- Home
- Entertainment
- తమన్ మళ్లీ దొరికిపోయాడు.. `మమ మహేషా` సాంగ్ కూడా కాపీయేనా? బన్నీ పాటకి లింక్ పెడుతూ ఆడుకుంటున్న ట్రోలర్స్
తమన్ మళ్లీ దొరికిపోయాడు.. `మమ మహేషా` సాంగ్ కూడా కాపీయేనా? బన్నీ పాటకి లింక్ పెడుతూ ఆడుకుంటున్న ట్రోలర్స్
సంగీత దర్శకుడు తమన్ మరోసారి నెటిజన్లకి దొరికిపోయారు. `మ మ మహేషా` సాంగ్ అల్లు అర్జున్ నటించిన `సరైనోడు` సినిమాలోని పాటకి లింక్ పెడుతూ కాపీ పేరుతో ట్రోల్స్ చేస్తున్నారు. వైరల్ చేస్తున్నారు.

టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో థమన్ టాప్‌లో ఉన్నారు. `అల వైకుంఠపురములో` చిత్రంతో ఆయన చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఆ సినిమాలోని పాటలన్నీ యూట్యూబ్‌లో టాప్‌లో ఉన్నాయి. ఆ తర్వాత ఆయన సంగీతం అందించిన పాటలన్నీ ట్రెండింగ్‌లో ఉన్నాయి. దీంతో టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా రాణిస్తున్నారు తమన్.
అయితే తమన్‌పై `కాపీ క్యాట్` అనే విమర్శలు కూడా ఉన్నాయి. చాలా సందర్భాల్లో ఇలాంటి కామెంట్లు వినిపించాయి. ఫలానా ట్యూన్ ఆ సినిమాలోని పాటది, ఇతర భాషల సినిమాల్లోని పాటల ట్యూన్ అంటూ నెటిజన్లు ప్రూఫ్ చూపించి మరీ కామెంట్లు చేసిన సందర్భాలున్నాయి. ట్యాన్స్ లేపేస్తారనే కామెంట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరోసారి తమన్‌ని ఆడుకుంటున్నారు నెటిజన్లు. సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.
మహేష్‌బాబు హీరోగా నటించిన `సర్కారు వారి పాట` చిత్రంలోని `మ మ మహేషా` సాంగ్ ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. తమన్ సంగీతం అందించిన ఈ ఊరమాస్ బీట్ సినిమాకి కొత్త ఊపుని తీసుకొచ్చింది. హైప్‌ని పెంచేసింది. యూట్యూబ్‌లో ప్రస్తుతం ఇది ట్రెండ్ అవుతున్న నేపథ్యంలో ఈ పాటపై విమర్శలు చేస్తున్నారు నెటిజన్లు. ఇది కూడా కాపీనే అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.
`మ మ మహేషా` సాంగ్ బన్నీ చిత్రంలోని సాంగ్‌కి కాపీ అంటున్నారు. అల్లు అర్జున్ హీరోగా నటించిన `సరైనోడు` చిత్రం బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇందులో `బ్లాక్‌బస్టర్` పేరుతో ఓ పాట కూడా ఉంది. చివర్లో వచ్చే ఈ ఐటెమ్ సాంగ్ ఎంతగా ఆకట్టుకుందో తెలిసిందే. అంజలితో కలిసి బన్నీ వేసే మాస్ స్టెప్పులు ఉర్నూతలూగిస్తాయి. మాస్ ఆడియెన్స్ లో పూనకాలు తెప్పించింది. థియేటర్లలో అందరి చేత స్టెప్పులేయించింది. `సరైనోడు` చిత్రంలోనే హైలైట్‌గా నిలిచింది.
అయితే ఈ పాట ట్యూన్‌ని, `మ మ మహేషా` పాట ట్యూన్ ని కంపేర్ చేస్తున్నారు నెటిజన్లు. రెండు పాటల ట్యూన్లు సేమ్ ఉన్నాయని, ముందు వెనుకా అటు ఇటుగా కాస్త మార్చి కొట్టారని, లోపల మాత్రం అంతా సేమ్ అంటున్నారు ట్రోలర్స్. ప్రూఫ్స్ చూపించి మరీ ట్రోల్స్ చేయడం విశేషం. దీంతో ఇప్పుడిది హాట్ టాపిక్ అవుతుంది. తమన్ ఏంటయ్యా ఇది, మళ్లీ కాపీనేనా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇదిలా ఉంటే `సరైనోడు` చిత్రానికి తమనే సంగీతం దర్శకుడు కావడం విశేషం. తన పాటనే తాను కాపీ కొట్టారని, ఇది కాపీలోనే మరో లెవల్ అంటూ సెటైర్లు పేలుస్తున్నారు నెటిజన్లు. వాళ్లది, వీళ్లది చేసే విమర్శలొస్తాయనుకున్నారా? ఏకంగా నీది నువ్వే లేపేశావా? అంటూ పెడుతున్న పోస్ట్ లు పెడుతున్నారు. `రీ–రీమిక్స్` అంటూ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ప్రస్తుతం కాలంలో ట్రోలర్లు, నెటిజన్లు ఎంత యాక్టివ్‌గా ఉంటున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తప్పు ఎక్కడ దొరుకుతుందా... ట్రోలింగ్... మీమ్స్ మొదలుపెడదామా అని చూస్తున్నారు. మరి టెక్నీషియన్లు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం తేడా వచ్చినా ఇలా దొరికిపోవడం ఖాయం.
ఇక తమన్ సంగీతం అందించిన `సర్కారు వారి పాట`లోని మిగిలిన అన్ని పాటలు ఛార్ట్ బస్టర్స్ గా నిలిచింది. వంద మిలియన్ల జాబితాలో చేరిపోయాయి. అందులో `మ మ మహేషా` సాంగ్ కూడా ఇప్పుడు దుమ్మురేపుతుంది. ఇందులో మహేష్‌బాబు, కీర్తిసురేష్ వేసే స్టెప్పులు ఉర్రూతలూగిస్తున్నాయి. సినిమాలో అది మరింత ప్లస్ కాబోతుంది. థియేటర్లో హైప్‌ని తీసుకొస్తుందని చెప్పొచ్చు.