- Home
- Entertainment
- ఆదిపురుష్ టీజర్ పై తమ్మారెడ్డి విమర్శలు.. 3డిలో చూస్తే రాముడు, రావణుడి గెటప్ మారిపోతుందా..
ఆదిపురుష్ టీజర్ పై తమ్మారెడ్డి విమర్శలు.. 3డిలో చూస్తే రాముడు, రావణుడి గెటప్ మారిపోతుందా..
ఒక వైపు ఆదిపురుష్ చిత్ర యూనిట్ డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడానికి, ఉన్న కంటెంట్ ని ప్రమోట్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు టీజర్ పై విమర్శలు కొనసాగుతున్నాయి.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రం సంక్రాంతికి విడుదలయ్యేందుకు సిద్ధం అవుతోంది. రామాయణ గాధతో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఎన్నో అంచనాలు అభిమానుల్లో ఉండేవి. కానీ టీజర్ విడుదలయ్యాక అంచనాలన్నీ తలక్రిందులు అయ్యాయి. దర్శకుడు ఓం రౌత్ ఏదో చేయబోయే ఇంకేదో చేసినట్లు ఉన్నాడు. గ్రాఫిక్స్ మాయలో పడి రామాయణాన్ని, ఆ పాత్రలని కించపరిచారు అంటూ విమర్శలు ఎదుర్కొంటున్నాడు.
ఒక వైపు ఆదిపురుష్ చిత్ర యూనిట్ డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడానికి, ఉన్న కంటెంట్ ని ప్రమోట్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు టీజర్ పై విమర్శలు కొనసాగుతున్నాయి. ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తాజాగా ఆదిపురుష్ టీజర్ పై స్పందించారు.
ఆదిపురుష్ టీజర్ చూశాను. ప్రభాస్ సినిమా అనేసరికి చాలా వాడి వేడి ఉంటుంది. 500 కోట్ల బడ్జెట్ లో నిర్మించాం అంటున్నారు. కానీ టీజర్ నిరాశపరిచింది. యానిమేటెడ్ మూవీలాగా ఉంది. రజినీకాంత్ కొచ్చాడియాన్ లాగా తీశారు అని అంతా ట్రోల్ చేస్తున్నారు.
20 రోజుల్లో అంతా మారిపోతుందని, 3 డీ లో చూస్తే మీ అభిప్రాయం మారుతుందని అంటున్నారు. 2డీలో చూసినా 3 డీలో చూసినా పాత్రల గెటప్స్ మారవు కదా. దేవుడిలా కొలిచే దేశంలో రాముడిని ఆయన గెటప్ మార్చి చూపించారు. రావణుడికి కూడా దేవాలయాలు ఉన్నాయి. వాళ్ళ గెటప్ చూపించిన విధానం విచిత్రంగా ఉంది.
నిజంగా 20 రోజుల్లో అంతా మారిపోతే మంచిదే. ఆదిపురుష్ చిత్రానికి ఆల్ ది బెస్ట్ అని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. ఆదిపురుష్ టీజర్ విడుదలైనప్పటి నుంచి ఎదురవుతున్న విమర్శల నుంచి తప్పించుకునేందుకు దర్శకుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తాను రామాయణంని ఉన్నది ఉన్నట్లుగా తీయడం లేదు అని అన్నారు. ఇప్పటి జనరేషన్ కి అర్థం అయ్యే విధంగా పాత్రలని మార్చి చూపించబోతున్నట్లు ఓం రౌత్ వ్యాఖ్యానించారు. దీనితో ఈ వ్యాఖ్యలపై కూడా విమర్శలు మొదలయ్యాయి.