MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • Sankranthi 2020: సంక్రాంతికి స్పెషల్ గా సందడి చేసిన తెలుగు సినిమాలు.. కొత్తపోస్టర్లు రిలీజ్.

Sankranthi 2020: సంక్రాంతికి స్పెషల్ గా సందడి చేసిన తెలుగు సినిమాలు.. కొత్తపోస్టర్లు రిలీజ్.

తెలుగు  సినిమా పెద్ద పండుగను ఘనంగా జరుపుకుంటుంది. కరోనా పాండమిక్ లో .. రిలీజ్ ల దగ్గర నుంచి. షూటింగ్స్ వరకూ అన్నీ లేట్ అవుతున్నా.. దైర్యం కోల్పోకుండా.. సంక్రాంతికి శుభం కలగాలని కోరకుంటున్నారు సినిమా వాళ్లు. పోస్టర్స్ తో సందడి చేస్తున్నారు.  

3 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Jan 15 2022, 03:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

సినిమావారికి పెద్ద పండుగ సంక్రాంతి.  ఈ పండగను తెలుగు వారంతా సందడిగా జరుపుకుంటున్నారు. తెలుగు వారితో పాటు సినిమా వారు కూడా సంక్రాంతికి పోస్టర్లతో సందడి చేస్తున్నారు. స్టార్ హీరోల సినిమాల నుంచి వరుసగా పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే.. సంక్రాంతి బరిలో పెద్ద సినిమాల సందడితో సంక్రాంతి ఇంకా ఘనంగా జరిగేది. కాని కరోనా థార్డ్ వేవ్ వల్ల సంక్రాంతి కి రావల్సిన పెద్ద సినిమాలన్నీ వాయిదాలు పడుతున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

సినిమా వాళ్ల సంక్రాంతి సంబరాలతో సిల్వర్ స్క్రీన్ మురిసిపోయింది. పెద్ద సినిమాల నుంచి సంక్రాంతి స్పెషల్ పోస్టర్లు రిలీజ్ అయ్యాయి. అందరికంటే ముందు ట్రిపుల్ ఆర్(RRR) టీమ్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.ఎన్టీఆర్(NTR),చరణ్(Ramcharan) స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. అన్నీ బాగుండి ఉంటు.. జనవరి 7న రిలీజ్ అయ్యి.. ఇఫ్పటికీ తన వేవ్ ను కొనసాగించేది ట్రిపుల్ ఆర్.

310

ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికి రావాలనుకున్న భీమ్లా నాయక్(Bheemla Nayak) ట్రిపుల్ ఆర్(RRR)  వల్ల పిబ్రవరి 25కి పోస్ట్ పోన్ అయ్యింది. ఈనెల 12న రిలీజ్ కావల్సి ఉంది భీమ్లా నాయక్. పవర్ స్టార్ పవన్ కల్యాన్(Pawan Kalyan) రానా కలిసి నటిస్తున్న ఈమూవీ నుంచి సంక్రాంతి శుభాకాంక్షలు  తెలుపుతూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు టీమ్. పిబ్రవరిలో కూడా సినిమా రిలీజ్ అవుతుందో లేదో చూడాలి.

410

మాస్ మహారాజ్ రవితేజ(Raviteja)  మంచి ఊపు మీద ఉన్నాడు. ఇప్పటికే  మూడు సినిమాలు లైన్ లో ఉండగా.. మరికొన్ని సినిమాలు త్వరలో సెట్ చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే రిలీజ్ కు రెడీగా ఉంది రవితేజ ఖిలాడి(Khiladi) మూవీ. వచ్చే నెల 11న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో రవితేజ (Raviteja)  పవర్ ఫుల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు టీమ్. రాడ్ పట్టుకుని మాస్ లుక్ లో అదరగొట్టాడు రవితేజ.

