MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • Entertainment
  • Odela 2 Movie Review : తమన్నా 'ఓదెల 2' మూవీ రివ్యూ, రేటింగ్

Odela 2 Movie Review : తమన్నా 'ఓదెల 2' మూవీ రివ్యూ, రేటింగ్

రచ్చ, బెంగాల్ టైగర్, సీటిమార్ చిత్రాల తర్వాత నాలుగోసారి తమన్నా, డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్ లో రూపొందిన చిత్రం ఓదెల 2. అశోక్ తేజ దర్శకత్వంలో ఓదెల 2 చిత్రం తెరకెక్కింది. దర్శకత్వం ఒక్కటి తప్ప మిగిలిన అన్ని అంశాల్లో సంపత్ నంది వెనుక ఉండి ఈ చిత్రాన్ని నడిపించారు. 

4 Min read
Author : Tirumala Dornala
Published : Apr 17 2025, 01:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Odela 2 Review

Odela 2 Review

రచ్చ, బెంగాల్ టైగర్, సీటిమార్ చిత్రాల తర్వాత నాలుగోసారి తమన్నా, డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్ లో రూపొందిన చిత్రం ఓదెల 2. అశోక్ తేజ దర్శకత్వంలో ఓదెల 2 చిత్రం తెరకెక్కింది. దర్శకత్వం ఒక్కటి తప్ప మిగిలిన అన్ని అంశాల్లో సంపత్ నంది వెనుక ఉండి ఈ చిత్రాన్ని నడిపించారు. కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన సంపత్ నంది దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేశారు. జోరుగా నిర్వహించిన ప్రచార కార్యక్రమాలతో ఓదెల 2 చిత్రంపై మంచి బజ్ ఏర్పడింది. 

ఎప్పుడూ గ్లామర్ పాత్రల్లో కనిపించే తమన్నా ఈ చిత్రంలో నాగ సాధువు శివశక్తిగా నటించడం ఆసక్తికర విషయం. ఈ పాత్రలో తమన్నా ఎలా నటించింది అనే ఉత్కంఠ అందరిలో ఉంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంది. కాగా నేడు గురువారం ఏప్రిల్ 17న ఈ చిత్రం విడుదలయింది. తమన్నా శివశక్తిగా ఎలా నటించింది ? ఓదెల 2 చిత్రం ఆకట్టుకునే విధంగా ఉందా ? అనే విషయాలు రివ్యూలో తెలుసుకుందాం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Odela 2 Movie Review

Odela 2 Movie Review

కథ :

2022లో వచ్చిన ఓదెల రైల్వే స్టేషన్ చిత్రం ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచి ఓదెల 2 చిత్రాన్ని ప్రారంభించారు. ఆ చిత్రానికి కనెక్ట్ అయ్యేలా సంపత్ నంది కథ రాసుకున్నారు. ఓదెల మొదటి భాగంలో మరణించిన తిరుపతి (వశిష్ఠ) ఈ చిత్రంలో ప్రేతాత్మగా మారతాడు. తిరుపతి ఆత్మకు మోక్షం కలుగకూడదు అనే ఉద్దేశంతో ఓదెల గ్రామస్తులంతా అతడికి సమాధి శిక్ష విధిస్తారు. దీనితో తిరుపతి ఆత్మ ఓదెల గ్రామ ప్రజలపై పగ పెంచుకుంటుంది. ఆ విధంగా తిరుపతి ఆత్మ ప్రేతాత్మగా పురుడు పోసుకుంటుంది. 

తాను అనుకున్న విధంగా ఓదెల గ్రామంపై పగ తీర్చుకోవడం తిరుపతి ప్రేత్మాత్మ తన పని ప్రారంభిస్తుంది. ఆ ఊరిలోని అమ్మాయిలు ఒక్కొకరుగా మరణిస్తుంటారు. అసలు తిరుపతి ప్రేతాత్మగా మారడానికి ఏం చేశాడు ? ప్రేతాత్మగా మారిన తర్వాత అమ్మాయిలని ఎలా చంపాడు ? ఓదెల గ్రామ ప్రజలని రక్షించేందుకు నాగ సాధువు శివశక్తి (తమన్నా) ఎందుకు వచ్చింది ? అనేది కథలో ఆసక్తికరం. ఆత్మ, ప్రేతాత్మ మధ్య పోరాటం ఎలా సాగింది.. తిరుపతి ప్రేత్మాత్మని బంధించడానికి శివశక్తి తమన్నా ఏం చేసింది ? ఇలాంటి అంశాలు వెండితెరపైనే చూడాలి. 

