- Home
- Districts News
- Hyderabad
- 2025 లో అత్యధిక ఇన్ స్టా గ్రామ్ ఫాలోవర్స్ ఉన్న టాప్ 5 తెలుగు హీరోలు ఎవరో తెలుసా?
2025 లో అత్యధిక ఇన్ స్టా గ్రామ్ ఫాలోవర్స్ ఉన్న టాప్ 5 తెలుగు హీరోలు ఎవరో తెలుసా?
ప్రస్తుతం సోషల్ మీడియా కాలం నడుస్తోంది. స్టార్ హీరోలైన, హీరోయిన్లు అయినా సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఉంటే ఆ ఇమేజ్ వేరు. ఇక మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కువగా ఇన్ స్టా గ్రామ్ ఫాలోవర్స్ ఉన్న టాప్ 5 తెలుగు హీరోలు ఎవరో తెలుసా?

టాప్ 5 తెలుగు హీరోలు
ప్రస్తుతం సినిమా సెలబ్రిటీల స్టార్ డమ్, సోషల్ మీడియా ఇమేజ్ ను బట్టి నిర్ణయించబడుతోంది. నెట్టింట ఎంత మంది ఫాలోవర్స్ ఉంటే వారు అంత పెద్ద స్టార్లు గా మారుతున్నారు. సినిమాలు ఉన్నా లేకపోయినా, వరుసగా ప్లాప్ లు పడ్డా కానీ వారిని సోషల్ మీడియా ఇమేజ్ కాపాడుతోంది. ఇక మన తెలుగు హీరోలలో ఎక్కువగా ఇన్ స్టా గ్రామ్ ను ఫాలో అవుతున్న హీరోలు ఎవరు? టాలీవుడ్ హీరోలలో ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న టాప్ 5 హీరోలు ఎవరు అనేది చూద్దాం. ఎవరికి ఎంత ఫాలోయింగ్ ఉంది అనేది కూడా చూద్దాం.
అల్లు అర్జున్
ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న తెలుగు హీరోలలో ముందుంన్నారు అల్లు అర్జున్. ఇన్ స్టాలో అల్లు అర్జున్ ను 28 మిలియన్స్ నెజిజన్లు ఫాలో అవుతున్నారు. అంటే దాదాపు రెండు కోట్ల 80 లక్షల మంది ఫాలోవర్స్ అల్లు అర్జున్ కు ఉన్నారు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో అల్లు అర్జున్ ఇమేజ్ పెరిగిపోయింది. పుష్ప రెండు సినిమాలు నార్త్ లో విపరీతమైన క్రేజ్ ను సాధించాయి. దాంతో ఆయన ఫాలోవర్స్ సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. అయితే ప్రస్తుతం అట్లీతో చేస్తున్న అడ్వెంచర్ మూవీతో మరోసారి సత్తా చాటబోతున్నాడు బన్నీ. ఈసినిమా అనుకున్నట్టు హిట్ అయితే అల్లు అర్జున్ ను పట్టుకోవడం కష్టమే. అట్లీ సినిమాను దాదాపు 800 కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. పుష్ప సినిమా దాదాపు 1800 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఇక అట్లీ సినిమా 2 వేల కోట్ల కలెక్షన్స్ దాటేలా ప్లాన్ చేసుకుంటున్నట్టుస మాచారం. ఇక సౌత్ సినీ ఇండస్ట్రీ నుంచి ఎక్కువ మంది ఇన్ స్టా ఫాలోవర్స్ ఉన్న ఫస్ట్ హీరోగా అల్లు అర్జున్ రికార్డు క్రియేట్ చేసాడు.
రామ్ చరణ్
మెగా పవర్ స్టార్, గ్లోబల్ హీరో రామ్ చరణ్ కూడా ఇన్ స్టా ఫాలోవర్స్ లో టాప్ లో ఉన్నారు. ఆర్ఆర్ఆర్ మూవీతో వరల్డ్ వైడ్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాధించుకున్న రామ్ చరణ్.. ఇండియా వైడ్ గా భారీ క్రేజ్ ను సంపాదించాడు. ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ లో రామ్ చరణ్ అల్లు అర్జున్ తరువాత సెకండ్ ప్లేస్ ల్ ఉన్నారు. మెగా హీరో కు ఇన్ స్టాలో 25.2 మిలియన్ అంటే 2 కోట్ల 50 లక్షల వరకూ ఫాలోవర్స్ ఉన్నారు. ఆర్ఆర్ఆర్ తరువాత వరుసగా రెండు డిజాస్టర్ సినిమాలు ఫేస్ చేశాడు రామ్ చరణ్. తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించిన ఆచార్య తో పాటు, సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో నటించిన గేమ్ ఛేంజర్ మూవీ కూడా డిజాస్టర్ అయ్యింది. దాంతో ప్రస్తుతం రామ్ చరణ్ కు హిట్ కొట్టడంతప్పనిసరి అయ్యింది. దాంతో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు చరణ్. ప్రస్తుతం బుచ్చిబాబు సన డైరెక్షన్ లో పెద్ది సినిమాలో డిఫరెంట్ రోల్ చేస్తున్నాడు రామ్ చరణ్. సుకుమార్ కథ అందించిన ఈసినిమాతో పక్కా హిట్ కొడతాడన్న నమ్మకంతో ఉన్నాడు. ఈసినిమా తరువాత సుకుమార్ తో మరో సినిమాను ప్లాన్ చేస్తున్నాడు రామ్ చరణ్.
