MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • HanuMan : ‘హను-మాన్’ మూవీని నిలిపివేశారు... నిర్మాతలకు మరో దెబ్బ పడిందే!

HanuMan : ‘హను-మాన్’ మూవీని నిలిపివేశారు... నిర్మాతలకు మరో దెబ్బ పడిందే!

తేజా సజ్జా - ప్రశాంత్ వర్మ కాంబోలో సూపర్ హీరో ఫిల్మ్ ‘హను-మాన్’ HanuMan ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. తొలిరోజు మంచి రెస్పాన్స్ నే దక్కించుకుంది. కానీ కొన్ని థియేటర్లలో ప్రదర్శనను నిలిపివేయడం మేకర్స్ కు దెబ్బగా మారింది. 

1 Min read
Author : Shreekanth Nuthi
| Updated : Jan 13 2024, 08:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

యంగ్ హీరో తేజ సజ్జా (Teja Sajja)  హీరోగా ప్రశాంత్‌ వర్మ (Prashanth Varma) దర్శకత్వంలో రూపొందించిన చిత్రం `హనుమాన్‌`. సూపర్ హీరో ఫిల్మ్ గా నిన్న శుక్రవారం(జనవరి 12న) గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. 

26

ప్రేక్షకుల నుంచి చిత్రానికి మంచి రెస్పాన్స్ దక్కుతోంది. అయితే, ఈ చిత్రం సంక్రాంతికి రిలీజ్ కావడం... పైగా మహేశ్ బాబు, వెంకీ, నాగార్జున చిత్రాలతో కలిసి థియేటర్లలోకి రావడం ఆసక్తికరంగా మారింది. 

36

ఇదిలా ఉంటే... సంక్రాంతికి సినిమా సందడి పెరగడంతో థియేటర్ల సమస్య ఏర్పడింది. నిర్మాతల మండలి మాత్రం ‘గుంటూరు కారం’, ‘సైంధవ్’, ‘నా సామిరంగ’ చిత్రాలకు థియేటర్లను సర్దుబాటు చేశారు. కానీ తేజా సజ్జా ‘హను-మాన్’కు థియేటర్ల సమస్య ఏర్పడింది. 
 

46

ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదలవడంతో సినిమాకు ఇతర భాషల్లో రిలీజ్ కు థియేటర్ల సమస్య లేదు. అందుకే సంక్రాంతికే రిలీజ్ చేశారని తెలుస్తుండగా... తెలుగు స్టేట్స్ లో ‘హనుమాన్’ మూవీకి చాలా తక్కువ థియేటర్లే ఉన్నాయి. టాక్ అదిరిన తర్వాత సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
 

56

అయితే.. అప్పటికే థియేటర్ల సమస్యను ఎదుర్కొన్న ‘హనుమాన్’ మూవీకి.... కొందరు థియేటర్ల యాజమాన్యాల నుంచి మరో సమస్య ఎదురైంది. ఏమైందో గానీ నైజాంలోని కొన్ని థియేటర్లలో ‘హనుమాన్’ సినిమాను ప్రదర్శించలేదంట. దీనిపై మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు TFPCకి కంప్లైంట్ చేశారు. 

66

దీనిపై నిర్మాతల మండలి స్పందించింది. ‘జనవరి 12న హనుమాన్ ప్రదర్శనకు మైత్రీతో చేసుకున్న ఒప్పందానికి లోబడి థియేటర్లలో సినిమాను ప్రదర్శించాలి. ఉల్లంఘనలు అతిక్రమించడంతో ఇప్పటివరకు కలిగిన నష్టాన్ని కూడా థియేటర్ యాజమన్యాలే భరించాలి’ అంటూ నిర్మాతల మండలి ఆదేశించింది. 

About the Author

SN
Shreekanth Nuthi

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT Movies: ఈ వారం ఓటీటీలో రొమాంటిక్ అండ్ యాక్షన్ మూవీస్ రిలీజ్.. యువత ఎంజాయ్ చేసే కంటెంట్ రెడీ
Recommended image2
Bellamkonda Sreenivas: ఘనంగా బెల్లంకొండ శ్రీనివాస్ నిశ్చితార్థం, వైరల్ ఫోటోస్.. పెళ్లి ఎప్పుడో తెలుసా
Recommended image3
Kareena Kapoor: పెళ్లి తర్వాత ఆ పని చేయలేనని తేల్చి చెప్పేసిన హీరోయిన్.. ఏం జరిగిందో తెలుసా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved