలిమినేట్ ఎవరు అవుతారు అనే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి.
డేంజర్ జోన్ లో ఉన్నది ఎవరు ?
అందుతున్న సమాచారం మేరకు తనూజ ఓటింగ్ లో టాప్ పొజిషన్ లో ఉన్నారు. కళ్యాణ్, సుమన్ శెట్టి లకు బాగానే ఓట్లు పడ్డాయి. ఇక సంజన, భరణి లకు కాస్త ఓట్లు తగ్గినప్పటికీ వారు కూడా సేఫ్ జోన్ లోనే ఉన్నట్లు తెలుస్తోంది. గత కొన్ని వారాలుగా హౌస్ లో డల్ గా కనిపిస్తున్న రాము రాథోడ్, వైల్డ్ కార్డుగా ఎంట్రీ ఇచ్చిన సాయి శ్రీనివాస్ ఓటింగ్ లో బాగా వెనుకబడ్డట్లు తెలుస్తోంది.
రాము రాథోడ్ పై ట్రోలింగ్
రాము రాథోడ్ అయితే హౌస్ లో ఉండడమే ఇంట్రెస్ట్ లేనట్లుగా బిహేవ్ చేస్తున్నాడు. ఇటీవల జరిగిన కొన్ని టాస్కుల్లో సేఫ్ గార్డ్ పొందడం కోసం అందరూ ఫైట్ చేశారు. కానీ రాము మాత్రం వెంటనే గివ్ అప్ చేసేశాడు. అలా ఎందుకు గివ్ అప్ చేస్తావు, నీ కోసం నువ్వు ఫైట్ చేయి అని తనూజ క్లాస్ పీకింది. అయినప్పటికీ ఎవరో ఒకరు కాంప్రమైజ్ కావాలి కదా అంటూ ఫైట్ చేయకుండానే పక్కకి తప్పుకున్నాడు. కాకపోతే ఎవరు మాట్లాడుకుంటున్నా అక్కడికి వెళ్లి వారి మధ్యలో దూరిపోయి కెమెరా అటెన్షన్ పొందుతున్నాడు. దీనితో రాము రాథోడ్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా జరుగుతోంది.
బిగ్ ట్విస్ట్, ఎలిమినేట్ అయ్యేది అతడే
మరోవైపు వైల్డ్ కార్డు ఎంట్రీ సాయి శ్రీనివాస్ కూడా ఓటింగ్ లో బాటమ్ లో ఉన్నాడు. అతడు ఇంతవరకు హౌస్ లో తనదైన శైలిలో పెర్ఫార్మ్ చేయలేదు. పొటెన్షియల్ ఉన్నప్పటికీ వెనుకబడిపోతున్నాడు. అందరూ ఈ వారం రాము రాథోడ్ ఎలిమినేట్ అవుతాడు అని అంటుకుంటున్నారు. కానీ ఊహించని పరిణామం జరగబోతోంది. ఈవారం హౌస్ నుంచి సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది.
రాముతో పోల్చితే అతడే బెటర్
హౌస్ లో ఉండడానికే ఆసక్తి చూపని రాముని కాకుండా.. నిరూపించుకోవడానికి ట్రై చేస్తున్న సాయి శ్రీనివాస్ ని ఎలిమినేట్ చేయడం షాకింగ్ అనే చెప్పాలి. మిగిలిన వాళ్ళతో పోల్చితే సాయి వెనుకబడిన మాట వాస్తవమే కానీ.. రాముతో పోల్చితే అతడు బెటర్ అని అంటున్నారు. సాయి శ్రీనివాస్ గోల్కొండ హై స్కూల్ లాంటి చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. ప్రస్తుతం బిగ్ బాస్ ద్వారా తన కెరీర్ ని తిరిగి ప్రారంభించాలని అనుకుంటున్నాడు.