విజయ్ దేవరకొండ
అల్లు అర్జున్,రామ్ చరణ్ తర్వాత దక్షిణాదిలో ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న హీరో విజయ్ దేవరకొండ. వరుస ప్లాప్ సినిమాలు ఎదురవుతున్నా క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గడంలేదు. విజయ్ కు యూత్ ఆడియన్స్ లో ఎక్కువగా క్రేజ్ ఉంది. ప్రస్తుతం ఇన్ స్టా గ్రామ్ లో విజయ్ దేవరకొండకు 21.9 మిలియన్ ఫాలోవర్స్, అంటే దాదాపు రెండు కోట్ల 10 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. రీసెంట్ గా కింగ్ డమ్ సినిమాతో ఫ్యాన్స్ న పలకరించాడు విజయ్, కానీ ఆ సినిమా ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. ఒక రకంగా చెప్పాలంటే గీతగోవిందం సినిమా తరువాత విజయ్ దేవరకొండకు సాలిడ్ హిట్ మాత్రం పడలేదు. మధ్యలో టాక్సీవాల, ఖుషి లాంటి కొన్ని సినిమాలు పర్వాలేదు అనిపించినా.. అర్జున్ రెడ్డి లాంటి సాలిడ్ హిట్ మాత్రం పడలేదు. ఇలా వరుసగా మరికొన్నిప్లాప్ లు పడితే విజయ్ కెరీర్ డేంజర్ లో పడే అవకాశం కనిపిస్తోంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు
ఇక ఇన్ స్టా ఫాలోవర్స్ లో నాలుగో స్థానంలో ఉన్నాడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు. ఆయనకు ఇన్‌స్టాగ్రామ్‌లో 14.8 మిలియన్, అంటే దాదాపు 1 కోటి 40 లక్షల 80 వేలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. వరుసగా హిట్ సినిమాలు చేస్తున్నాడు మహేష్. అయితే ఆయన ఇంత వరకూ పాన్ ఇండియా సినిమా చేయలేదు. ప్రస్తుతం రాజమౌళితో పాన్ వరల్డ్ సినిమానే చేస్తున్నాడు మహేష్. ఈసినిమా దాదాపు 1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కతోంది. ఈమూవీ అనుకున్నంత హిట్ అయితే మాత్రం పాన్ వరల్డ్ స్థాయిలో ఇన్ స్టా ఫాలోవర్స్ మహేష్ కు భారీగా పెరిగే అవకాశం ఉంది. రాజమౌళి సినిమా తరువాత మహేష్ ఫస్ట్ ప్లేస్ కు వచ్చే అవకాశం కూడా ఉంది.
prabhas
ఇక పాన్ ఇండియా హీరో అయినా సరే సోషల్ మీడియాను పెద్దగా పట్టించుకోడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. పెద్దగా అప్ డేట్ కూడా చేయడు. వరుసగా భారీ బడ్జెట్ సినిమాలతో బిజీ బిజీగా ఉన్న ప్రభాస్, చాలా లేట్ గా ఇన్ స్టా గ్రామ్ లో ఖాతా ఓపెన్ చేశాడు. పెద్దగా పట్టించుకోకపోయినా సరే ప్రభాస్ కు ఇన్ స్టాలో 13. 3 మిలినయన్లు అంటే కోటీ 30 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉండటం గమనార్హం. ప్రస్తుతం ప్రభాస్ రాజా సాబ్ తో రిలీజ్ కు రెడీ అయ్యాడు. ఈసినిమా నెక్ట్స్ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ అవ్వడానికి ముస్తాబు అవుతోంది. ఈమూవీతో పాటు హనురాఘవపూడితో ఓ మూవీ, సందీప్ రెడ్డి వంగాత్ స్పిరిట్, సలార్ 2, కల్కీ2 సినిమాలు కూడా లైన్ లో ఉన్నాయి.