అలాంటి నిర్ణయమే హీరో గోపీచంద్ కేరీర్ లో బిగ్ మిస్టేక్.. అందుకే ఈ పరిస్థితి!
టాలీవుడ్ హీరో గోపీచంద్ వరుస సినిమాలు చేస్తున్నా గట్టి హిట్ మాత్రం లేదనే చెప్పాలి. హీరోగాను ఆయన క్రేజ్ తగ్గుతూ వస్తోంది. ఇందుకు కారణం గతంలో ఆయన తీసుకున్న ఆ ఒక్క నిర్ణయమే అని తెలుస్తోంది.

హీరోకు కావాల్సిన అన్ని అర్హతలు గోపీచంద్ (Gopichand)కు ఉన్నాయి. ఎత్తు, ఫిట్ నెస్, గ్లామర్ అన్నీ ఉన్నాయి. వరుస చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు గోపీచంద్. కొన్ని హిట్ చిత్రాలతో సత్తా ఉన్న హీరోగా పేరు సంపాదించుకున్నాడు.
గోపీచంద్ హీరోగా ‘తొలి వలపు’ చిత్రంతో 2001లో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఈ మూవీ రిలీజ్ అయ్యాక గోపీచంద్ అందరినీ ఆకట్టుకోగలిగాడు. హీరోగా టాలీవుడ్ లో ఉన్నత స్థాయికి వెళతాడని పలువురు సినీ ప్రముఖులు కూడా అభిప్రాయపడ్డారు.
అయితే ఉన్నట్టుండి తన నెక్ట్స్ ఫిల్మ్ లో నెగెటివ్ రోల్స్ లో కనిపించాడు. మొదటి చిత్రం ‘తొలి వలపు’లో గోపీచంద్ ను హీరోగా చూసిన ఆడియెన్స్.. ఆ తర్వాత సినిమాలో విలన్ గా చూడలేకపోయారు. హీరోగా ఇంకా పూర్తిగా ఆడియెన్స్ కు కనెక్ట్ అవ్వకముందే గోపీచంద్ తన బంగారు బాటల నుంచి బయటికి వచ్చాడు.
విలన్ గా ‘జయం, నిజం, వర్షం’ వంటి చిత్రాల్లో గోపీచంద్ వరుసగా ఆడియెన్స్ ను ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలు గోపీచంద్ కు మంచి గుర్తింపు ను పెట్టాయి. దీంతో ఇక గోపీచంద్ విలన్ అనే భావన అందరిలో కలిగింది. దీన్ని గుర్తించి వెంటనే మళ్లీ హీరోగా వరుస చిత్రాల్లో నటిస్తూ వచ్చాడు. 20 ఏండ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా.. చెప్పుకోదగ్గ హిట్ మూవీస్ చాలా తక్కువే ఉన్నాయి.
ఇప్పటికీ గోపీచంద్ కేరీర్ అయోమయంలోనే ఉంది. సినిమా తర్వాత సినిమా చేస్తూ వస్తున్నా.. సక్సెస్ మాత్రం ఆమాడదూరంలో ఉంటోంది. ఇందు కారణం కేరీర్ ప్రారంభంలో గోపీచంద్ తీసుకున్న నిర్ణయాలనే అంటున్నారు. అప్పుడే హీరోగానే కంటిన్యూ చేసి ఉంటే ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్ అయ్యేవాడని అంటున్నారు.
లేదంటే విలన్ గానైనా కొనసాగి ఉంటే టాలీవుడ్ లోనే స్టార్ యాక్టర్ గా ప్రత్యేక గుర్తింపు పొంది ఉండేవాడని అంటున్నారు. అప్పుడు సరైన నిర్ణయం తీసుకోకపోవడంతో తనకంటే చిన్న హీరోలు తనను దాటి పోతున్నారని అంటున్నారు. అప్పట్లో రణం, లక్ష్యం, గోలీమార్ లాంటి సినిమాలతో ఆడియెన్స్ ను ఆకట్టుకున్నాడు.
దర్శకుడు సంపత్ నంది తెరకెక్కించిన ‘సిటీ మార్’, అంతకు ముందు ‘జిల్’ సినిమాతో కాస్తా ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం ‘పక్కా కమర్షియల్’ చిత్రంతో వస్తున్నాడు. ఇదిగాక మరో చిత్రంలోనూ గోపీచంద్ నటిస్తున్నారు. ‘పక్కా కమర్షియల్’ జూలై 1న రిలీజ్ కానుంది.