Vijay Political Entry: ప్రశాంత్ కిషోర్ తో హీరో విజయ్ రహస్య భేటి...? విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఫిక్స్ అయినట్టేనా?
కోలీవుడ్ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్(Vijay) పొలిటికల్ ఎంట్రీకి సిగ్నల్స్ అందుతున్నాయి. వద్దు వద్దు అంటూనే.. విజయ్ పాలిటిక్స్ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తోంది. రీసెంట్ గా ఆయన రాజకీయ ఫ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కలిసారన్న వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్(Vijay) రాజకీయ ఆరంగేట్రం పై చాలా కాలంగా డిస్కర్షన్ నడుస్తోంది. తమిళనాట కోట్లాది ఫ్యాన్స్ ను కలిగిఉన్న స్టార్ హీరో.. తమిళ రాజకీయల్లో చక్రంతిప్పుతారు అన్న టాక్ గట్టిగా వినిపిస్తుంది. ఇప్పటికే ఆయన తండ్రి, దర్శకుడు ఎస్‌ఎం. చంద్రశేఖర్ విజయ్(Vijay) మక్కల్ ఇయక్కం అంటూ రాజకీయ కార్యకలాపాలు మొదలుపెట్టారు కూడా..
పార్టీ పేరును కూడా రిజిష్టర్ చేయించి.. లోకల్ ఎలక్షన్స్ తో పోటీ చేసి మంచి ఫలితాలు సాధించారుకూడా. ఈ విషయంలోనే తండ్రి, కొడుకుల మధ్య విభేదాలు కూడా వచ్చాయి. ఆ పార్టీతో తనకు సంబంధం లేదంటూ.. విజయ్ స్టేట్ మెంట్లు కూడా ఇచ్చాడు.
అయితే విజయ్(Vijay) కి రాజకీయాల్లోకి రావాలన్న కోరిక ఉందని, తన రాజకీయ రంగ ప్రవేశానికి పునాదులు చేసుకుంటున్నారనేది ప్రస్తుతం కోలీవుడ్ లో వినిపిస్తున్న మాట. కాకపోతే ఆయన బయటపడటం లేదని.. లోలోపల కావల్సిన ఏర్పాట్లు చేసుకుంటున్నారంటూ రూమర్స్ గట్టిగా వినిపిస్తున్నాయి.
అంతే కాదు విజయ్ రీసెంట్ గా రాజకీయ హ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను హైదరాబాద్ లో రహస్యంగా కలిశారని.. తన రాజకీయ ఆరంగేట్రం గురించే చర్చ జరిగినట్టు తెలుస్తోంది. దళపతి సీక్రేట్ గా తన పొలిటికల్ ఎంట్రీని ప్లాన్ చేస్తున్నట్టు తమిళనాట వార్తలు గుప్పుమంటున్నాయి. ప్రతీ చోటా ఇదే డిస్కర్షన్ నడుస్తుంది.
విజయ్(Vijay) ఎంత వద్దు అంటున్నా.. ఆ మధ్య పంచాయతీ ఎన్నికల్లో విజయ్ అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 160 వార్డుల్లో పోటీ చేసి 129 వార్డులలో విజయం సాధించారు. ఎన్నికల్లో విజయ్ తన పేరును గానీ, ఫొటోలు గానీ వాడొద్దంటూ విజయ్(Vijay) ఆంక్షలు పెట్టినా.. ఇంటింటికీ తిరిగి విజయ్ అభిమానులు పోటీచేస్తున్నవారిని గెలిపించుకున్నారు. మునిసిపల్ ఎలక్షన్స్ లో కూడా విజయ్ అభిమానులు సత్తా చాటారు. అంతే కాదు ఈ ఎలక్షన్స్ లో పోటీకి చేయడానికి విజయ్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు. గెలిచాక.. ఆ సక్సెస్ ను విజయ్(Vijay) తో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు కూడా. వారంతా విజయ్‌ను కలిసి ఫొటోలు దిగి పండుగ చేసుకున్నారు.అసలు రాజకీయాలు ఇష్టం లేనివాడు అభిమానులను ఇలా ఎలా ఎంకరేజ్ చేశాడంటూ.. రకరకాల మాటలు వినిపించాయి.
రాజకీయాల్లోకి వస్తానని రజనీకాంత్ వెనకడుకు వేయడం విజయ్ కు కలిసోచ్చేలా ఉంది. విజయ్ తమిళనాట మరో రజనీ(Rajanikanth) కాంత్ గా అవతరించాలి అని చూస్తున్నాడు. తన ఇమేజ్ తో రాజకీయాలు శాసించే పథకాలు పన్నుతున్నాడని సమాచారం. ఈ విషయంలో విజయ్ ప్రశాంత్ కిషోర్ సహాయం కూడా తీసుకోబోతున్నట్టు తమిళ రాజకీయల్లో చర్చ నడుస్తుంది.
ప్రస్తుతం తమిళనాట డీఎంకే చాలా స్ట్రాంగ్ గా ఉంది. అన్నాడీఎంకే ఆతరువాత ప్లేస్ లో ఉన్నా.. సరైన నాయకత్వం లేక ఆ పార్టీ ఎప్పుడు కూలుతుందో చెప్పడం కష్టం. ఇటువంటి పరిస్థితుల్లో విజయ్ పార్టీ పెడితే.. అన్నా డీఎంకే నుంచి అటు రజనీ పార్టీలో చేయాలి అనుకున్న వాళ్లు కూడా విజయ్ వెనకాల నడిచే అవకాశం ఉంది అని అంచనా వేస్తున్నారు.
ఇక 2026 ఎన్నికలే లక్ష్యంగా విజయ్(Vijay) పావులు కదుపుతున్నట్టు సమాచారం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మూడో పెద్ద పార్టీగా అవతరించినా చాలు.. ఆతరువాత పరిస్థితులను బట్టి అడుగులు వేయవచ్చు అని విజయ్ టీమ్ భావిస్తున్నారట. అందుకే.. పైకి ఏమీ కనిపించకుండా లోపల రాజకీయ ఆరంగేట్రానికి విజయ్ ఏర్పాట్లు చేసుకుంటన్నట్టు టాక్ గట్టిగా నడుస్తోంది.
మరో వైపు తమిళనాట మరో వాదన కూడా వినిపిస్తుంది. తమిళ స్టార్ హీరో అజిత్ (Ajith)కూడా రాజకీయల్లోకి వస్తాడని.. ఇటు విజయ్.. అటు అజిత్ కు ప్రధాన పోటీ ఉంటుందంటూ వాదనలు వినిపిస్తున్నాయి. అప్పట్లో జయలలిత వారసుడిగా విజయ్ అన్నాడీఎంకే పగ్గాలు అంద కుంటాడు అని ప్రచారం జరిగింది. ఇక ఇప్పుడు వరిద్దరు రాజకీయంగా పోటీ పడతారంటూ ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు ఉన్నాయి.
విజయ్(Vijay) కు తెలియకుండా ఇదంతా జరగదు కదా..? ఈ పరిస్థితులు చూస్తుంటే.. విజయ్ కూడా త్వరలో మనసు మార్చుకుని.. డైరెక్ట్ గా రాజకీయ రంగ ప్రవేశం చేస్తారని తెలుస్తోందిఅయితే ముందు ముందు మంచి రాజకీయ ప్రత్యామ్నాయం కోసం విజయ్ పార్టీతో ముందుకు వస్తాడని ఆశిస్తున్నారు ఫ్యాన్స్. ఆయన నిజంగా పాలిటిక్స్ లోకి వస్తే.. ప్రభంజనం సృస్టించి అధికారంలోకి వస్తారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.