- Home
- Entertainment
- HanuMan Review:'హనుమాన్' ప్రీమియర్ రివ్యూ..ఇంటర్వెల్ బ్యాంగ్ , క్లైమాక్స్ కెవ్వు కేక..ప్రశాంత్ వర్మ తోపు అంతే
HanuMan Review:'హనుమాన్' ప్రీమియర్ రివ్యూ..ఇంటర్వెల్ బ్యాంగ్ , క్లైమాక్స్ కెవ్వు కేక..ప్రశాంత్ వర్మ తోపు అంతే
ఆల్రెడీ హను మాన్ ప్రీమియర్ షోలు తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమయ్యాయి. ప్రీమియర్ షోల నుంచి ఆల్రెడీ ఆడియన్స్ రెస్పాన్స్ మొదలైపోయింది.

యువ హీరో తేజ సజ్జా, ట్యాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో ప్రయోగాత్మకంగా తెరకెక్కిన సూపర్ హీరో చిత్రం 'హను మాన్'. ఇక్కడ ఆంజనేయ స్వామినే సూపర్ హీరోగా చూపిస్తూ ఆయన శక్తి యుక్తులతో హీరో ఏం చేశాడు అనే ఆసక్తికరమైన కథతో హను మాన్ చిత్రం తెరకెక్కింది. వినయ్ రాయ్ ప్రతినాయకుడిగా, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో తెరకెక్కిన మరికొన్ని గంటల్లో జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆల్రెడీ హను మాన్ ప్రీమియర్ షోలు తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమయ్యాయి. ప్రీమియర్ షోల నుంచి ఆల్రెడీ ఆడియన్స్ రెస్పాన్స్ మొదలైపోయింది. కాస్త రొటీన్ గా ఉన్నప్పటికీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఆకట్టుకుంటున్నాయి. దర్శకుడు ప్రశాంత్ వర్మ ఆసక్తికరంగా కథని మలిచారు. 1998 టైం నుంచి విలన్ వినయ్ రాయ్ సూపర్ హీరోగా మారేందుకు ప్రయత్నాలు చేస్తుంటాడు. నిత్యం ప్రయోగాలు చేస్తుంటాడు. కానీ సూపర్ పవర్స్ అతడికి దొరకవు. సూపర్ హీరోగా కొన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ విలన్ ఫెయిల్ అవుతాడు.
కట్ చేస్తే కథ ప్రెజెంట్ కి మారుతుంది. అడవుల్లో ఉండే అంజనాద్రి అనే ఊరిని చూపిస్తారు. ఆ ఊరిలో ఊరి పెద్ద చెప్పినట్లు నడుచుకోవాల్సిన కట్టుబాట్లు ఉంటాయి. ఊరిపెద్దని ఎదిరిస్తే కుస్తీ పోటీల్లో ఎదిరించిన వారిని ఊరి పెద్ద మట్టుబెడుతుంటారు. ఆ ఊరిలో డాక్టర్ గా ఉన్న హీరోయిన్ ఊరి పెద్దని ఎదిరిస్తుంది. దీనితో ఆమెపై అటాక్ చేస్తారు. హీరో తేజ సజ్జా ఆ ఊరిలో అల్లరి చిల్లరగా తిరిగే కుర్రాడిలా ఉంటాడు.
హీరోయిన్ ని కాపాడేందుకు ప్రయత్నించిన తేజ సజ్జాని రౌడీలో కొట్టి ఒక నదిలో పడేస్తారు. అక్కడే అద్భుతం జరుగుతుంది. హనుమంతుడు నుంచి తేజ సజ్జాకి శక్తులు వస్తాయి. అది ఎలాగో వెండితెరపైనే చూడాలి. అక్కడి నుంచే కథ ఒక్కసారిగా మారిపోతుంది. తనకు అందిన హనుమాన్ శక్తులతో తేజ సజ్జా చెడుగుడు ఆడేయడం మొదలు పెడతాడు. ఊరి పెద్దని అంతం చేయడంతో ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది.
వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర మాస్ గా ఉన్నప్పటికీ కాస్త రొటీన్ గా అనిపిస్తుంది. ఇంటర్వెల్ వరకు మూవీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంటుంది. కొన్ని సన్నివేశాలు యావరేజ్ గా ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ పై ఆసక్తి పెరుగుతుంది.
సెకండ్ హాఫ్ లో తేజ సజ్జా సూపర్ పవర్స్ గురించి మెయిన్ విలన్ వినయ్ రాయ్ కి ఎలా తెలిసింది. తేజ సజ్జా నుంచి ఆ సూపర్ పవర్స్ పొందేందుకు విలన్ ఎలాంటి ప్రయత్నాలు చేశాడు అనే అంశాలతో సెకండ్ హాఫ్ సాగుతుంది. సెకండ్ హాఫ్ లో వరలక్ష్మి శరత్ కుమార్, తేజ సజ్జా మధ్య సెంటిమెంట్, ఎమోషనల్ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. వీరి మధ్య వచ్చే ట్విస్ట్ కూడా బావుంటుంది.
సెకండ్ హాఫ్ లో హను మాన్ కి సంబందించిన ప్రతి సీన్ ఆకట్టుకుంటుంది. మిగిలిన సన్నివేశాలు రొటీన్ గా అనిపిస్తాయి. తేజ సజ్జా నుంచి హను మాన్ శక్తులు ఎలాగైనా కొట్టేయాలని వినయ్ రాయ్ గట్టి ప్రయత్నాలు చేస్తుంటాడు. ఇక క్లైమాక్స్ అయితే సినిమాకే హైలైట్ గా నిలిచింది.
ఊహించని విధంగా క్లైమాక్స్ సాగుతుంది. యువ హీరో తేజ ఎక్కడా తగ్గలేదు. అదరగొట్టేశాడు. ఈ చిత్రంతో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ నెక్స్ట్ లెవల్ కి వెళ్లడం ఖాయం. ఊహించని ట్విస్ట్ తో సినిమా చివర్లో ప్రశాంత్ వర్మ హను మాన్ పార్ట్ 2 ని అనౌన్స్ చేశాడు. పార్ట్ 2కి జై హనుమాన్ అనే టైటిల్ కూడా ఖరారైంది. ఓవరాల్ గా సినిమా ఫ్యామిలీ ఆడియన్స్, చిన్న పిల్లలు ఎగబడి వెళ్లేలా ఉంది. విఎఫ్ఎక్స్, బిజియం బావున్నాయి. కెమెరా వర్క్ కూడా ఒకే అని చెప్పొచ్చు. సంక్రాంతికి చిన్న సినిమాగా వచ్చిన హనుమాన్ సాలిడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే దిశాగా తొలి అడుగు పడింది అని చెప్పొచ్చు.