- Home
- Entertainment
- Balakrishna: బాలకృష్ణ చేసిన ఆ దరిద్రపు పని నేను కూడా చేశా, కోపంతో చేయాల్సి వచ్చింది.. నిర్మాత కామెంట్స్
Balakrishna: బాలకృష్ణ చేసిన ఆ దరిద్రపు పని నేను కూడా చేశా, కోపంతో చేయాల్సి వచ్చింది.. నిర్మాత కామెంట్స్
తమ్మారెడ్డి భరద్వాజ ఓ ఇంటర్వ్యూలో బాలకృష్ణపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చెత్త పాటలు లేకుండానే బాలకృష్ణ సినిమాలు బాగా ఆడుతున్నాయి. అయినా కొన్ని సినిమాల్లో అలాంటి సాంగ్స్ పెడుతున్నారు అని అన్నారు.

బాలకృష్ణ సాంగ్స్
నందమూరి బాలకృష్ణ సినిమాల్లో ఇటీవల స్పెషల్ సాంగ్స్ తప్పనిసరి అయిపోయాయి. డాకు మహారాజ్ సినిమాలో దబిడి దిబిడి సాంగ్ అయితే ఒక రేంజ్ లో వైరల్ అయింది. అదే స్థాయిలో వివాదం కూడా సృష్టించింది. ఆ సాంగ్ లో బాలయ్య, ఊర్వశి రౌటేలా డ్యాన్స్ మూమెంట్స్ పై విపరీతమైన చర్చ జరిగింది. దీని గురించి తమ్మారెడ్డి భరద్వాజ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బాలకృష్ణ ఇమేజ్ కి దెబ్బ
డాకు మాహారాజ్ సినిమా బాగా ఆడింది. ఆ సాంగ్ లేకపోయినా సినిమాకు వచ్చే నష్టం లేదు. అలాంటప్పుడు ఆ దరిద్రపు సాంగ్ ఎందుకు పెట్టాలి. దానివల్ల బలకృష్ణ స్టేచర్ దెబ్బ తింటుంది. ఆ సాంగ్ వల్ల పెద్దగా టికెట్లు తెగేది ఏమీ ఉండదు. బాలకృష్ణ చేసినా ఈ దరిద్రపు పనినే నేను కూడా గతంలో చేశాను.
నేను కూడా ఆ దరిద్రపు పని చేశా
సుమన్, భానుప్రియ, మాలశ్రీ కాంబినేషన్ లో తెరకెక్కించిన బంగారు మొగుడు అనే చిత్రంలో ఒక చెత్త సాంగ్ పెట్టాను. నాకు అలాంటివి ఇష్టం ఉండదు. కానీ మంచి సినిమాలు, మంచి కంటెంట్ తో తీస్తుంటే జనాలు చూడడం లేదు అనే కోపం ఫ్రస్ట్రేషన్ తో 'అక్కడ చెయ్యేస్తే' అనే చెత్త సాంగ్ తీశాను. అలాంటి పాతాల వల్ల చెడ్డ పేరు రావడం తప్ప సినిమాకు ఉపయోగం ఉండదు.
చిరంజీవి సినిమా గురించి మాట్లాడా
చిరంజీవి గారి ఖైదీ నెంబర్ 150 చిత్రం రిలీజ్ అయినప్పుడు కూడా అమ్మడు కుమ్ముడు అనే సాంగ్ గురించి మాట్లాడాను. అంత మంచి సినిమాలు అలాంటి పాట ఎందుకు అని ప్రశ్నించా. కానీ వాళ్లంతా అలాంటి సాంగ్స్ ఉంటేనే సినిమాకు అట్రాక్షన్ అని నమ్ముతున్నారు.
అలాంటివి అవసరం లేదు
బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి మూవీలో ఎలాంటి స్సెషల్ సాంగ్ లేదు. అయినా కూడా ఆ సినిమా ఆడింది కదా. అలాంటపుడు మీకు ఈ దరిద్రపు సాంగ్స్ ఎందుకు ? అనవసరమైన వివాదాలు ఎందుకు ? అని తమ్మారెడ్డి ప్రశ్నించారు.