37
Odela 2 Movie Review

Odela 2 Movie Review

విశ్లేషణ :

ఓదెల 2 చిత్ర టీజర్స్, ట్రైలర్స్ చూసినప్పుడే కథపై అందరికీ క్లారిటీ వచ్చేసి ఉంటుంది. ఈ చిత్రం ఒక ప్రేత్మాత్మని అంతం చేయడానికి జరిగే పోరాటంతో ఉంటుంది అని క్లారిటీ వచ్చింది. ఈ కథని సంపత్ నంది వైవిధ్యంగా రాసుకున్నారా లేక గతంలో చూసిన సూపర్ నేచురల్ హర్రర్ చిత్రాల తరహాలోనే ఉంటుందా అనేది కీలకం. సినిమా ఎంత వైద్యంగా ఉంది.. ఆడియన్స్ ని ఎలా ఎంగేజ్ చేసింది అనే అంశాలపైనే సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ఓదెల చిత్రం ముగిసిన చోటి నుంచే ఓదెల 2 కథని ప్రారంభించారు. 

ఈ రెండు చిత్రాలని కనెక్ట్ చేసే పాయింట్ ఆసక్తికరంగా ఉంటుంది. ఆ విషయంలో కథ, స్క్రీన్ ప్లే అందించిన సంపత్ నంది, దర్శకుడు అశోక్ తేజ సక్సెస్ అయ్యారు. ఓదెల చిత్రం అనేది నార్మల్ క్రైమ్ డ్రామా. ఆ చిత్ర ఎండింగ్ పాయింట్ కి హారర్, సూపర్ నేచురల్ అంశాలు జోడించి భారీగా తెరకెక్కించే ప్రయత్నం ఓదెల 2 తో చేశారు. 

47
Odela 2 Movie Review

Odela 2 Movie Review

ఫస్ట్ హాఫ్ లో అమ్మాయిల హత్యల సన్నివేశాలతో ఆసక్తి పెంచారు. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఉత్కంఠ ఉంటుంది. ఇంటర్వెల్ ముందు సన్నివేశంలోనే తమన్నా ఎంట్రీ ఉంటుంది. ఆమె ఎంట్రీ సీన్ ని హైలైట్ చేయడం కోసం అప్పటి వరకు కథని సాగదీస్తూ వెళ్లారు. రొటీన్ గా నడిపించారు. తమన్నాని నాగ సాధువుగా చూపించడం ఆకట్టుకుంటుంది. 

తమన్నా ఎంట్రీ తర్వాత మళ్ళీ కథ రొటీన్ గా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో అక్కడక్కడా గూస్ బంప్స్ మూమెంట్స్ అందించారు. క్లైమాక్స్ సన్నివేశాలు చాలా బాగుంటాయి. టెక్నికల్ గా కూడా బ్రిలియంట్ వర్క్ అని చెప్పవచ్చు. అయితే కథలోనూ, తమన్నా పాత్రలోనూ అరుంధతి చిత్రంతో పాటు మరికొన్ని చిత్రాల ఛాయలు కనిపిస్తాయి. 

ఫస్ట్ హాఫ్ ముగిశాక కథ ఎటు వెళుతుంది అనేది ఆడియన్స్ కి క్లారిటీ వచ్చేస్తుంది. అలాంటప్పుడు చూసే సన్నివేశాలు ఆడియన్స్ ఊహలకు తగ్గట్లుగా ఉంటే రొటీన్ అయిపోతుంది. కథని ప్రేక్షకులు ఊహించినప్పటికీ నడిపించిన విధానం, ట్రీట్మెంట్ తో సర్ప్రైజ్ చేస్తే థ్రిల్ అవుతారు. ఓదెల 2 చిత్రంలో అది మిస్ అయింది. 

