వెయిటింగ్ లిస్ట్‌లో జన నాయగన్.. దళపతి విజయ్ సినిమా కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు?
దళపతి విజయ్ నటించిన చివరి సినిమా జన నాయకుడు. ఈ సినిమా జనవరి 9న రిలీజ్ కావలసి ఉండగా.. వాయిదా పడింది. ఇక తాజాగా ఈసినిమా కొత్త రిలీజ్ డేట్ కు సబంధించిన సమాచారం లీక్ అయింది.

ఆగిపోయిన జన నాయకుడు రిలీజ్ ..
సౌత్ స్టార్ హీరో విజయ్ దళపతి చివరి సినిమా జన నాయకుడు ( 'జన నాయగన్)'. ఈ సినిమా జనవరి 9న రిలీజ్ కావాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. మతపరమైన మనోభావాలను దెబ్బతీసే వివాదాస్పద సన్నివేశాలు ఉన్నాయని సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో చిత్ర బృందం కోర్టును ఆశ్రయించింది. తీర్పు జనవరి 9కి వాయిదా పడటంతో, ఆ రోజు సినిమా రిలీజ్ కాదని టీమ్ అధికారికంగా ప్రకటించింది.
తప్పనిసరి పరిస్థితుల వల్ల..
జన నాయకుడు నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ ఈ ఆలస్యంపై ఒక ప్రకటన విడుదల చేసింది. నిర్మాతలు 'భారమైన హృదయంతో' ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. 'తప్పనిసరి పరిస్థితుల' వల్లే ఈ వాయిదా పడిందని తెలిపారు. 'మా వాటాదారులు, ప్రేక్షకులతో ఈ విషయాన్ని బాధతో పంచుకుంటున్నాం. జనవరి 9న ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'జన నాయకుడు' విడుదల, మా నియంత్రణలో లేని కారణాల వల్ల వాయిదా పడింది' అని చెప్పారు.
త్వరలో కొత్త రిలీజ్ డేట్..
ఈ సినిమాపై ఉన్న అంచనాలు, అబిమానుల ఉత్సాహాన్ని మేం అర్థం చేసుకున్నాం. ఈ నిర్ణయం అంత సులభంగా తీసుకున్నది కాదు.. కొత్త రిలీజ్ డేట్ ను ని త్వరలో ప్రకటిస్తాం. అప్పటివరకు, మీ సహనాన్ని, ప్రేమను కోరుకుంటున్నాం. మీ మద్దతే మా బలం, అని జన నాయకుడు '(జన నాయగన్)' టీమ్‌కు చాలా ముఖ్యం' అని ఆ ప్రకటనలో ఉంది.
సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యే ఛాన్స్..
జన నాయకుడు కొత్త రిలీజ్ డేట్ పైై ఓ వార్త వైరల్ అవుతోంది. అనుకూలంగా తీర్పు వస్తే జనవరి 14న పొంగల్ కానుకగా, లేదంటే జనవరి 30న రిలీజ్ అవుతుందని టాక్. హెచ్. వినోద్ దర్శకత్వంలో విజయ్, బాబీ డియోల్, మమితా బైజు, ప్రకాష్ రాజ్ నటించారు.

