దళపతి విజయ్ వర్సెస్ రజనీకాంత్, ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ఆస్తి ఉందో తెలుసా?
స్టార్ హీరో దళపతి విజయ్ సినిమాల నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. సౌత్ లో రజనీకాంత్ తర్వాత అత్యధిక పాపులారిటీ ఉన్న హీరో విజయ్. త్వరలో రజినీకాంత్ కూడా సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నారన్న వార్తల నేపథ్యంలో ఇద్దరు స్టార్ల నికర ఆస్తుల విలువెంత?

రజనీకాంత్ - దళపతి విజయ్, ఎవరికి ఆస్తి ఎక్కువ ?
స్టార్ హీరో విజయ్ దళపతి సినిమాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. త్వరలో రజినీకాంత్ కూడా సినిమాల నుంచి రిటైర్ అవుతారని ప్రచారంజరుగుతుంది. ఇక వీరిద్దరి మధ్య ఆస్తి తేడా ఎంత? ఎవరికి ఎక్కువ ఆస్తి ఉంది. ఇద్దరి రెమ్యునరేషన్ ఎంత? ఇంటటర్నెట్‌లో అందుబాటులో ఉన్న నికర ఆస్తుల లెక్కలు చూస్తే, రజనీకాంత్ కంటే దళపతి విజయ్‌కే ఎక్కువ ఆస్తి ఉంది. రిపోర్ట్స్ ప్రకారం, రజనీకాంత్ ఆస్తి సుమారు 430 కోట్లు కాగా, విజయ్ నికర ఆస్తి దాదాపు 600 కోట్లు.
విజయ్ దే పై చేయి..
సినిమాల రెమ్యునరేషన్ విషయంలో కూడా దళపతి విజయ్, రజనీకాంత్‌పై పైచేయి సాధించారు. విజయ్ తన చివరి సినిమా 'జన నాయగన్' కోసం 275 కోట్లు తీసుకున్నారని టాక్. మరోవైపు, రజనీకాంత్ రాబోయే 'జైలర్ 2' కోసం 200-230 కోట్లు తీసుకుంటున్నారని సమాచారం.
రజినీకాంత్ సినిమా ప్రయాణం..
రజనీకాంత్ 1975లో 'అపూర్వ రాగంగళ్' సినిమా తో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసి ఇప్పటివరకు 170కి పైగా సినిమాల్లో నటించారు. దళపతి విజయ్ 1984లో 'వెట్రి'లో బాలనటుడిగా తొలిసారి కనిపించారు. 1992లో 'నాళైయ తీర్పు'తో హీరోగా మారారు. ఇప్పటివరకు 80కి పైగా సినిమాల్లో నటించారు.
అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ఎవరిది?
అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ సినిమా రికార్డు రజనీకాంత్ పేరు మీదే ఉంది. IMDb రిపోర్ట్ ప్రకారం, 2018లో వచ్చిన '2.0' ప్రపంచవ్యాప్తంగా 675 కోట్లు వసూలు చేసింది. రెండో స్థానంలో విజయ్ 'లియో' ఉంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 618 కోట్లు కలెక్ట్ చేసింది.
రజనీకాంత్ వర్సెస్ దళపతి విజయ్
రజనీకాంత్ తర్వాతి సినిమా 'జైలర్ 2' 2026 జూన్ 12న రిలీజ్ కావచ్చు. ఇది 2023 నాటి సూపర్ హిట్ 'జైలర్'కు సీక్వెల్. దీనికి నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకుడు. ఆయన మరో సినిమా 'తలైవర్ 173' 2027లో వస్తుంది. విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' 2026 జనవరి 9న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా తరువాత తాను ఇండస్ట్రీ నుంచి తప్పుకుంటున్నట్టు విజయ్ ప్రకటించారు.

