దివ్యభారతి పాత్రలో తమన్నా..? బయోపిక్ మూవీలో మిల్క్ బ్యూటీ..
హీరోయిన్ గా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన తమన్నాభాటియా.. ప్రస్తుతం జోరు తగ్గించింది. తాజాగా తమన్నా బయోపిక్ మూవీలో నటించబోతున్నట్టు తెలుస్తోంది. అది కూడా దివ్య భారతి పాత్రలో.. నిజమెంత...?
ఏజ్ బార్ అవుతున్నా.. హీరోయిన్ గా అవకాశాలు సాధిస్తూనే ఉంది తమన్నా భాటియా.. దాదాపుగా 15 ఏళ్ళకు పైగా హీరోయిన్ గా టాలీవుడ్ ను ఏలిన తమన్నా.. చిన్నగా అవకాశాలు తగ్గుతూ రావడంతో.. స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా మెరుస్తూఉంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సరసన భోళా శంకర్ మూవీలో నటించిన తమన్నా.. రజనీకాంత్ తో జైలర్ లో కూడా సందడి చేసింది.
మూడు పదులు దాటి.. వయస్సు పరుగులు పెడుతున్నా.. ఏమాత్రం వన్నెతగ్గని వయ్యారాలతో సందడి చేస్తోంది బ్యూటీ. వరుస సినిమాలు చేస్తూ.. కుర్ర కారుకు కిర్రెక్కించేలా.. సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ.. మెరుపులు మెరిపిస్తోంది తమన్నా. ఇక తాజాగా తమన్నాకు సబంధించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది.
దివ్య భారతి.. చాలా తక్కువ టైమ్ లో హీరోయిన్ గా స్టార్ డమ్ సంపాధించింది. మూడే మూడు సంవత్సరాలలో స్టార్ హీరోల సరసన 20 సినిమాలకు పైగా నటించింది. బ్యూటీ క్వీన్ గా ఎదిగింది. స్టార్ హీరోయిన్ల గుండెల్లో గుబులు పుట్టించింది. అలా ఎదుగుతున్న టైమ్ లోనే దివ్యభారతి హఠాత్మరణం ఇండస్ట్రీ ఉలిక్కిపడేలా చేసింది.
చాలా తక్కువ టైమ్ లో ఎక్కువ సినిమాలు చేసింది దివ్య భారతి. 90వ దశకంలో దివ్య భారతి అంటే ఓ ఎమోషన్. ఆ రోజుల్లో కుర్రాళ్లకు ఆమె ఆరాధ్య దేవత.ఆమె అందానికి నటనకు అన్నిభాషల్లో స్టార్ మేకర్స్ ఫిదా అయ్యారు స్టార్ హీరోలు కూడా దివ్య భారతి డేట్స్ కోసం పోటీ పడ్డారు.ఇంత తక్కువ టైమ్ లో అంత ఇమేజ్ రావడంతో దివ్య భారతిని చూసి కుళ్ళుకున్నారు అప్పటిస్టార్ హీరోయిన్లు. ఇంతలోనే ఆమె మరణం సినీ ప్రేమికులకు పెద్ద షాక్ ఇచ్చింది.
దివ్య భారతి మరణం ఎలా జరిగింది..? ఇప్పటివాళ్లకు ఆమె చనిపోయింది అని తెలుసు కానీ.. ఆమె ఎలా చనిపోయింది అనే విషయం మాత్రం తెలియకపోవచ్చు. అయితే నిన్నటి తరం ప్రేక్షకులు, సినీ అభిమానులకు మాత్రం ఆమె మరణంపై చాలా రకాల అనుమానాలు ఉన్నాయి. దావడం నార్త్ నుంచి వచ్చినా.. తెలుగులో ఆమె కెరీర్ స్టార్ట్ అయ్యింది. ఇక్కడే ఆమె స్టార్ హీరోయిన్ అనిపించుకుంది.
ఇక టాలీవుడ్ లో ఓఊపు ఊపేస్తున్న టైమ్ లోనే బాలీవుడ్ వెళ్లి అక్కడ కూడా స్టార్ హీరోయిన్ అనిపించకుంది దివ్య భారతి. అయితే అనూహ్య పరిస్థితుల్లో ఆమె చనిపోయింది. దీని మీద చాలా రకాల వాదనలు ఉన్నాయి. ఈక్రమంలో దివ్యభారతి బయోపిక్ మూవీ గురించి ఇప్పటి వరకూ ఎవరూ ఆలోుచన చేయలేదు. కాని త్వరలో ఆమె జీవితం కథతో మూవీ తెరకెక్కబోతున్నట్టు తెలుస్తోంది.
దివ్య భారతి జీవితం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కబోతోంది. అయితే అది టాలీవుడ్ లోనో.. బాలీవుడ్ లోనో కాదు.. అసలుఆమె ఒక్క సినిమా కూడా చేయని మలయాళంలో.. మాలీవుడ్ లో ఆమె జీవితం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కబోతోంది. మలయాళంలో ఈ ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో దివ్య భారతి పాత్ర కోసం తమన్నాను సంప్రదించారట టీమ్
అయితే ఈ పాత్రకు తమన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా లేదా అనేది మాత్రం తెలియడంలేదు. దీంతో తమన్నా ఆ పాత్రలో ఎలా ఉంటుంది అనే చర్చతోపాటు.. ఈసినిమా ద్వారా అసలు దివ్య భారతికి అప్పుడేమైంది అనే విషయం తెలుస్తుందని చూస్తున్నారు. ఈ విషయంలో సోషల్ మీడియా వ్యాప్తంగా చర్చ కూడా మొదలైంది.