తమన్నా ఫుట్‌వేర్ ఖరీదు వింటే గుండె ఆగిపోతుంది.. బాబోయ్ హైహీల్స్ కే ఇంత రేటా?
మిల్కీ బ్యూటీ ప్యాషన్ కా బాప్ అనిపించిన సందర్భాల్లో చాలానే ఉన్నాయి. గ్లామర్ పరంగానూ తనకు తానే సాటి. ఆడియెన్స్ ఎలా ఆకట్టుకోవాలో ఆమె కొట్టిన పిండి. కానీ ఇప్పుడు మరో విషయంలో అందరి దృష్టిని ఆకర్షించింది. అదేంటో చూస్తే..

మిల్కీ అందాల భామ తమన్నా ప్రస్తుతం తెలుగులో నాలుగైదు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. దీనికితోడు `మాస్టర్‌చెఫ్ తెలుగు` వంటల ప్రోగ్రామ్‌ని హోస్ట్ చేస్తుంది. ఈ వంటల ప్రోగ్రామ్ లో భాగంగా వరుసగా ట్రెండీ వేర్లో సందడి చేస్తుంది తమన్నా.
అందులో భాగంగా ఇటీవల కొత్త ట్రెండీ వేర్‌లో మెరిసింది తమన్నా. టాప్ టూ బాటమ్ బ్లాక్ సూట్‌లో కనిపించి జిగేల్ మనిపించింది. పొడవాటి స్లీవ్ బ్లాక్ రాకీ స్టార్ డ్రెస్‌లో కనువిందు చేసింది. ఓ వైపు ఎయిర్‌పోర్ట్ లో, మరోవైపు హోటల్ రూమ్‌లో ఆమె సందడి చేసింది.
ఈ పిక్స్ ని సోషల్ మీడియా ద్వారా పంచుకుని అందరిని ఆకట్టుకుంది. ఇంటర్నెట్‌లో ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లని హంట్ చేస్తున్నాయి. అయితే ఇందులో తమన్నా వేసుకున్న హై హీల్స్ టాక్ ఆఫ్ ది సోషల్ మీడియా అవుతున్నాయి.
ఇందులో తమన్నా క్రిస్టియన్ లౌబౌటిన్ డబుల్ ఎల్ పంప్ ఫుట్‌వేర్‌ని ఎంచుకుంది. ఇవి ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. అయితే వీటి ఖరీదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. అందరిని ఆశ్చర్యంతోపాటు షాక్‌కి గురి చేస్తుంది.
తమన్నా ధరించిన ఈ లేటెస్ట్ హై హీల్స్ ధర ఏకంగా రూ. 1,38,000. కేవలం ఈ ఫుట్‌వేర్‌కే తమన్నా ఇంతగా ఖర్చు చేస్తుందని తెలిసి ఆమె అభిమానులే కాదు, నెటిజన్లు సైతం షాక్‌కి గురవుతున్నారు. గుండె ఆగిపోయినంత పనైందంటున్నారు.
తమన్నా గ్లామర్ బ్యూటీగా పాపులర్ అయిన తమన్నా స్పెషల్ సాంగ్‌లకు కేరాఫ్‌గా నిలుస్తుంది. మరోవైపు యంగ్ హీరోలకు బెస్ట్ ఆప్షన్‌గా మారారు. సీనియర్లు, యంగ్ హీరోలు ఇలా అందరితోనూ కలిసి నటిస్తుంది తమన్నా.
ప్రస్తుతం ఈ అమ్మడు `సీటీమార్`, `మ్యాస్ట్రో`, `గుర్తుందా శీతాకాలం`, `ఎఫ్3` చిత్రాల్లో నటిస్తుంది. ఈ నాలుగూ నాలుగు విభిన్నమైన జోనర్ చిత్రాలు కావడం విశేషం.