- Home
- Entertainment
- పవన్, ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్, చరణ్‌లపై తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు.. సింపుల్‌గా తేల్చేసిన మిల్కీ బ్యూటీ!
పవన్, ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్, చరణ్‌లపై తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు.. సింపుల్‌గా తేల్చేసిన మిల్కీ బ్యూటీ!
మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం బాగా వార్తల్లో నిలుస్తుంది. ఆమె చిరంజీవితో `భోళాశంకర్` చిత్రం విడుదలవుతుంది. మరోవైపు రజనీకాంత్‌తో `జైలర్` చిత్రం చేసింది. దీంతో వరుసగా ప్రమోషన్స్ లో పాల్గొంటూ రచ్చ చేస్తుంది.

Tamannah Bhatia
తమన్నా.. తాజాగా టాలీవుడ్ టాప్ స్టార్స్ పై స్పందించింది. తన బిగ్ స్టార్స్ గురించి ఓపెన్ అయ్యింది. వారి గురించి సింపుల్‌గా తేల్చేసింది. ఒక్కమాటల్లో వాళ్లేంటో చెప్పేసింది. చిరంజీవి, పవన్, ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్, రామ్‌చరణ్, బన్నీల గురించి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యే మాటలు చెప్పింది. ఆయా హీరోల అభిమానుల మనసు దోచుకుంది.
తాజాగా `భోళాశంకర్` సినిమాకి సంబంధించిన వీడియో ఇంటర్వ్యూని విడుదల చేశారు. కమెడియన్ హైపర్ ఆది.. తమన్నాని ఇంటర్వ్యూ చేశాడు. ఇందులో టాలీవుడ్ టాప్ స్టార్స్ గురించి అడిగాడు ఆది. `మీరు అందరు స్టార్ హీరోలతో వర్క్ చేశారు. స్టార్ హీరోల గురించి ఒక్క మాటల్లో చెప్పాలంటే ఏం చెబుతార`ని తమన్నాని ప్రశ్నించాడు ఆది. ఇందులో మెగాస్టార్ చిరంజీవితోపాటు మిగిలిన టాప్ స్టార్స్ పేరు చెప్పాడు. చిరంజీవి గురించి చెబుతూ, యూనిక్ స్టార్ అని, ఒకే ఒక్క మెగాస్టార్ అని, ఆయన్ని ప్రేమించని వారు ఉండరని తెలిపింది. చిరుని ఆకాశానికి ఎత్తేసింది. చిరుతో `భోళాశంకర్` లో నటించింది తమన్నా. అంతకు ముందు `సైరా నర్సింహారెడ్డి`లోనూ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. నటనకు స్కోప్ ఉన్న రోల్ చేసి అదరగొట్టింది. విశ్వరూపం చూపించింది.
ఇక పవర్ స్టార్ గురించి చెబుతూ, వెరీ మాస్, అండ్ చాలా స్టయిలీష్ పర్సన్ అని వెల్లడించింది. పవన్‌తో తమన్నా.. `కెమెరామెన్ గంగాతో రాంబాబు` చిత్రంలో నటించింది. ప్రభాస్ గురించి చెబుతూ, ప్రతి ఒక్కరి డార్లింగ్ అని సింపుల్‌గా చెప్పేసింది. ప్రభాస్‌తో `రెబల్`, `బాహుబలి` సినిమాలు చేసింది తమన్నా.
మహేష్‌బాబు గురించి చెబుతూ, `గుడ్ లుకింగ్, గ్లామరస్ హీరో అని వెల్లడించింది. మహేష్‌బాబుతో తమన్నా.. `ఆగడు` సినిమాలో నటించింది. ఇది పెద్దగా వర్కౌట్ కాలేదు. ఎన్టీఆర్ గురించి చెబుతూ, ఆల్ రౌండర్ అని, ఆయన బాగా నటిస్తాడని, బాగా డాన్సు చేస్తాడని, ఫైట్స్, ఇలా అన్ని చేస్తాడని పేర్కొంది. తారక్‌తో `ఊసరవెల్లి` చిత్రంలో నటించింది తమన్నా.
ఇక అల్లు అర్జున్ గురించి చెబుతూ, స్టయిలీష్ స్టార్, గుడ్ డాన్సర్. తెలుగులోనే కాదు, ఇండియా వైడ్‌గా ఆయన డాన్సుని గుర్తిస్తుంది. బన్నీతో `బద్రినాథ్` చిత్రం చేసింది మిల్కీ బ్యూటీ. రామ్‌చరణ్ గురించి చెబుతూ, రామ్‌చరణ్ ఎప్పుడూ లాయల్ పర్సన్. ఆయన్ని ఎప్పుడు కలిసినా చాలా లాయల్‌గా ఉంటారని, ఇండస్ట్రీలో అత్యంత లాయర్ పర్సన్ అంటే ఆయనే. రామ్‌చరణ్‌తో `రచ్చ` సినిమాలో నటించింది తమన్నా. ఇలా టాప్ స్టార్స్ గురించి ఒక్కమాటలో షార్ట్ అండ్ స్వీట్‌గా చెప్పి ఆశ్చర్యపరిచింది. ఫ్యాన్స్ ని ఫిదా చేసింది.
ఇక ప్రస్తుతం మిల్కీ బ్యూటీ సీనియర్ హీరోలకు కేరాఫ్‌గా నిలుస్తుంది. ఆమె చిరంజీవితో `భోళాశంకర్`, రజనీకాంత్‌తో `జైలర్`, అలాగే మలయాళంలో దిలీప్ కుమార్‌తో `బాంద్రా` చిత్రాలు చేస్తుంది. యంగ్ హీరోలు కుర్ర భామలపై మోజు పడుతున్న నేపథ్యంలో సీనియర్ హీరోయిన్లంతా సీనియర్ హీరోలకు ఫిక్స్ అవుతున్నారు. లేదంటే లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తున్నారు. అలా కెరీర్‌ని లాక్కొస్తున్నారు. తమన్నా కూడా ఇప్పుడే అదే సిచ్చ్యూవేషన్‌లో ఉంది. ప్రస్తుతం ఆమె నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉంది. వీలైనంత త్వరలోనే పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిల్ అయిపోవాలని ప్లాన్ చేసుకుంటున్నట్టు సమాచారం.