- Home
- Entertainment
- ప్రభాస్ తన కెరీర్ లో తీసుకున్న బెస్ట్ డెసిషన్, ఈ ఒక్క మూవీ రిజెక్ట్ చేయడమే.. ఎన్నో హిట్స్ వదులుకున్నాడు కానీ
ప్రభాస్ తన కెరీర్ లో తీసుకున్న బెస్ట్ డెసిషన్, ఈ ఒక్క మూవీ రిజెక్ట్ చేయడమే.. ఎన్నో హిట్స్ వదులుకున్నాడు కానీ
ప్రభాస్ తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు వదులుకున్నాడు. ఆ జాబితాలో సింహాద్రి, కిక్ లాంటి సినిమాలు ఉన్నాయి. కానీ ఈ సినిమాని రిజెక్ట్ మంచి పని చేశాడు అని ఫ్యాన్స్ అంటున్నారు. ఆ వివరాలు ఈ కథనంలో చూద్దాం.

ప్రభాస్ సినిమాలు
ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ప్రభాస్ రాజా సాబ్, ఫౌజీ, స్పిరిట్ చిత్రాల్లో నటిస్తున్నారు. ఆ తర్వాత కల్కి చిత్రానికి సీక్వెల్ చేయాల్సి ఉంది. ఇదిలా ఉండగా ప్రభాస్ బాహుబలికి ముందు చాలా సినిమాలు రిజెక్ట్ చేశారు. ఆర్య, సింహాద్రి, కిక్ చిత్రాలు ప్రభాస్ వదులుకున్నవే. ఈ సినిమాలు చూసినప్పుడు ప్రభాస్ వీటిని ఎందుకు రిజెక్ట్ చేశాడా అని ఫ్యాన్స్ ఫీల్ అవుతారు.
ప్రభాస్ తీసుకున్న మంచి నిర్ణయం
కానీ ఒక్క సినిమాని మాత్రం రిజెక్ట్ చేసి ప్రభాస్ తన కెరీర్ లో బెస్ట్ డెసిషన్ తీసుకున్నారు అని ఫ్యాన్స్ అంటున్నారు. ఆ సినిమా మరేదో కాదు.. ఎన్టీఆర్, మెహర్ రమేష్ కాంబోలో వచ్చిన శక్తి. ఈ మూవీ రిజల్ట్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఆ మూవీ రిజెక్ట్ చేసిన ప్రభాస్
శక్తి పీఠాల నేపథ్యంలో మెహర్ రమేష్ కథని ముందుగా ప్రభాస్ కే చెప్పాడట. కంత్రి తర్వాత మెహర్ రమేష్ బిల్లా మూవీ ఐడియాని, శక్తి కథని ప్రభాస్ కి నేరేట్ చేశారు. శక్తి సినిమా కథ ప్రభాస్ కి అంత కన్విన్సింగ్ గా అనిపించలేదు. దీనితో సేఫ్ గా బిల్లా ని ఎంచుకున్నారు. బిల్లా మూవీ డీసెంట్ హిట్ అయింది. ముఖ్యంగా ప్రభాస్ ని స్టైలిష్ ప్రజెంట్ చేసిన విధానం బావుంది.
తారక్ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్
బిల్లా సినిమాని బాగా తీయడంతో మెహర్ ని జూనియర్ ఎన్టీఆర్ గుడ్డిగా నమ్మేశారు. శక్తి పీఠాలు అంటూ భారీ హంగులతో తెరకెక్కించిన ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. తారక్ కెరీర్ లో మాయని మచ్చగా నిలిచింది.
వరుస ఫ్లాపుల్లో మెహర్ రమేష్
ఈ సినిమా తర్వాత నిర్మాత అశ్విని దత్ ఏడేళ్ల పాటు ఇండస్ట్రీకి దూరమయ్యారు. ప్రభాస్ తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు రిజెక్ట్ చేసినప్పటికీ ఈ ఒక్క మూవీని వదులుకుని మంచి పని చేశారు అంటూ ఫ్యాన్స్ భావిస్తున్నారు. బిల్లా తర్వాత మెహర్ రమేష్ కి ఒక్క హిట్ కూడా దక్కలేదు. శక్తి, షాడో, భోళా శంకర్ చిత్రాలు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి.