- Home
- Entertainment
- Eesha Rebba : తెలుగులో వర్కౌట్ అవట్లేదు.! తమిళం, మలయాళంపై ఈషా రెబ్బా ఫోకస్.. అక్కడైనా కలిసివచ్చేనా?
Eesha Rebba : తెలుగులో వర్కౌట్ అవట్లేదు.! తమిళం, మలయాళంపై ఈషా రెబ్బా ఫోకస్.. అక్కడైనా కలిసివచ్చేనా?
తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బాకు టాలీవుడ్ లో వర్కౌట్ అయ్యేట్టు కనిపించడం లేదు. అన్ని అర్హతలు ఉన్నా మరీ చిన్న స్థాయి హీరోయిన్ గా ఉండిపోయింది. పదేండ్లయినా పక్కా సినిమా పడకపోవడంతో తమిళం, మలయాళం సినిమాలవైపు చూస్తోందీ బ్యూటీ..

హీరోయిన్ ఈషా రెబ్బా (Eesha Rebba) టాలీవుడ్ లో కొన్నాళ్ల నుంచి యాక్టివ్ గానే ఉంటోంది. కేరీర్ లో బిగ్ హిట్ కోసం ఎదురుచూస్తోందీ బ్యూటీ. సరైన అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు తెగ ఆరాట పడుతోంది. కానీ ఈషాకు కాలం కలిసి రావడం లేదు.
గ్లామర్ పరంగా ఈషా రెబ్బా ఆకర్షణీయంగానే ఉంటోంది. హీరోయిన్ గా అన్ని అర్హతలు కలిసిగి ఉందీ తెలుగు అమ్మాయి. మరోవైపు తన నటనకు కూడా మంచి మార్కులే పడుతున్నాయి. కానీ తన కేరీర్ మలుపు తిరిగే సినిమా ఒక్కటీ ఇంత వరకు రాకపోవడం గమనార్హం.
పదేండ్ల కింద డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం మంచి విజయవంతం కావడంతో సినిమాలో కాస్ట్ అందరికీ గుర్తింపు దక్కింది. ఈ క్రమంలో ఈషా కూడా అవకాశాలను అందుకుంటూ వస్తోంది.
పెద్ద సినిమాల్లో అవకాశాలు వచ్చినా.. సెకండ్ హీరోయిన్ గానో, లేదా ప్రాధాన్యత లేని పాత్రలే దక్కుతున్నాయి. దీంతో ఈషా కూడా వచ్చిన అవకాశాన్ని కాదనలేక నటిస్తోంది. ఇటీవల ‘అరవింద సమేత వీర రాఘవ, సవ్యసాచీ, రాగల 24 గంటల్లో, పిట్ట కథలు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ వంటి పెద్ద చిత్రాల్లో నటించినా తనకు ఒరిగిందేమీ లేదు.
దీంతో ఈ తెలుగు హీరోయిన్ చూపు తమిళం, మలయాళం ఇండస్ట్రీలపై (Tamil Films) పడింది. ఈ ఏడాది తెలుగును వీడి తమిళంలో వరుసగా రెండు చిత్రాల్లో నటిస్తోంది. తమిళ్ హర్రర్ ఫిల్మ్ ‘ఆయిరామ్ జెన్మంగల్’ చిత్రంలో, అలాగే ‘ఒట్టు’అనే మలయాళ చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీ తమిళంలోనూ రిలీజ్ కానుంది.
ఈ రెండు చిత్రాలు అక్కడ ఆడితే ఈషా కేరీర్ మలుపు తిరిగే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆ తర్వాత అక్కడైనా సరైన కథలను ఎంచుకుంటే స్టార్ డబ్ దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. తాజాగా ఈ తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా (Eesha Rebba) శ్రీరామ నవమి సందర్భంగా ట్రెడిషనల్ లుక్ లో దర్శనమిచ్చింది. సంప్రదాయ దుస్తుల్లో మైమరిపిస్తోందీ బ్యూటీ.