- Home
- Entertainment
- Rashmika: రష్మిక కెరీర్ ని మార్చేసిన ఆ ఒక్క డేరింగ్ స్టెప్... ఐతే ఎన్ని అవమానాలు ఎదుర్కుందో!
Rashmika: రష్మిక కెరీర్ ని మార్చేసిన ఆ ఒక్క డేరింగ్ స్టెప్... ఐతే ఎన్ని అవమానాలు ఎదుర్కుందో!
రష్మిక మందాన బర్త్ డే నేడు(Happy birthday Rashmika). 26 ఏళ్ల ఈ కన్నడ భామ స్టార్ హీరోయిన్ గా ఇండియాను ఊపేస్తోంది. కోలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు చేతి నిండా ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీ లైఫ్ గడుపుతుంది.

పుష్ప 2, విజయ్ 66వ చిత్రం, రన్బీర్ కపూర్ కి జంటగా యానిమల్ చిత్రాలలో నటించనున్నారు. వీటితో పాటు రెండు హిందీ, ఒక తెలుగు చిత్రం ప్రకటించింది. రష్మిక హీరోయిన్ గా చేస్తుందంటే సినిమా హిట్టే అనేంతగా ఆమె పాప్యులర్ అయ్యారు. వరుస విజయాలతో ఆమె మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయ్యారు.
అయితే రష్మిక (Rashmika mandana)ఆ నిర్ణయం తీసుకోకుంటే... ఇవన్నీ ఉండేవి కావు. ఓ కన్నడ హీరోకి వైఫ్ గా ఇంటికే పరిమితం కావాల్సి వచ్చేది. చాలా తక్కువ ప్రాయంలో పరిశ్రమకు పరిచయమైన రష్మిక కెరీర్ బిగినింగ్ లోనే ఓ అసాధారణ నిర్ణయం తీసుకుంది. ప్రేమలో మునిగిపోయిన ఆమె పెళ్ళికి సిద్ధమైంది. కన్నడ హీరో రక్షిత్ శెట్టిని ఆమె పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
Rashmika Mandanna
2016లో విడుదలైన కిరిక్ పార్టీ మూవీతో రష్మిక వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ చిత్ర హీరో రక్షిత్ శెట్టిని రష్మిక ప్రేమించారు. రక్షిత్-రష్మిక పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. మనసయ్యిందే తడవుగా పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. నిశితార్థం కూడా జరుపుకున్నారు. ఇక కొన్ని నెలల్లో పెళ్లి అనగా రష్మిక మనసు మారింది.
తన గ్లామర్, టాలెంట్ పై నమ్మకంతో హీరోయిన్ గా ఎదగాలి, పెళ్లి చేసుకుంటే కలలు నెరవేరవని అర్థం చేసుకుంది. ఏదైనా కానీ, ఎవరు ఏమైనా అనని పెళ్లి మాత్రం చేసుకోకూదని నిర్ణయించుకుంది. అదే విషయాన్ని రక్షిత్ తో చెప్పింది. అతడు షాక్.. కెరీర్ ముఖ్యం పెళ్లి చేసుకోలేనని నిర్మొహమాటంగా చెప్పేసింది.
పెళ్లి ఆగిపోయిందంటే సమాజంలో చిన్న చూపు, అనేక రూమర్స్, గాసిప్స్ పుట్టుకొస్తాయి. రష్మికను రక్షిత్ కన్వీన్స్ చేయాలని ట్రై చేశాడు. కానీ ఆమె వినలేదు. రష్మిక, రక్షిత్ పెళ్లి రద్దైందన్న వార్త పెద్ద న్యూస్ అయ్యింది. కన్నడ మీడియాను షేక్ చేసింది ఈ వార్త.
అదే సమయంలో రక్షిత్ ఫ్యాన్స్ రష్మికపై మండిపడ్డారు. ఆమెను సోషల్ మీడియా వేధింపులకు గురిచేశారు. ట్రోల్స్ చేయడం ఆపలేదు. అవన్నీ ధైర్యంగా ఎదుర్కొంది రష్మిక. అదే సమయంలో రక్షిత్ ఆమెకు సప్పోర్ట్ ఇచ్చారు. రష్మిక నిర్ణయం గౌరవించాలి, ఆమెను ట్రోల్ చేయొద్దని ఫ్యాన్స్ కి విజ్ఞప్తి చేశారు.
అలా స్టార్ కావాలనే కలలతో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న రష్మికకు టాలీవుడ్ బాగా కలిసొచ్చింది. ఆమె ఫస్ట్ తెలుగు మూవీ ఛలో సూపర్ హిట్. గీత గోవిందం మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. సరిలేరు నీకెవ్వరు, భీష్మ, పుష్ప ఇలా వరుస హిట్స్ ఆమె ఫేమ్ ఎక్కడికో తీసుకెళ్లాయి. రక్షిత్ తో పెళ్లి రద్దు నిర్ణయం ఆమె కెరీర్ నే మార్చేసింది.