MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • చిన్న వయస్సులోనే హఠాత్తుగా కన్నుమూసిన తెలుగు స్టార్స్ ఎవరో తెలుసా?

చిన్న వయస్సులోనే హఠాత్తుగా కన్నుమూసిన తెలుగు స్టార్స్ ఎవరో తెలుసా?

తెలుగు సినీ పరిశ్రమ అనేక గొప్ప కళాకారులను అందించింది. అయితే, కొందరు తెలుగు స్టార్స్  తమ ప్రతిభను పూర్తిగా చూపించేలోపు అనుకోకుండా చిన్న వయస్సులో ఈ లోకాన్ని విడిచిపెట్టారు. వారి మృతి తెలుగు సినిమా ఇండస్ట్రీకి గాయాన్ని మిగిల్చింది. 

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 26 2025, 07:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
మహానటి సావిత్రి
Image Credit : times of india

మహానటి సావిత్రి

తెలుగు సినీ చరిత్రలో చెరగని ముద్ర వేసిన మహానటి సావిత్రి. తెలుగు, తమిళ సినిమాల్లో స్టార్ గా వెలుగు వెలిగిన ఈ హీరోయిన్ కేవలం 45 ఏళ్ల వయస్సులోనే కన్నుమూసింది. 1935లో జన్మించిన ఆమె తన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించారు. ఆమె చేసిన పాత్రలు, సినిమాలు ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచి ఉన్నాయి. అనారోగ్య కారణాలతో కోమాలోకి వెళ్లిన సావిత్రి 1981లో మృతి చెందారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
సౌందర్య
Image Credit : IMDB

సౌందర్య

సావిత్రి తరువాత హీరోయిన్ గా అంతటి పేరు తెచ్చుకున్న నటి సౌందర్య. అవ్వడానికి కన్నడ నటి అయినా సౌందర్యను తెలుగింటి ఆడపడుచుగా ఆదరించారు. తెలుగులో ‘రాజేంద్రుడు, గజేంద్రుడు’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి, స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు సౌందర్య. చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేష్, శ్రీకాంత్, జగపతి బాబు, లాంటిస్టార్ హీరోలతో, కుటుంబ కథా సినిమాలు చేస్తూ స్టార్ డమ్ ను సాధించింది. ఎక్స్ పోజింగ్ కు ఛాన్స్ లేకుండా, చీరకట్టుతోనే హీరోయిన్ గా ఛాన్స్ లు సాధించిన సౌందర్య.. కట్టు, బొట్టు, నటనతో ప్రత్యేక గుర్తింపు సాధించింది. ఇక స్టార్ హీరోయిన్ గా ఫామ్ లో ఉండగానే 2004లో హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూశారు. ఆమె మరణం ఇండస్ట్రీని తీవ్రంగా కలచివేసింది.

Related Articles

Related image1
9 కోట్లకు పైగా ఫాలోవర్స్, మోదీని దాటిన ఇమేజ్, ప్రభాస్ తో ప్లాప్ సినిమా చేసిన హీరోయిన్ ఎవరు?
Related image2
2025 లో అత్యధిక ఇన్ స్టా గ్రామ్ ఫాలోవర్స్ ఉన్న టాప్ 5 తెలుగు హీరోలు ఎవరో తెలుసా?
37
ఉదయ్ కిరణ్
Image Credit : Asianet News

ఉదయ్ కిరణ్

చిత్రం సినిమాతో హీరోగా పరిచయం అయ్యి.. నటుడిగా స్టార్ డమ్ చూశాడు ఉదయ్ కిరణ్. చాలా తక్కువ టైమ్ లోనే హీరోగా మంచి గుర్తింపు పొందారు. ఇండస్ట్రీలో సౌమ్యుడిగా పేరున్న ఉదయ్ కిరణ్, మంచి మంచి సినిమాలతో స్టార్ డమ్ సంపాదించుకున్నాడు. కానీ కెరీర్‌లో ఎదురైన ఒత్తిడులు, ఫ్యామిలీ లైఫ్ లో ఎదురైన సమస్యల కారణంటా 2014లో ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన మరణం సినీ ప్రియులను కలచివేసింది. అయితే ఉదయ్ కిరణ్ మరణం కూడా ఇప్పటికీ అంతుబట్టని మిస్టరీగానే ఉంది.

సాగర్

హీరో సాగర్ చాలామందికి తెలియదు. కానీ ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ సినిమా హీరో అనగానే మాత్రం వెంటనేగుర్తు పడతారు. సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఈ యంగ్ హీరో, మరో రెండు సినిమాలు చేసుంటే ఇంకా మంచి గుర్తింపు వచ్చేది. ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమా తరువాత మరోసినిమాకు కమిట్ అయ్యారు సాగర్. ఆ సినిమాకోసం బెంగళూరులో షాపింగ్ చేసి, హైదరాబాద్ వస్తుండగా.. రోడ్డు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. తొలి సినిమాతోనే గుర్తింపు తెచ్చుకున్న సాగర్ చిన్నవయస్సులోనే మరణించడం బాధాకరంగా మారింది.

