జ్యోతిక కంటే ముందే మరో అమ్మాయితో సూర్య లవ్ స్టోరీ..? ఇంతకీ ఎవరా అమ్మాయి..?
హీరోయిన్ జ్యోతికను ఘాడంగా ప్రేమించ పెళ్ళాడాడు తమిళ స్టార్ హీరో సూర్య. అయితే ఆయనకు అంతకు ముందే ఓ లవ్ స్టోరీ ఉంది అంటూ.. కోడై కూస్తోంది సోషల్ మీడియా ఇంతకీ ఇందులో నిజమెంత...? ఎవరా అమ్మాయి..?

కోలీవుడ్ లోకి వారసత్వంగా వచ్చి... సూపర్ హీరోగా మారాడు. తన సొంత టాలెంట్ తో ఎదిగి తమళనాట స్టార్ హీరోగా అవతారం ఎత్తాడు సూర్య. తమిళ నాట సూర్య అంటే పడి చచ్చిపోతుంటారు ఫ్యాన్స్. సూర్యను అప్పట్లో ఎంతో మంది అమ్మాయిలు ప్రేమించారు.. ఆయన కనిపిస్తే చాలు అంటూ ఎదురుచూసిన వారు ఎందరో.
ఈక్రమంలో సూర్యకోసం ఎంతో మంది అమ్మాయిలు వెంట పడుతుంటే.. ఆయన మాత్రం హీరోయిన్ జ్యోతికను ఘాడంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . కలిసి సినిమాలు చేస్తున్న టైంలోనే ప్రేమించుకున్న ఈ జంట ఇంట్లో పెద్దలు తమ పెళ్ళికి ఒప్పుకోరు అని తెలిసి గుడిలో గుట్టూ చప్పుడు కాకుండా పెళ్లి చేసుకున్నారు . ఆ తర్వాత ఆ విషయం బయటపడి ఫ్యామిలీలో ఉండే పెద్దలు జ్యోతిక – సూర్య తల్లిదండ్రులను ఒప్పించి మరోసారి పెళ్లిని గ్రాండ్ గా జరిపించారు.
వారి పెళ్ళి జరగడం.. వారికి ట్విన్స్ పుట్టడం.. వాళ్లు పెద్దవాళ్లు అవ్వడం కూడా జరిగిపోయింది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓన్యూస్ వైరల్ అవుతోంది. సూర్య.. జ్యోతిక కంటే ముందే ఓ అమ్మాయిని ఇష్టపడ్డాడు అంటూ కోలీవుడ్ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
సూర్య కాలేజీ చదువుకునే రోజుల్లోనే ప్రేమలో పడ్డాడట..అప్పట్లో ఓఅమ్మాయిని ప్రాణంగా ప్రేమించాడట. కాని ఆఅమ్మాయి మాత్రం సూర్యను కాదని.. ఇంట్లో వాళ్ళు చెప్పిన పెళ్లి సంబంధం చేసుకొని సూర్యని మర్చిపోయిందట.. ఇక దాంతో చాలా కాలం ఆ అమ్మాయిని తలుచుకుని చాలా సంవత్సరాలు బాధపడ్డాడని తెలుస్తోంది. ఇక ఇండస్ట్రీ లోకి వచ్చిన తరువాత ఆ ఛాయలు పడకుండా కొత్త లైఫ్ ను స్టార్ట్ చేశాడట సూర్య.
ఇక ఈ క్రమంలోనే తనంటే ఇష్టపడి.. తన మనసు తెలిసిన హీరోయిన్ జ్యోతికత లవ్ లో పడిపోయాడట సూర్య. ఈసారి ఫ్యామిలీ నుంచి కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా.. వెంటనే పెళ్లి చేసేసుకున్నారట. ప్రస్తుతం ఫ్యామిలీని హ్యాపీగా లీడ్ చేస్తూ.. సంతోషంగా ఉన్నారు. అయితే సూర్య ప్రేమ విషయం ఎంత వరకూ నిజంమో తెలియదు కాని... సోషల్ మీడియాలో మాత్రం బాగా వైరల్ అవుతుంది న్యూస్.