- Home
- Entertainment
- 'గేమ్ ఛేంజర్'ని అల్లు అర్జున్ మూవీతో తమన్ పోల్చడం కరెక్టేనా, నిజంగా చెడగొట్టింది ఎవరు ?
'గేమ్ ఛేంజర్'ని అల్లు అర్జున్ మూవీతో తమన్ పోల్చడం కరెక్టేనా, నిజంగా చెడగొట్టింది ఎవరు ?
మెగా అభిమానులకు ఈ ఏడాది ఆరంభంలోనే బిగ్గెస్ట్ డిజప్పాయింట్మెంట్ ఎదురైంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న గేమ్ ఛేంజర్ చిత్రం దారుణంగా నిరాశపరిచింది. ఆర్ఆర్ఆర్ తర్వాత రాంచరణ్ శంకర్ దర్శకత్వంలో నటించడంతో ఫ్యాన్స్ ఒక రేంజ్ లో అంచనాలు పెట్టుకున్నారు.

Game Changer
మెగా అభిమానులకు ఈ ఏడాది ఆరంభంలోనే బిగ్గెస్ట్ డిజప్పాయింట్మెంట్ ఎదురైంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న గేమ్ ఛేంజర్ చిత్రం దారుణంగా నిరాశపరిచింది. ఆర్ఆర్ఆర్ తర్వాత రాంచరణ్ శంకర్ దర్శకత్వంలో నటించడంతో ఫ్యాన్స్ ఒక రేంజ్ లో అంచనాలు పెట్టుకున్నారు. ఫ్యాన్స్ ఏడో ఊహించుకుంటే శంకర్ మాత్రం ఓల్డ్ ఫార్ములాతో పొలిటికల్ చిత్రాన్ని వదిలారు.
thaman
ఈ చిత్రంలో సాంగ్స్, స్టోరీ, శంకర్ డైరెక్టర్ ఏమీ వర్కౌట్ కాలేదు. బడ్జెట్ మాత్రం 350 కోట్లు ఖర్చు చేశారు. ఒక నార్మల్ పొలిటికల్ డ్రామాకి అంత బడ్జెట్ ఎందుకు అయింది అనేది ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఈ చిత్రం విడుదలై నెలలు గడిచిపోయింది. ఓటీటీలోకి కూడా వచ్చేసింది. ఇలాంటి తరుణంలో తమన్ తన కామెంట్స్ తో మరోసారి మంటలు రేపారు. తమన్ కామెంట్స్ పై మెగా అభిమానుల్లో, నెటిజన్లలో, క్రిటిక్స్ లో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
తమన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గేమ్ ఛేంజర్ చిత్రాన్ని అల్లు అర్జున్ అలా వైకుంఠపురములో చిత్రంతో పోల్చి హాట్ కామెంట్స్ చేశారు. దీనితో వివాదం మొదలయింది. తమన్ వ్యాఖ్యలని కొందరు మెగా అభిమానులు సపోర్ట్ చేస్తుండగా మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ఇంతకీ తమన్ ఏమన్నారో ఇప్పుడు చూద్దాం.
ఒక పాట అంటే కేవలం మ్యూజిక్ డైరెక్టర్ బాధ్యత మాత్రమే కాదు. పాట వినడానికి బావుంటే కొన్ని మిలియన్ల వ్యూస్ వస్తాయి. అదే చూడడానికి బావున్నప్పుడు రీల్స్ కూడా క్రియేట్ అవుతాయి. కొరియోగ్రాఫర్లు మంచి హుక్ స్టెప్పు క్రియేట్ చేస్తే సాంగ్ కి ఇంకా బాగా రీచ్ ఉంటుంది. గేమ్ ఛేంజర్ లో మిస్ అయింది అదే అని తమన్ కొరియోగ్రాఫర్లని బ్లేమ్ చేశారు. రా మచ్చ మచ్చా సాంగ్ కానీ, జరగండి సాంగ్ కి కానీ, ధోప్ సాంగ్ కి సరైన హుక్ స్టెప్పు లేదు.
అదే అలవైకుంఠపురంలో చిత్రాన్ని తీసుకోండి.. ప్రతి సాంగ్ కి ఒక హుక్ స్టెప్పు ఉంటుంది. ఆ స్టెప్పులు సాంగ్స్ ని ఎక్కడికో తీసుకెళ్లాయి అని తమన్ తెలిపారు.తమన్ ఇలా కొరియోగ్రాఫర్లని బ్లేమ్ చేయడం ఎంత వరకు కరెక్ట్ అని క్రిటిక్స్ విమర్శిస్తున్నారు. భారం మొత్తం కొరియోగ్రాఫర్ల మీద వేస్తే ఇక సంగీత దర్శకుడి ప్రతిభ ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. మెగా అభిమానులు కొందరు తమన్ కి సపోర్ట్ చేస్తున్నారు. గేమ్ ఛేంజర్ ఫ్లాప్ కావడానికి చాలా కారణాలు ఉన్నాయి. తమన్ చెప్పిన విషయం కూడా కరెక్టే. బెస్ట్ డ్యాన్సర్ ని హీరోగా పెట్టుకుని ఒక్క సాంగ్ లో కూడా మంచి డ్యాన్స్ మూమెంట్స్ ఇవ్వలేకపోయారు. డ్యాన్స్ వేయలేని హీరోలు వేస్తే స్టెప్పులు లాగా గేమ్ ఛేంజర్ చిత్రంలో డ్యాన్స్ మూమెంట్స్ ఉన్నాయి అని అంటున్నారు.
గేమ్ ఛేంజర్ ఫ్లాప్ కావడం వెనుక అందరికంటే ఎక్కువ భాద్యత దర్శకుడిదే. ఆ తర్వాత నిర్మాత దిల్ రాజు కూడా భాద్యుడే అని ఫ్యాన్స్ అంటున్నారు. రాంచరణ్ లాంటి పాన్ ఇండియా హీరోని పెట్టుకుని ఆడియన్స్ పల్స్ తెలుసుకోకుండా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేయడం బిగ్ మిస్టేక్ అని అంటున్నారు.