ఆమెతో ఆ సీన్లు చేయడానికి ఇబ్బందిపడ్దాను, తమన్నా ప్రియుడు విజయ్ వర్మ కామెంట్స్..
బాలీవుడ్ నటుడు, తమన్నా ప్రియుడు విజయ్ వర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. బాలీవుడ్ స్టార్ సీనియర్ హీరోయిన్ కరీనా కపూర్ గురించి ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఈమధ్య ఎంత పెద్ద స్టార్లు అయినా.. ఎంత చిన్న ఆర్టిస్ట్ లు అయినా.. ఒక్క సినిమాను మాత్రమే నమ్ముకుని ఉండటంలేదు. మల్టీ టాలెంట్ చూపిస్తూ.. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా చేసుకుంటున్నారు. ఇతర కార్యక్రమాల ద్వారా కూడా పంపాదించుకుంటున్నారు. రోజు రోజుకు ఓటీటీల విస్తృతి పెరుగుతున్న నేపథ్యంలో కరీనా కపూర్ లాంటి స్టార్స్ కూడా వెబ్ సిరీస్‌లు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
ఇక అనుకున్నట్టుగానే తాజాగా ఓ వెబ్ సిరీస్ తో ఆడియన్స్ ముందుకు రాబోతోంది బాలీవుడ్ సీనియర్ బ్యూటీ కరీనా కపూర్. జానే జాన్ పేరుతో ఈ వెబ్ సిరీస్ రూపొందింది. నెట్ ఫ్లిక్స్ వేదికగా ఈ వెబ్ సిరీస్ త్వరలో స్ట్రీమింగ్ కు రానుంది. క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో రూపొందుతున్న ఈ సిరీస్ కు సుజయ్ ఘోష్ దర్శకత్వం వహించారు.
కరీనా కపూర్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సిరీస్ లో, బాలీవుడ్ నటుడు, తమన్నా ప్రియుడు విజయ్ వర్మ, జైదీప్ అహ్లావత్ కీలక పాత్రలను పోషించారు. ఇక ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో టీమ్ బిజీ బిజీగా ఉన్నారు. వరుసగా ఈవెంట్లు.. వరుసగా ఇంటర్వ్యూలతో ఖాళీ లేకుండా గడిపేస్తున్నారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా చిత్రబృందం ఇంటర్వ్యూలో పాల్గొంది.
Image: Vijay Varma / Instagram
ఈ సందర్భంగా నటుడు విజయ్ వర్మ కరీనా కపూర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమెను ఓ అద్భుత నటిగా అభివర్ణించారు. ఆమె మంచి మనసు కలిగిన వ్యక్తి అన్నారు. ఈ సందర్భంగా ఒకప్పుడు తాము కరీనా సినిమాలు చూసి ఎలా ఎంజాయ్ చేసేదో చెప్పుకొచ్చారు.
మేము ఆమె సినిమాలు చూస్తూ విజిల్స్ కొట్టే వాళ్లం. ఆమెను అభిమాన హీరోయిన్ గా భావించేవాళ్లం. ఇప్పుడు ఆమెతో కలిసి నటించడం సంతోషంగా ఉందిఅన్నారు. ఇక రొమాంటిక్ సన్నివేశాల్లో తనతో కలిసి నటించడం చాలా భయం కలిగించిందన్నారు. ఆమెతో కలిసి శృంగార సన్నివేశాలు చేసే సమయంలో తన శరీరంలో వణుకు పుట్టేదన్నారు. “ఆమె అద్భుతంగా నటించగలదు. ఆమె ఎంత అందంగా ఉంటుందో, అంతకు మించి ప్రశాంతంగా ఉంటుంది అని విజయ్ వర్మ కామెంట్స్ చేశారు.
ఇక ప్రస్తుతం తమన్నాదో డేటింగ్ లో ఉన్నారు విజయ్ వర్మ. వీరిద్దరు చెట్టా పట్టాలు వేసుకుని తిరుగుతున్నారు. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే వీరి బంధం డేటింగ్ వరకే అని మరో వాధన కూడా వినిపిస్తోంది.