- Home
- Entertainment
- Thalapathy Vijay: విజయ్, వంశీ పైడిపల్లి మూవీ స్టోరీ లీక్.. ఎన్టీఆర్ సినిమా రిపీట్ ?
Thalapathy Vijay: విజయ్, వంశీ పైడిపల్లి మూవీ స్టోరీ లీక్.. ఎన్టీఆర్ సినిమా రిపీట్ ?
మహర్షి ఫేమ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో.. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో విజయ్ ఓ చిత్రం చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ చిత్రం ఘనంగా ప్రారంభమైంది.

Thalapathy Vijay
ఇలయదళపతి విజయ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత అంతటి క్రేజ్ సొంతం చేసుకున్న హీరో విజయ్. అందులో ఎలాంటి సందేహం లేదు. నెగిటివ్ టాక్ లో కూడా బీస్ట్ చిత్రం 100 కోట్ల వరకు వసూళ్లు రాబడుతోంది. ఇది పూర్తిగా విజయ్ స్టామినా అనే చెప్పాలి.
Thalapathy Vijay
తమిళనాట ఇంతటి మాస్ క్రేజ్ ఉన్న హీరో తొలిసారి తెలుగులో స్ట్రైట్ మూవీ చేస్తుండడం ఆసక్తిరేపే అంశమే. మహర్షి ఫేమ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో.. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో విజయ్ ఓ చిత్రం చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ చిత్రం ఘనంగా ప్రారంభమైంది.
Thalapathy Vijay
ఈ చిత్రంలో విజయ్ కి జోడిగా రష్మిక మందన నటిస్తోంది. తమన్ సంగీత దర్శకుడు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం గురించి ఓ క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది. ఈ చిత్రం కథా నేపథ్యం, థీమ్ లీక్ అయినట్లు ప్రచారం జరుగుతోంది.
Thalapathy Vijay
విజయ్ లాంటి మాస్ స్టార్ డమ్ ఉన్న హీరోతో తొలిసారి సినిమా చేసే అవకాశం దక్కితే ఈ దర్శకుడు అయినా పవర్ ఫుల్ గా ఉండే యాక్షన్ మూవీ ఎంచుకుంటారు. కానీ వంశీ పైడిపల్లి స్టైల్ వేరు. విజయ్ తో వంశీ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది.
Thalapathy Vijay
ఈ చిత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన బృందావనం తరహాలో ఉండబోతోందట. వంశీ కెరీర్ లో బృందావనం చిత్రం మెమొరబుల్ హిట్ గా నిలిచింది. విజయ్ సినిమా ఓ కుటుంబం చుట్టూ తిరిగే కథ అట. ఫ్యామిలీ ఎమోషన్స్ బలంగా ఉంటాయి. కుటుంబంలో బంధాలు, బంధుత్వాలు ప్రాముఖ్యతని తెలియజేసేలా.. ఎమోషనల్ గా ఎంటర్టైనింగ్ గా ఈ చిత్రం ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
Thalapathy Vijay
విజయ్ ఫ్యామిలీ కథలో నటించి చాలా కాలమే అవుతోంది. దీనితో విజయ్ ఫ్యాన్స్ కి ఈ చిత్రం సర్ ప్రైజింగ్ ప్యాకేజ్ అని చెప్పొచ్చు. విజయ్ చివరగా నటించిన బీస్ట్ చిత్రం ఫ్యాన్స్ ని సైతం నిరాశపరిచింది. దీనితో విజయ్, వంశీపైడిపల్లి మూవీపై ఆశలు పెరగడం ఖాయం.