- Home
- Entertainment
- Teachers Day: ఎన్టీఆర్, బాలకృష్ణ, వెంకటేష్, ధనుష్... గురువుల గొప్పతనం చెప్పిన స్టార్ హీరోలు!
Teachers Day: ఎన్టీఆర్, బాలకృష్ణ, వెంకటేష్, ధనుష్... గురువుల గొప్పతనం చెప్పిన స్టార్ హీరోలు!
నేడు ఉపాధ్యాయ దినోత్సవం. విద్యాబుద్ధులు చెప్పే గురువులను గుర్తు చేసుకుని, పూజించే రోజు. సిల్వర్ స్క్రీన్ పై టీచర్స్, ఎడ్యుకేషన్ సిస్టం గొప్పతనం వివరిస్తూ పలు చిత్రాలు తెరకెక్కాయి..
- FB
- TW
- Linkdin
Follow Us
)
Teachers Day Special
భారతదేశ మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్(Sarvepalli Radhakrishnan) జయంతి సందర్భంగా సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం(Teachers Day) నిర్వహిస్తారు. గురువు అనే పదానికి నిదర్శనంగా నిలిచిన సర్వేపల్లి కీర్తిని కొనియాడుతారు. ప్రతి విద్యార్థి తమ గురువులను పూజిస్తారు. ఇక అత్యంత బలమైన మాధ్యమంగా ఉన్న సినిమా ద్వారా టీచర్స్, ఎడ్యుకేషన్ గొప్పదనం తెలియజేస్తూ సినిమాలు తెరకెక్కాయి. ఎన్టీఆర్, చిరంజీవి (Chiranjeevi), వెంకటేష్, బాలకృష్ణ వంటి స్టార్స్ టీచర్స్ గా కనిపించారు. ఆ సినిమాలు ఏమిటో చూద్దాం...
Teachers Day Special
బడిపంతులు
మాస్ హీరోగా ఎదుగుతున్న నందమూరి తారక రామారావు చేసిన సోషల్ సబ్జెక్టు మూవీ బడిపంతులు. 1972లో విడుదలైన ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఆరోజుల్లో గవర్నమెంట్ టీచర్స్ పరిస్థితులు... తల్లిదండ్రులను భారంగా భావించే పిల్లల మనస్తత్వాల గురించి చెప్పారు.
విశ్వరూపం
Teachers Day Special
విశ్వరూపం
సీనియర్ ఎన్టీఆర్(NTR) టీచర్ గా నటించిన మరొక చిత్రం విశ్వరూపం. దర్శకుడు దాసరి నారాయణరావు పొలిటికల్ సెటైర్ గా తెరకెక్కించారు. రాజకీయ నాయకుల స్వార్థ ప్రయోజనాలకు విద్యార్థులు ఎలా బలి అవుతున్నారో గొప్పగా చెప్పారు. ఎన్టీఆర్ లెక్చరర్ గా ఆకట్టుకున్నారు.
Teachers Day Special
సుందరాకాండ
సుందరాకాండ మూవీలో ఇన్నోసెంట్ టీచర్ గా వెంకటేష్ కనిపిస్తారు. కీలకమైన స్టూడెంట్ పాత్రలో అపర్ణ నటించింది. స్టూడెంట్ -టీచర్ మధ్య సంబంధాలు ఎంత ఆరోగ్యకరంగా ఉండాలో హ్యూమర్, ఎమోషన్స్ జోడించి గొప్పగా చెప్పాడు దర్శకుడు రాఘవేంద్రరావు.
Teachers Day Special
మాస్టర్
సురేష్ కృష్ణ దర్శకత్వంలో చిరంజీవి నటించిన చిత్రం మాస్టర్. 1997లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. రౌడీలుగా తయారైన విద్యార్థులను దారిలో పెట్టిన లెక్చరర్ గా చిరంజీవి కనిపించారు. విద్యార్థులతో ప్రేమించబడే లెక్చరర్ రోల్ లో మెస్మరైజ్ చేశారు. సాంగ్స్ సైతం అలరిస్తాయి.
Teachers Day Special
ఠాగూర్
సమాజంలో ఉన్న అవినీతిని కూకటివేళ్లతో పెకలించాలి అంటే విద్యార్థి దశ నుండి యువతను సిద్ధం చేయాలనే అద్భుతమైన కాన్సెప్ట్ తో ఠాగూర్ తెరకెక్కింది. ఈ చిత్రంలో ఒక సైన్యాని తయారు చేసుకునే టీచర్ పాత్రలో చిరంజీవి అద్భుతం చేశారు. దర్శకుడు వివి వినాయక్ తెరకెక్కించిన ఠాగూర్ భారీ బ్లాక్ బస్టర్.
Teachers Day Special
లెజెండ్
దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన లెజెండ్ మూవీలో బాలకృష్ణ(Balakrishna) డ్యూయల్ రోల్ చేశాడు. ఓ పాత్రలో ఆయన లెక్చరర్ గా చేశారు. డ్రగ్స్ కి బానిసైన విద్యార్థుల తాటతీసి దారికి తెచ్చే రెబల్ లెక్చరర్ గా కనిపించారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది.
Teachers Day Special
సార్
హీరో ధనుష్ లెక్చరర్ గా నటించిన చిత్రం సార్. కార్పొరేట్ విద్యాసంస్థలు గవర్నమెంట్ స్కూల్స్, కాలేజీలను కుట్రపూరితంగా నిర్వీర్యం చేసి పేదలకు విద్య దూరం చేస్తున్నారో చర్చించారు. సమకాలీన విద్యావ్యవస్థలో ఉన్న సమస్యను చెప్పిన తీరు బాగుంది. వెంకీ అట్లూరి ఈ చిత్ర దర్శకుడు. వీటితో పాటు హీరోలు టీచర్స్ నటించిన చిత్రాలు చాలా ఉన్నాయి. ఇక్కడ కేవలం కొన్ని చిత్రాలను చర్చించడం జరిగింది.
మాస్టర్(2021)
విజయ్(Vijay) రౌడీ లెక్చరర్ గా కనిపించారు మాస్టర్ మూవీలో. జువెనైల్ స్కూల్ టీచర్ పాత్రలో ఆయన అదరగొట్టాడు. దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఈ చిత్ర దర్శకుడు. బాలనేరస్థులతో క్రైమ్స్ చూపించే గ్యాంగ్ ఆట కట్టించే టీచర్ గా విజయ్ పాత్ర అద్భుతంగా ఉంటుంది.