మిల్కీ బ్యూటీ గ్రీన్ డ్రెస్ భలే వెరైటీగా ఉందే.. లేటెస్ట్ ఫోటోస్ వైరల్
హ్యాపీడేస్ చిత్రంతో తమన్నాకి టాలీవుడ్ లో పాపులారిటీ పెరిగింది. ఆ తర్వాత తమన్నా వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

టాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్లు నటన పరంగా గుర్తింపు తెచ్చుకుని ఉండొచ్చు. గత దశాబ్దం కాలంలో గ్లామర్, డాన్స్ పరంగా యువతలో తమన్నాకి వచ్చినంత క్రేజ్ మరే హీరోయిన్ కి దక్కలేదు.
అందుకే ఫ్యాన్స్ తమన్నాని ముద్దుగా మిల్కీ బ్యూటీ అని పిలుస్తుంటారు. హ్యాపీడేస్ చిత్రంతో తమన్నాకి టాలీవుడ్ లో పాపులారిటీ పెరిగింది. ఆ తర్వాత తమన్నా వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
తెలుగులో దాదాపుగా స్టార్స్ అందరితో తమన్నా ఆడి పాడింది. ప్రభాస్, పవన్, మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాంచరణ్ ఇలా క్రేజీ హీరోలందరితో మిల్కీ బ్యూటీ నటించింది.
సినిమాకు అవసరమైన మేరకు తమన్నా అందంతో మెప్పిస్తూనే వచ్చింది. రచ్చ, 100 పర్సెంట్ లవ్, బాహుబలి లాంటి చిత్రాలతో తమన్నా యూత్ క్రష్ గా మారిపోయింది.
తమన్నా టాలీవుడ్ లో ఫ్యాషన్ ఐకాన్. సోషల్ మీడియాలో డిఫెరెంట్ డిజైనర్ డ్రెస్సుల్లో ఫోటో షూట్స్ చేస్తూ అలరిస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు ట్రెండీ లుక్ లో నెటిజన్లని సర్ ప్రైజ్ చేస్తూనే ఉంది.
తాజాగా తమన్నా మరోసారి గ్లామర్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. గ్రీన్ కలర్ వెరైటీ డ్రెస్ లో తమన్నా ఎంతో అందంగా కనిపిస్తోంది. ఈ ఫోటోలకు తమన్నా గ్రీన్ ఫ్లాగ్ ఎనేర్జి అని కామెంట్ పెట్టింది.
ప్రస్తుతం తమన్నా ప్రేమ వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. నాని ఎంసీఏ చిత్రంలో విలన్ గా నటించిన హిందీ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. విజయ్ వర్మతో లవ్ లో ఉన్నట్లు తమన్నా ఓపెన్ గానే చెప్పింది.