Intinti Gruhalakshmi: కొడుకును నిందించిన అనసూయ.. స్పృహ తప్పి కిందపడిపోయిన దివ్య!
Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమయ్యే ఇంటింటా గృహలక్ష్మి (Intinta Gruhalaxmi) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబ కథ నేపథ్యంలో ఈ సీరియల్ ప్రసారం అవుతుంది.

Intinti Gruhalakshmi
ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. అనసూయ.. ప్రేమ్ ను వెళ్లగొట్టారు.. మీకు చీమ కుట్టినట్టైనా లేదా అంటూ నందు (Nandu) పై విరుచుకు పడుతుంది. అదే క్రమంలో అనసూయ (Anasuya).. నోటి మాస్కు పెట్టుకో అంటూ.. మాట్లాడకుండా నోరు మూసుకో అన్నట్లు లాస్య పైన కూడా విరుచుకు పడుతుంది.
Intinti Gruhalakshmi
నాకు సరైన సంపాదన లేదని తులసి (Tulasi) ఎగతాళి చేస్తోంది అని నందు.. వాళ్ళ నాన్నతో గట్టిగా అంటాడు. ఆ క్రమంలో లాస్య (Lasya) .. నీకు ఇంకా నందు మీద ఆశ చావలేదా అని తులసిని అడగగా.. ఏ నీకు భయమేస్తుందా అని తులసి వేరే స్థాయిలో సమాధానం ఇస్తుంది.
Intinti Gruhalakshmi
ఇక ఇది చూసిన అభి, అంకిత (Ankitha) లు ఒక పక్క నుంచి ఎంతో టెన్షన్ పడుతూ ఉంటారు. మరోవైపు రాములమ్మ (Ramulamma) ఒక అద్దె ఇంటిని ప్రేమ్, శృతి ల కోసం సెట్ చేస్తుంది. అంతే కాకుండా అద్దె 3000 ఇచ్చే లాగా ఆ ఇంటి ఓనర్ తో మాట్లాడుతుంది. ఇక ప్రేమ్ (Prem) వాళ్ళు తిరిగి వెళుతున్న క్రమంలో మీరు ఎప్పుడైనా చికెన్ చేసుకుంటే మాకు పెట్టాలి అని ఇంటి ఓనర్ ఫన్నీగా కండిషన్ పెడతాడు.
Intinti Gruhalakshmi
ఆ తర్వాత అంకిత (Ankitha).. ప్రేమ్ ను బయటకు పంపించిన విషయంలో ఇంట్లో వాళ్ళందరూ చాలా బాధ పడుతున్నారు అని తులసితో చెబుతుంది. దాంతో తెలిసినా కంటే ఎక్కువగా బాధపడుతున్నారా అని అంటుంది. అదే మరి వాళ్ల నాన్నను ఎదిరిస్తే మరి నాకు బాధగా ఉండదా అని తులసి (Tulasi) అంటుంది.
Intinti Gruhalakshmi
ఆ తర్వాత తులసి (Tulasi) అన్నం తీసుకుని దివ్య దగ్గరికి వెళ్లి తిను బంగారం అని బతిమాలుతూ మాట్లాడుతుండగా.. ప్రేమ్ అన్నయ్య ఇంటికి వచ్చేదాక నేను అన్నం తినను అని గట్టిగా కసిరించుకుంటుంది దివ్య (Divya).
Intinti Gruhalakshmi
ఆ తర్వాత దివ్య (Divya) సరిగ్గా అన్నం తినక సృహ తప్పి కింద పడిపోతుంది. ఈ విషయం అంకిత ఇంట్లో వాళ్లకి తెలియజేస్తుంది. దాంతో తులసి, దివ్య ని దగ్గరికి తీసుకోగా దివ్య.. తులసి (Tulasi) పై చిరాకు పడుతుంది ఇక ఈ క్రమంలో రేపటి భాగంలో ఏం జరుగుతుందో చూడాలి.