MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఫ్రెండ్ ఇంట్లో కిలో బంగారం కాజేసిన తెలుగు నటి, షాకింగ్ డీటెయిల్స్.. మామూలు కిలాడీ కాదుగా

ఫ్రెండ్ ఇంట్లో కిలో బంగారం కాజేసిన తెలుగు నటి, షాకింగ్ డీటెయిల్స్.. మామూలు కిలాడీ కాదుగా

చిత్ర పరిశ్రమలో వర్తమాన నటీమణులు, నటులు అవకాశాలు సరిగ్గా లేక ఇబ్బందులు పడేవాళ్ళు చాలా మంది ఉంటారు. అయినా ఓపిగ్గా ప్రయత్నించి సక్సెస్ అయినవాళ్ళు కూడా ఉన్నారు. కానీ కొందరు నటీమణులు ఆఫర్స్ రాకపోవడంతో అడ్డదార్లు తొక్కుతున్న సంఘటనలు చూస్తున్నాం.

2 Min read
Author : Tirumala Dornala
Published : Mar 04 2024, 01:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

చిత్ర పరిశ్రమలో వర్తమాన నటీమణులు, నటులు అవకాశాలు సరిగ్గా లేక ఇబ్బందులు పడేవాళ్ళు చాలా మంది ఉంటారు. అయినా ఓపిగ్గా ప్రయత్నించి సక్సెస్ అయినవాళ్ళు కూడా ఉన్నారు. కానీ కొందరు నటీమణులు ఆఫర్స్ రాకపోవడంతో అడ్డదార్లు తొక్కుతున్న సంఘటనలు చూస్తున్నాం. తాజాగా అలాంటి సంచలన సంఘటన చోటు చేసుకుంది. 

26

వైజాగ్ కి చెందిన తెలుగు నటి తన స్నేహితురాలి ఇంట్లో కిలో బంగారం కాజేసి అడ్డంగా పోలీసులకు బుక్కైంది. వివరాల్లోకి వెళితే ఆమె పేరు సౌమ్య శెట్టి. వైజాగ్ లో ఉంటోంది. యువర్స్ లవింగ్లీ, ది ట్రిప్ లాంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. మంచి నటనే కనబరిచింది. కానీ ఆ చిత్రాల ద్వారా ఆమెకి గుర్తింపు లభించలేదు. 

36

సరైన అవకాశాలు రాలేదు. దీనితో సౌమ్య శెట్టి ఇంస్టాగ్రామ్ రీల్స్ చేస్తూ ఆఫర్స్ వెతుక్కుంటోంది. ఇలా ఆడిషన్స్ ఇస్తున్న సమయంలో సౌమ్య శెట్టి రిటైర్డ్ పోస్టల్ శాఖ ఉద్యోగి ప్రసాద్ బాబు కుమార్తె మౌనికని పరిచయం చేసుకుంది. ఇద్దరూ ఫ్రెండ్స్ గా మారాయి. సౌమ్య తరచుగా వాళ్ళ ఫ్లాట్ కి వెళ్లి వస్తుండేది. వాళ్ళ ఇంట్లో పరిసరాల్ని వస్తువుల్ని బాగా స్కాన్ చేసేసింది. వాళ్ళ ఇంట్లో కిలో బంగారం వరకు ఉన్నట్లు సౌమ్య గ్రహించింది. 

46

ఎలాగైనా కాజేయాలని అనేక ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలో బాత్రూం కి వెళ్లి వస్తానని చెప్పి బెడ్ రూమ్ లో గంటలు గంటలు గడిపేది. ఇలా రెండు ముందుసార్లుగా కొంచెం కొంచెం బంగారం కాజేస్తూ తన చేతివాటం ప్రదర్శించింది. మొత్తంగా కిలో బంగారాన్ని మాయం చేసేసింది. మౌనిక ఏదో ఫంక్షన్ కోసం దాచిన బంగారాన్ని బయటకి తీయడానికి ప్రయత్నించింది. కాని అక్కడ బంగారం లేకపోవడంతో కుటుంబసభ్యులంతా షాక్ అయ్యారు. 

56

వెంటనే ప్రసాద్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు క్లూలు కనిపెడుతూ అనుమానం ఉన్న 11 మందిని విచారించారు.ఈ క్రమంలో సౌమ్య శెట్టి వద్ద 74 గ్రాముల బంగారం లభించింది. సౌమ్య తన నేరం అంగీకరించింది. మిగిలిన బంగారం గోవాలో ఖర్చు చేసేసినట్లు తెలిపింది. 

66

ఆ బంగారం తాను తిరిగి తెచ్చివ్వలేనని.. గట్టిగా అడిగితే సూసైడ్ చేసుకుంటానని బెదిరిస్తోంది. దీనితో పోలీసులు సౌమ్య శెట్టిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ సినిమాల టికెట్ల రేట్లు పెంచాం..దేహీ అని అడుక్కోవద్దు, పవన్ కామెంట్స్
Recommended image2
Ravi Mohan: మ్యాచింగ్ డ్రెస్ పై ఆర్తి రవి సెటైర్ వైరల్.. ఎవరిని ఉద్దేశించి ఇలా
Recommended image3
Golmaal 5: గోల్మాల్ 5లో బిగ్ సర్ప్రైజ్..అక్షయ్ సరసన ఆ బ్యూటీ, 17 మంది స్టార్లతో రచ్చ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved