- Home
- Entertainment
- Tamannaah: మైండ్ బ్లాక్ చేస్తున్న మిల్కీ బ్యూటీ బిగుతైన అందాలు.. తమన్నా ఒంపుల వయ్యారాలు అదరహో
Tamannaah: మైండ్ బ్లాక్ చేస్తున్న మిల్కీ బ్యూటీ బిగుతైన అందాలు.. తమన్నా ఒంపుల వయ్యారాలు అదరహో
టాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్లు నటన పరంగా గుర్తింపు తెచ్చుకుని ఉండొచ్చు. గత దశాబ్దం కాలంలో గ్లామర్ డాన్స్ పరంగా కుర్రాళ్లల్లో తమన్నాకి వచ్చినంత క్రేజ్ మరే హీరోయిన్ కి దక్కలేదు.

టాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్లు నటన పరంగా గుర్తింపు తెచ్చుకుని ఉండొచ్చు. గత దశాబ్దం కాలంలో గ్లామర్ డాన్స్ పరంగా కుర్రాళ్లల్లో తమన్నాకి వచ్చినంత క్రేజ్ మరే హీరోయిన్ కి దక్కలేదు. టాలీవుడ్ వెండితెరని తన గ్లామర్ తో తమన్నా ఒక ఊపు ఊపింది. మిల్కీ అందాలతో తమన్నా సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తే మైమరచిపోయే అభిమానులు ఉన్నారు.
తెలుగులో దాదాపుగా స్టార్స్ అందరితో Tamannaah ఆడి పాడింది. ప్రభాస్, పవన్, మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాంచరణ్ ఇలా క్రేజీ హీరోలందరితో మిల్కీ బ్యూటీ నటించింది. హ్యాపీ డేస్ చిత్రంతో తమన్నాకి క్రేజ్ మొదలయింది. సినిమాకు అవసరమైన మేరకు తమన్నా అందంతో మెప్పిస్తూనే వచ్చింది. రచ్చ లాంటి చిత్రాల్లో తమన్నా తన గ్లామర్ తో కుర్రాళ్ల కలల రాణిలా మారిపోయింది.
తమన్నా టాలీవుడ్ లో ఫ్యాషన్ ఐకాన్. సోషల్ మీడియాలో డిఫెరెంట్ డిజైనర్ డ్రెస్సుల్లో ఫోటో షూట్స్ చేస్తూ అలరిస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు ట్రెండీ లుక్ లో నెటిజన్లని సర్ ప్రైజ్ చేస్తూనే ఉంది. తాజాగా తమన్నా చేసిన ఫోటో షూట్ చెదిరేలా ఉంది. స్టైలిష్ గా కనిపిస్తూనే తమన్నా హాట్ లుక్ తో ఆకర్షిస్తోంది.
బ్లాక్ డ్రెస్ లో ఆమె అందాలు అదుర్స్ అనిపిస్తున్నాయి. మిల్కీ బ్యూటీ అందాలకు నెటిజన్లు ఫిదా వుతున్నారు. తమన్నా ఇస్తున్న ఒక్కో ఫోజు చూపు తిప్పుకోలేని విధంగా ఉంది. కళ్ళల్లో మత్తు, పెదవుల్లో హాట్ నెస్ కి కుర్రాళ్లు చిత్తై పోతున్నారు.
ఎఫ్ 3 ప్రమోషన్స్ మొదలైన సందర్భంగా తమన్నా ఈ ఫోటో షూట్ లో మెరిసింది. ఎంత మంది కుర్ర హీరోయిన్లు వచ్చినా తన అందం ముందు దిగదుడుపే. ఎఫ్ 3 చిత్రం మే 27న రిలీజ్ కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.
ఏది ఏమైనా తమన్నా ఫోటోస్ నెటిజన్లని ఆకట్టుకుంటూ వైరల్ గా మారాయి. తమన్నా ప్రస్తుతం మెగాస్టార్ Chiranjeevi భోళా శంకర్ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.