- Home
- Entertainment
- Tamannaah Bhatia : 12 ఏళ్లకు తమన్నాతో సంపత్ నంది ప్రాజెక్ట్.. ‘ఓదెల 2’లో మిల్క్ బ్యూటీ.. డిటేల్స్
Tamannaah Bhatia : 12 ఏళ్లకు తమన్నాతో సంపత్ నంది ప్రాజెక్ట్.. ‘ఓదెల 2’లో మిల్క్ బ్యూటీ.. డిటేల్స్
మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా (Tamannaah Bhatia) తెలుగులో క్రేజీ సీక్వెల్ కు ఓకే చెప్పింది. దర్శకుడు సంపత్ నందితో కలిసి 12 ఏళ్ల తర్వాత స్టార్ హీరోయిన్ కలిసి పనిచేస్తుండటం ఆసక్తికరంగా మారింది. సంబంధిత వివరాలు ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి.

స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్స్ ల్లో నటిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ మొన్నటి వరకు బాలీవుడ్ లోనే చేసిన సిరీస్ లతో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో చూశాం.
ఇక తెలుగులో చివరిగా మెగాస్టార్ చిరంజీవి సరసన ‘భోళా శంకర్’లో నటించింది. అలాగే కోలీవుడ్ లో రజినీకాంత్ ‘జైలర్’లో స్పెషల్ అపీయరెన్స్ ఇచ్చి ఆకట్టుకుంది. తాజాగా తెలుగులో క్రేజీ సీక్వెల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ప్రముఖ దర్శకుడు సంపత్ నంది (Sampath Nandi) రైటర్ గా వచ్చిన ‘ఓదెల రైల్వే స్టేషన్’ (Odela Railway Station) ఓటీటీలో విడుదలై హిట్ అయిన విషయం తెలిసిందే. అప్పుడు హేబా పటేల్ (Hebah Patel) ప్రధాన పాత్రలో నటించి మెప్పించింది.
ఇప్పుడు ఆ క్రైమ్ థ్రిల్లర్ కు సంపత్ నంది సీక్వెల్ ను ప్రకటించారు. ‘ఓదెల 2’ Odela 2 అంటూ టైటిల్ పోస్టర్ కూడా రివీల్ చేశారు. సంపత్ నంది ఈ సీక్వెల్ ను నిర్మిస్తున్నారు. ఈరోజు మూవీ కాశీలో గ్రాండ్ గా ఓపెనింగ్ అయ్యింది.
సంపత్ నంది క్లాప్ కొట్టి సినిమా షూటింగ్ ను ప్రారంభించారు. ఓదెల మల్లన్న ఆశీస్సులతో సీక్వెల్ ను ప్రారంభించినట్టు తెలిపారు. ఇక తమన్నా మాత్రం ఊహించని విధంగా తెలుగులో ఈ క్రేజీ సీక్వెల్ లో నటిస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారింది.
సంపత్ నంది - తమన్నా కాంబోలో ‘రచ్చ’ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. రామ్ చరణ్ కు హిట్ ఇచ్చిన దర్శకుడు... ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ తో ‘గాంజా శంకర్’ సినిమాను తెరకెక్కిస్తున్నారు.