47
ఆర్తి అగర్వాల్
Image Credit : google

ఆర్తి అగర్వాల్

‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది ఆర్తి అగర్వాల్, స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఎన్టీఆర్, ప్రభాస్, తరుణ్, వెంకటేష్ లాంటి స్టార్ హీరోల సరనన నటించి మెప్పించింది. కానీ వ్యక్తిగత సమస్యలతో 2015లో ఆమె మరణించారు. ఆమె మరణం అభిమానులను శోకసంద్రంలో ముంచింది. కెరీర్ లో ఆర్తి అగర్వాల్ వేసిన రాంగ్ స్టెప్స్ ఆమె కెరీర్ కు శాపంగా మారాయి.

ప్రత్యూష

టాలీవుడ్ లో అచ్చ తెలుగు హీరోయిన్లు చాలా తక్కువ. ఇప్పుడు ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్లు లేనే లేరు. కాని ఒకప్పుడు ప్రత్యూష లాంటి హీరోయిన్ టాలీవుడ్ నుంచి అనూహ్యంగా ఎదిగింది. కానీ స్టార్ హీరోయిన్ స్టేటస్ సాధిస్తుంది అనుకుంటున్న టైమ్ లో ఆమె 2002లో ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదంగా నిలిచింది. అయితే ప్రత్యూష మరణం కూడా రాజకీయంగా సంచలనం అయ్యింది. ఇప్పటికీ మిస్టరీగానే ఉంది.

57
దివ్య భారతి
Image Credit : google

దివ్య భారతి

తెలుగుతో పాటు బాలీవుడ్‌లోనూ నటించిన దివ్యభారతి, రెండు మూడు సినిమాలకే స్టార్ డమ్ ను సంపాదించింది. చిన్న వయస్సులో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన దివ్య భారతి, 20 ఏళ్లు నిండకుండానే పెళ్ళి చేసుకుంది, 20 ఏళ్లు రాకుండానే కన్నుమూసింది. 1993లో ముంబయిలో అనుమానాస్పద పరిస్థితుల్లో తన ప్లాట్ బాల్కనీ నుంచి కింద పడి దివ్య భారతి మృతి చెందింది. ఆమె మరణం ఇప్పటికీ అంతుబట్టని మిస్టరీగానే ఉంది.

67
వేణుమాధవ్
Image Credit : our own

వేణుమాధవ్

తెలుగు సినిమాల్లో తన కామెడీతో అలరించిన వేణుమాధవ్, కాలేయ సంబంధిత వ్యాధులతో 2019లో కన్నుమూశారు. చిన్న వయస్సులోనే ఆయన మృతి తారల మధ్య విషాదాన్ని నింపింది.

నందమూరి తారకరత్న

నందమూరి తారకరత్న, గుండెపోటుతో 2023 ఫిబ్రవరి 18న బెంగుళూరులో మృతి చెందారు. ఆయన వయసు కేవలం 39 సంవత్సరాలు మాత్రమే. అప్పటివరకు ఎంతో జోష్‌తో సినిమాలు, రాజకీయాల్లో ముందుకు సాగుతున్న తారకరత్న మృతి సినీ రంగానికి షాక్ ఇచ్చింది.

77
శ్రీహరి
Image Credit : our own

శ్రీహరి

తెలుగు సినిమాల్లో విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, హీరోగా పేరుగాంచిన శ్రీహరి, 49 ఏళ్ల వయసులో 2013లో ముంబైలో ఒక షూటింగ్ సమయంలో అనారోగ్యం పాలయ్యారు. చికిత్స పొందుతూ లీలావతి హాస్పిటల్‌లో కన్నుమూశారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
సావిత్రి (నటి)
సౌందర్య
ఉదయ్ కిరణ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan Kalyan: పవన్‌ వల్లే ఉదయ్‌ కిరణ్‌ ఫోటోలు లీక్‌.. సుస్మిత ఎంగేజ్‌మెంట్‌ క్యాన్సిల్‌ వెనుక జరిగింది ఇదే
Recommended image2
Reshma Rathore: సినిమాలకు గుడ్‌ బై చెప్పి కోర్ట్ మెట్లు ఎక్కుతున్న టాలీవుడ్‌ హీరోయిన్‌.. డేరింగ్‌ స్టెప్‌
Recommended image3
Vijay Deverakonda: మందు, అమ్మాయి, బ్రేకప్‌ ఇప్పుడు పెళ్లి.. తన లైఫ్ సీక్రెట్స్ అన్నీ చెప్పేసిన రౌడీ బాయ్
Related Stories
Recommended image1
9 కోట్లకు పైగా ఫాలోవర్స్, మోదీని దాటిన ఇమేజ్, ప్రభాస్ తో ప్లాప్ సినిమా చేసిన హీరోయిన్ ఎవరు?
Recommended image2
2025 లో అత్యధిక ఇన్ స్టా గ్రామ్ ఫాలోవర్స్ ఉన్న టాప్ 5 తెలుగు హీరోలు ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved