అజిత్ కి ఏమైంది..? అపోలో హాస్పిటల్ లో చేరిన స్టార్ హీరో, ఆందోళనలో అభిమానులు..?
తమిళంతో పాటు.. సౌత్ లో స్టార్ నటుడిగా వెలుగు వెలుగుతున్నాడు తల అజిత్. తాజాగా ఆయన చెన్నైలోని అపోలో హాస్పిటల్ లో చేరినట్టు తెలుస్తోంది. దాంతో ప్యాన్స్ కంగారుపడుతున్నారట.

అజిత్ తమిళ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా వెలుగు వెలుగుతున్నాడు అజిత్ తమిళంతో పాటుగా తెలుగులో కూడా ఆయన స్టార్ గా ఉన్నారు. మంచి మార్కెట్ ను కలిగి ఉన్నారు. ప్రస్తుతం అజిత్ హీరోగా ఆయన 62వ సినిమా రూపొందుతోంది. ఈసినిమాను లైకా సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి మిజిల్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈసినిమాలో అజిత్ జోడీగా త్రిష, ఆరవ్, రెజీనా నటిస్తున్నారు.
Ajith starrer Vidaa Muyarchi film update out
విడశిల సినిమా షూటింగ్ గతేడాది అక్టోబర్‌లో అజర్‌బైజాన్‌లో ప్రారంభమైంది. అక్కడ 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న మూవీ టీమ్.. గత నెలలో చెన్నైకి తిరిగి వచ్చింది. మిగిలిన షూటింగ్‌ని చెన్నైలో పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. విడదవ షూటింగ్ నెల రోజులుగా ప్రారంభం కాలేదు. దీంతో అజిత్ తన ఫ్యామిలీతో టైమ్ ను హ్యాపీగా స్పెండ్ చేస్తున్నారు.
Ajtih starrer Vidaa Muyarchi first look release update out
ఇక విషయానికి వస్తే.. సడెన్ గా అజిత్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు.. అజిత్ హఠాత్తుగా ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. అజిత్ చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలిసి ఆయన అభిమానులు కంగారు పడుతుండగా.. మరో విషయం బయటకు వచ్చింది.
అదేంటంటే.. అజిత్ కు ఏం కాలేదని.. అతని బాడీకి ఎలాంటి ఇబ్బంది లేదని, రొటీన్ చెకప్ కోసం అజిత్ అక్కడికి వెళ్లాడని ప్రాథమిక సమాచారం. పరీక్షల అనంతరం అజిత్ ఒకట్రెండు రోజుల్లో ఇంటికి తిరిగి వస్తాడని అంటున్నారు.కాని సోషల్ మీడియాలో మాత్రం అజిత్ ఆరోగ్యంపై రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి.
aadvik Ajith
రీసెంట్ గా అజిత్ తన కుమారుడు ఆద్విక్ 9వ పుట్టినరోజును తన కుటుంబంతో కలిసి చెన్నైలో జరుపుకున్నాడు. అప్పుడు భార్య షాలిని, కూతురు అనోష్క కూడా అతని వెంట ఉన్నారు. అద్విక్ పుట్టినరోజు వేడుక ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది స్టార్లు విష్ చేశారు కూడా. ఇక అజిత్ ఆరోగ్యంపై ఫ్యామిలీ నుంచి ప్రకటన వస్తేనే అసలు విషయం తెలిసేది.