510

వరుస సినిమాలతో జోరు చూపిస్తున్న రవితేజ (Raviteja).. మరో సినిమా పోస్టర్ తో  సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపాడు. శరత్ మండవ డైరెక్షన్ లో నటిస్తున్న రామారావ్ ఆన్ డ్యూటీ మూవీ నుంచి సంక్రాంతి విష్ తెలియ చేస్తూ.. పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఈ మూవీలో పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడు రవితేజ. పోస్టర్ మాత్రం ట్రెడిషనల్ లుక్ లో డిజైన్ చేశారు.

610

ఇక ఫన్ ప్రస్టేషన్ ఒకే సారి చూపించబోతున్నారు ఎఫ్3 (F3)టీమ్. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో.. విక్టరీ వెంకటేష్(Venkatesh).. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) కలిసి నటిస్తున్న సినమా నుంచి.. సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేస్తూ.. పోస్టర్ ను రిలీజ్ చేశారు. సంక్రాంతికి రావల్సిన ఈ మూవీ పిబ్రవరి 25కి పోస్ట్ పోన్ అయ్యింది. భీమ్లా నాయక్ సినిమా కోసం మరోసార ఏప్రిల్ 29కి పోస్ట్ పోన్ అయ్యింది.

710

ఇస్మార్ట్ శంకర్ తో జోరు చూపించిన రామ్(Ram) పోతినేని.. ఆతరువా త రెడ్(Red) సినిమాతో దెబ్బతిన్నాడు. ఈసారి పక్కా సక్సెస్ కోసం.. యాక్షన్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చాడు. తమిళ దర్శకుడు లింగుస్వామి తెరకెక్కిస్తున్న సినమాలో రామ్ నటిస్తున్నాడు ఈమూవీ టైటిల్ ను త్వరలో రిలీజ్ చేయబోతున్నారు. ఆడియన్స్ కు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ.. టీమ్ పోస్టర్ రిలీజ్ చేశారు.

810

అటు యంగ్ స్టార్ సుధీర్(Sudeer Babu) బాబు కూడా ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. కృతి శెట్టి హీరోయిన్ గా సుధీర్ బాబు డిఫరెంట్ లుక్ లో హ్యాండ్సమ్ గా కనిపిస్తున్న మూవీ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈసినిమా నుంచి సంక్రాంతి స్పసెషల్ ప్రోమో రిలీజ్ అయ్యింది.

910

ఇక కొత్త కథలతో .. తన పెర్ఫామెన్స్ తో మెస్మరైజ్ చేసే టాలీవుడ్ యంగ్ స్టార్ సత్యదేవ్ ఈసారి గాడ్ సే గా రాబోతున్నాడు. గోపీ గణేష్ డైరెక్ట్ చేస్తున్న ఈమూవీలో ప్రకాశ్ రాజ్, నాగబాబు లాంటి స్టార్స్ కూడా కొత్త లుక్ లో కనిపించబోతున్నారు.  ఈ టీమ్ కూడా ఆడియన్స్ కు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

1010

ఇవే కాదు. చిన్న సినిమాలైన స్టాండప్ రాహుల్. నీకు నాకు పెళ్ళంట టాంటాం, రీ సౌంట్ లాంటి సినిమాలు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ స్పెషల్ పోస్టర్స్ రిలీజ్ చేశారు. ఈ సంక్రాంతికి ఇండస్ట్రీ ఎన్ని బాధలు పడుతున్నా.. ఇక నుంచి అయినా.. మంచి జరగాలని కొరుకుంటున్నారు. సంక్రాంతిని ఘనంగా జరుపుకుంటున్నారు ఇండస్ట్రీ జనాలు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mokshagna: మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీపై క్లారిటీ? ముహూర్తం ఫిక్స్ చేసిన బాలకృష్ణ, రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Recommended image2
Krishna Movies: కృష్ణాష్టమికి చూడాల్సిన 7 యానిమేటెడ్ సినిమాలు ఇవే!
Recommended image3
భయపెడుతూ నవ్వించి, 180 కోట్లు కొల్లగొట్టిన హారర్ సినిమా.. ఓటీటీలో ఇప్పటికీ ట్రెండింగే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved