హోలీ రంగుల్లో మిల్క్ బ్యూటీ మెరుపులు... గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్న తమన్నా..
హోళీ పండుగను సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా గ్రాండ్ గా సెలబ్రీట్ చేసున్నారు. కొంత మంది స్టార్లు మాత్రం ఈ పండగకు దూరంగా ఉంటారు. హీరోయిన్లలో కూడా హెళీ పండగకు మంచి క్రేజ్ ఉంది. ఇక అందులో మిల్క్ బ్యూటీ తమన్నా మాత్రం పండుగను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది.

రంగుల మధ్య మునిగితేలడం కోసం ఫుల్ వైట్ డ్రస్ లో మెరిసిసోయింది హీరోయిన్ తమన్నా. వైట్ చుడీదార్ లో.. రెడ్ చున్నీతో .. మిల్క్ బ్యూటీ ఏంజల్ లా మెరిసిపోయింది. అందమైన రంగుల ప్రపంచంలో.. పాలవన్నెల సొగసులతో అద్భుతంగా మెరిసిపోతుంది తమన్నా.
ఇక మిల్క్ బ్యూటీ.. పాలుగారే బుగ్గల మీద.. రంగులు రేఖలు మిలమిలా మెరుస్తూ కనిపించాయి. హోళీ సంబరం అంతా తన ముఖంలో ప్రకాశంచే విధంగా..నవ్వులు పూయిస్తూ.. సందడి చేసింది తమన్నా.
తమన్నా హోళీ సెలబ్రేషన్ ఫోటోలు తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది తమన్నా. ఈ పోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు తమన్నాను చూసి ముచ్చటపడుతున్నారు. ఇంత అందాంగా ఉన్నావంటూ పాటలు పాడుకుంటున్నారు.
వంటిమీద తెల్లటి బట్టలు.. మెడలో ఎర్రటిచున్నీ.. చేతిలో హోళీ రంగు.. ముఖంపై చిరునవ్వు.. హోళీ సంబరమంతా తనలోకనిపించేలా ఫుల్ గా ఎంజాయ్ చేసింది తమన్నా. తమన్నా ఫోటోలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
ప్రస్తుతం టాలీవుడ్ నుంచి భోళా శంకర్ సినిమాలో మెగాస్టార్ జోడీగా నటిస్తోంది తమన్నా. అటుబాలీవుడ్ లో.. మరో వైపు తమిళ్ లో కూడా కొన్ని సినిమాలు చేస్తుంది బ్యూటీ. హీరోయిన్ గా అవకాశాలు తగ్గిన తరువాత విమెన్ ఓరియెంటెడ్ సినిమాలపై మనసు పారేసుకుంది.
ఇక ఈసినిమాలతో పాటు సోషల్ మీడియాలో మాత్రం ఏమాత్రం గ్యాప్ లేకుండా సందడి చేస్తుంది తమన్నా. ఎక్కడా తగ్గడంలేదు మిల్క్ బ్యూటీ. పరువాలు పరుస్తూ.. సొగసులతో గిలిగింతలు పెడుతూ.. కుర్రకారును ఉర్రూతలూగిస్తుంది బ్యూటీ.