57
Odela 2 Movie Review

Odela 2 Movie Review

నటీనటులు :

తమన్నాకి గ్లామర్ ఇమేజ్ ఎక్కువ. యువత కూడా ఆమె నుంచి గ్లామర్ రోల్స్ కోరుకుంటారు. అలా తన ఇమేజ్ కి వ్యతిరేకంగా ఛాలెంజ్ ఉన్న ఇలాంటి పాత్రలు కూడా చేయగలనని తమన్నా నిరూపించుకునే ప్రయత్నం చేసింది. ఒక్క డైలాగ్స్ విషయంలో తప్ప మిగిలిన అన్ని అంశాల్లో తమన్నా విజయం సాధించింది అని చెప్పొచ్చు. ఇలాంటి పాత్రల్లో డైలాగ్స్ కి గంభీరత్వం అవసరం. అది తమన్నాలో కనిపించలేదు. 

ఇక విలన్ గా నటించిన వశిష్ఠ ఎన్ సింహా స్క్రీన్ ప్రెజన్స్ చాలా బాగుంది. ప్రేతాత్మ పాత్రకి కావలసిన ఆహార్యాన్ని అతడు ప్రదర్శించగలిగాడు. మురళి శర్మ, హెబ్బా పటేల్ కూడా బాగానే నటించారు. శ్రీధర్ రెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్ లాంటి నటులు కూడా తమ పాత్ర మేరకు ఆకట్టుకున్నారు. 

67
Odela 2 Movie Review

Odela 2 Movie Review

టెక్నీషియన్లు :

కాంతార, విరూపాక్ష, మంగళవారం లాంటి చిత్రాలకు వర్క్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ అంజనీష్ లోకనాథ్ మరోసారి ఓదెల 2 తో సత్తా చాటారు. చాలా సన్నివేశాల్లో అంజనీష్ ఇచ్చిన బిజియం హైలైట్ గా నిలిచింది. గూస్ బంప్స్ తెప్పించే సన్నివేశాలకు అవసరమైన విధంగా అంజనీష్ బ్యాగ్రౌడ్ స్కోర్ ఇచ్చారు. సౌందరరాజన్ సినిమాటోగ్రఫీ కూడా బావుంది. మంచి విజువల్స్ రాబట్టారాయన. 

ఇక దర్శకుడు అశోక్ తేజ, కథ స్క్రీన్ ప్లే అందించిన సంపత్ నంది విషయానికి వస్తే.. సంపత్ నంది గతంలో కమర్షియల్ డైరెక్టర్ గా నిరూపించుకున్నారు. సన్నివేశాలు రొటీన్ గా ఉన్నా ఆడియన్స్ ని ఎలా ఎంటర్టైన్ చేయాలో తెలుసు. అందుకే కొన్ని సన్నివేశాలు ఓదెల 2 లో చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అయితే సంపత్ నంది కథని మాత్రం అరుంధతి లాంటి చిత్రాలని రిఫరెన్స్ గా తీసుకుని రాసుకున్నట్లు అనిపిస్తుంది. 

డైలాగులు కొన్ని అతిగా అనిపిస్తాయి. ఇక దర్శకుడు అశోక్ తేజ కథకి తగ్గట్లుగానే వర్క్ చేశారు అని అర్థం అవుతోంది. విజువల్ ఎఫెక్ట్స్ కూడా కొన్ని చోట్ల ఓవర్ గా అనిపిస్తాయి. 

77
Odela 2 Movie Review

Odela 2 Movie Review

ఫైనల్‌గా : తమన్నా తన ఇమేజ్ కి భిన్నంగా నటించిన ఓదెల 2 చిత్రం గొప్పగా లేదు కానీ డిజప్పాయింట్ చేయదు 

రేటింగ్ : 2.75/5

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
సినిమా సమీక్షలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic 5 Days Collections: విజయ్ సినిమా రికార్డు బ్రేక్ చేసిన యశ్‌.. 'టాక్సిక్' కలెక్షన్ల సునామీ
Recommended image2
Samantha Baby Bump: జిమ్‌లో బేబీ బంప్‌తో సమంత అదిరిపోయే పోజులు.. బేబీ పేరు సజెస్ట్ చేసిన అభిమానికి కౌంటర్
Recommended image3
Bigg Boss10: బిగ్ బాస్ 10లో హైయెస్ట్ రెమ్యునరేషన్ ఈమెకేనా ? సినిమాల్లో ఫ్లాప్, సోషల్ మీడియాలో సూపర్ క్రేజ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved