MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • అఫీషియల్: ‘తంగలాన్’ OTT రిలీజ్ డేట్,ఓటిటీ ప్లాట్ ఫామ్

అఫీషియల్: ‘తంగలాన్’ OTT రిలీజ్ డేట్,ఓటిటీ ప్లాట్ ఫామ్

నిర్మాత జ్ఞానవేల్ రాజా తంగలాన్ ఓటిటి రిలీజ్ కు రంగం సిద్దం అయ్యిందని, డిటేల్స్ చెప్పారు. 

3 Min read
Author : Surya Prakash
Published : Oct 15 2024, 07:55 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Vikram, Thangalaan, pa ranjith, ott,

Vikram, Thangalaan, pa ranjith, ott,


తమిళ స్టార్ హీరో విక్రమ్ ఇటీవల నటించిన  సినిమా 'తంగలాన్'. పా.రంజిత్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం  ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకొచ్చింది. తమిళంలో బాగానే వర్కవుట్ అయిన ఈ చిత్రం తెలుగుకు వచ్చేసరికి డివైడ్ టాక్ తో కొద్ది రోజులకే డ్రాప్ అయ్యింది.

 ఈ నేపధ్యంలో చాలా మంది ఈ సినిమాని ఓటిటిలో చూద్దామని ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మూవీ రిలీజైన రెండు నెలల అవుతున్నా ఇప్పటికీ ఓటీటీకి రాలేదు. సమస్య ఎక్కడుందనేది అర్దం కాలేదు. మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. అయితే వాటిన్నటిని నిర్మాత జ్ఞానవేల్ రాజా కొట్టిపారేసారు. తంగలాన్ ఓటిటి రిలీజ్ కు రంగం సిద్దం అయ్యిందని, డిటేల్స్ చెప్పారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Chiyaan Vikram film Thangalaan ott release update out

Chiyaan Vikram film Thangalaan ott release update out


‘తంగలాన్’ ఓటిటీ ఎగ్రిమెంట్ కాన్సిల్

తంగలాన్ డిజిటిల్ రైట్స్ ని  నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. ఈ సినిమాను ఆ సంస్ద డిజిటల్ స్ట్రీమింగ్ చేయనున్నట్టు  అధికారికంగా కూడా ప్రకటించారు.  దీంతో  ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతుందని ఓటీటీ  ఆడియన్స్ వెయిట్ చేశారు. కానీ ఓటీటీలో స్ట్రీమింగ్ కాలేదు. అయితే అందుతున్న సమాచారం మేరకు  నెట్ ఫ్లిక్స్‌తో నిర్మాతలకు సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది.

నెట్ ప్లిక్స్ వారు సినిమా అనుకున్న స్దాయిలో నడవలేదు కాబట్టి మొదట అనుకున్న పేమెంట్ ఇవ్వలేమని తేల్చి చెప్పటంతో వివాదం ఏర్పడిందని తమిళ వర్గాలు అంటున్నాయి. ఈ మధ్యకాలంలో చాలా పెద్ద సినిమాలకు ఇదే విధంగా జరుగుతోంది. రిలీజ్ కు ముందు సినిమాకు ఉన్న క్రేజ్ చూసి  ఓ రేటు చెప్పిన ఓటిటి సంస్దలు ఆ తర్వాత సినిమా అనుకున్న స్దాయిలో భాక్సాఫీస్ దగ్గర ఫెరఫామ్ చెయ్యకపోతే మాట మార్చేస్తున్నారు. 
 

37
Chiyaan Vikrams Thangalaan film ott release update

Chiyaan Vikrams Thangalaan film ott release update


తంగలాన్  మూవీ డిజిటల్ రైట్స్  ఎగ్రిమెంట్ ని నెట్‌ఫ్లిక్స్  రద్దు చేసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి.. దీంతో తంగలాన్ హక్కులు ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ కు చేతులు మారిందని కూడా అన్నారు. అయితే అవేమీ నిజం కాదని , యూట్యూబ్ వాళ్లు క్రియేట్ చేసినవి నిర్మాత జ్ఞానవేల్ రాజా కొట్టిపారేసారు. ఈ సినిమాని ఫెస్టివల్ సీజన్ కోసం నెట్ ప్లిక్స్ దాచుకుందని అన్నారు. అక్టోబర్ 31 నుంచి అంటే  దీపావళి రోజు నుంచి స్ట్రీమింగ్ అవుతుందని చెప్పారు. అన్ని  లాంగ్వేజ్ లలోనూ ఈ సినిమా నెట్ ప్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుందని వివరించారు.

బిగ్ బాస్ హౌజ్ నుంచి ఈ వారం బయటకు వెళ్లేది ఎవరు?

47
Thangalaan

Thangalaan


తంగలాన్ పై కేసు

  ఓటీటీలో ‘తంగలాన్’ సినిమా విడుదలపై నిషేధం విధించాలని కోరుతూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తిరువళ్లూరుకు చెందిన పోర్కోడి ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. ‘సినిమాలో బౌద్ధం గురించి పవిత్రంగా, వైష్ణవుల గురించి హాస్యభరితమైన సన్నివేశాలు ఉన్నాయి కాబట్టి ఓటీటీలో ‘తంగలాన్’ విడుదలైతే ఇరువర్గాల మధ్య గొడవ జరిగే అవకాశం ఉందని పిటిషన్‌ దాఖలు చేశారు.  అయితే ఇప్పుడు అవన్నీ క్లియర్ అయ్యినట్లేనా , నిర్మాత అంత థీమాగా ఓటిటి డేట్ చెప్పారు కాబట్టి అనే విషయం మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
 

57
Chiyaan Vikrams Thangalaans

Chiyaan Vikrams Thangalaans


ఇక తంగలాన్ కథేంటంటే..

  1850లో చిత్తూరు ప్రాంతంలోని పల్లెటూరులో సినిమా ప్రారంభమవుతుంది. తంగలాన్ ఓ శ్రామికుడు. అతడికి భార్య ఐదుగురు పిల్లలు. ఓ రోజు పిల్లలతో.. ఏనుగు కొండ వెనకాల బంగారం కొండ ఉందని, దానికి ఓ రక్షకురాలు ఉందని ఏవో కథలు చెబుతాడు. కట్ చేస్తే తంగలాన్‌తోపాటు కొందరిని బ్రిటీష్ దొరలు బంగారం నిధుల కోసం కూలీలుగా తీసుకెళ్తారు. నిధి అన్వేషణ కోసం సాగించిన ప్రయాణంలో వీళ్లకు ఎదురైన సవాళ్లు ఏంటి? చివరకు ఏమైందనేదే కథ.
 

67
thangalaan

thangalaan

తంగలాన్ కలెక్షన్స్


 ఈ సినిమాలో విక్రమ్ లుక్ చూసి అందరూ షాక్ అయ్యారు. తంగలాన్ పాత్ర కోసం చేసిన  మేకోవర్ మతిపోగొట్టింది. అంతేకాకుండా ఏదో కొద్ది  సీన్స్ లో ఆ లుక్ కాకుండా సినిమా మొత్తం అదే లుక్ ఉండటంతో ...సుదీర్ఘ కాలం షూటింగ్‌లో అదే లుక్ లో  పాల్గొన్నారు. అది నిజంగా చాలా కష్టమై విషయం. సినిమాకు మొదటి రోజు ఈ చిత్రానికి డివైడ్ టాక్ వచ్చింది. అయితే మెల్లిగా పికప్ అయ్యి వీకెండ్  అయ్యి  నిర్మాతలకు రిలీఫ్ ఇచ్చింది. అయితే వీకెండ్ అనంతరమే నిలబడలేదు.

ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా  100 కోట్లు రాబట్టిందని స్టూడియో గ్రీన్ వారు పోస్టర్ వదిలారు. అయితే ఈ పోస్టర్ పై చాలా విమర్శలు వచ్చాయి. కావాలని హైప్ చేసి తంగలాన్ కలెక్షన్స్ చూపిస్తున్నారని సోషల్ మీడియాలో ట్రోల్ చేసారు. ఏదైమైనా ఈ సినిమా విడుదలకు ముందే మంచి హైప్ కూడా సాధించింది. మొదటి వారాంతంలో చాలా బాగా ఆడింది. బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది. 
 

77
Chiyaan Vikram movie Thangalaan

Chiyaan Vikram movie Thangalaan


కోలార్ బంగారు గనిలో తమిళుల విషాదకర సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు. ఈ సినిమాలో నటించిన అందరూ అద్భుతంగా చేశారు. అప్పటి పరిసస్థితులకు కళ్ళకు కట్టినట్టు చూపించారు దర్శకుడు రంజిత్. అలాగే  జివి.ప్రకాష్ స్వరపరిచిన సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. . బ్రిటీష్ కాలం నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. బంగారం కోసం చేసే అన్వేషణ ఈ సినిమాలో చక్కగా చూపించారు. మరోసారి చియాన్ విక్రమ్ తన నటనతో ఆకట్టుకుంటాడు. ఇలాంటి సినిమాలకు ఓటీటీలో ఇంకా మంచి ఆదరణ ఉంటుంది. 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
ఓటీటీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic Day 1 collections: నెగిటివ్ టాక్స్ మధ్య దుమ్మురేపిన టాక్సిక్ కలెక్షన్స్, యశ్ మూవీ ఫస్ట్ డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో తెలుసా?
Recommended image2
Trivikram - Pawan: అజ్ఞాతవాసి ఫెయిల్యూర్, ఆ 48 గంటలు ఏం జరిగిందంటే.. భార్య పిల్లలకు చెప్పేసిన త్రివిక్రమ్
Recommended image3
Biggest Flop Movie: ఇండియాలోనే అతిపెద్ద డిజాస్టర్.. ఓటీటీ వాళ్ళు కూడా డీల్ రద్దు చేసుకున్న మూవీ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved