మీరు 50 ఏళ్ల వయసులో కూడా 25 ఏళ్లలా కనిపించాలనుకుంటే ఏంచేయాలో తెలుసా. హీరోయిన్ ప్రియాంక చోప్రా సీక్రెట్ ఫేస్ మాస్క్ గురించి మీకు తెలుసా? చర్మాన్ని , ఆరోగ్యంగా, యవ్వనంగా ఎలా కాపాడాలి?
మెరిసే, యవ్వనమైన చర్మాన్ని పొందడం అందరి కల. 20 ఏళ్ల వయసైనా, 50 ఏళ్ల వయసైనా, ప్రతి మహిళ తన ముఖం ఎప్పుడూ తాజాగా, బిగుతుగా, ముడతలు లేకుండా కనిపించాలని కోరుకుంటుంది. అందుకే క్రీములు, సీరమ్‌లు, యాంటీ-ఏజింగ్ ఫేషియల్స్ నుంచి లేజర్లు, ఫిల్లర్స్ వరకు, చర్మాన్ని యవ్వనంగా ఉంచడానికి మార్కెట్లో లెక్కలేనన్ని మార్గాలు ఉన్నాయి. కానీ ఇటీవలి సంవత్సరాలలో, LED ఫేస్ మాస్క్ అనే బ్యూటీ డివైస్ బాగా పాపులర్ అయింది. ఇది కేవలం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న గ్యాడ్జెట్ మాత్రమే కాదు, శాస్త్రీయంగా నిరూపించబడిన స్కిన్‌కేర్ సాధనం. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు, ప్రియాంక చోప్రా వంటి గ్లోబల్ ఐకాన్ కూడా దీనిని తన బ్యూటీ రొటీన్‌లో భాగం చేసుకుంది. LED ఫేస్ మాస్క్ ప్రత్యేకత ఏంటంటే, ఇది చర్మంపై ఎలాంటి ఇన్వేసివ్ ప్రక్రియ లేకుండా పనిచేస్తుంది.
LED ఫేస్ మాస్క్ ఎందుకు ప్రత్యేకం?
LED (లైట్ ఎమిటింగ్ డయోడ్) థెరపీ చర్మంపై వేర్వేరు వేవ్‌లెంత్ కాంతిని ప్రసరింపజేస్తుంది, దీనివల్ల కణాలు యాక్టివ్ అయి పునరుత్పత్తి చెందుతాయి. ఇది చాలా పాపులర్ ఎందుకంటే ఇది చర్మం లోతుల్లోకి వెళ్లి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఫలితంగా చర్మం బిగుతుగా, నునుపుగా మారుతుంది, సన్నని గీతలు తగ్గుతాయి. అదే సమయంలో బ్లూ లైట్, మొటిమలు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. ఇక గ్రీన్ లైట్ అయితే పిగ్మెంటేషన్, నల్ల మచ్చలను తగ్గిస్తుంది.
క్లినికల్ రీసెర్చ్ ఏం చెబుతోంది?
వారానికి 3 సెషన్ల చొప్పున, వరుసగా 16 వారాల పాటు ఈ థెరపీ చేస్తే చర్మంలో స్పష్టమైన మెరుగుదల కనిపిస్తుందని చాలా అధ్యయనాల్లో తేలింది. రెడ్ లైట్ థెరపీ చర్మ కణాలకు శక్తినిస్తుంది, దీనివల్ల వృద్ధాప్య ప్రక్రియ నెమ్మదిస్తుంది, ముఖం సహజంగా యవ్వనంగా కనిపిస్తుంది.
LED ఫేస్ మాస్క్ ఇంట్లో వాడాలా లేక క్లినిక్‌లోనా?
LED ఫేస్ మాస్క్‌ల అతిపెద్ద ప్రయోజనం ఏంటంటే, వీటిని మీరు ఇంట్లోనే ఉపయోగించవచ్చు. ఇందులో ఎలాంటి ఇంజెక్షన్లు లేదా ఇన్వేసివ్ ట్రీట్‌మెంట్లు ఉండవు. అయితే, మీరు వేగవంతమైన, తీవ్రమైన ఫలితాలు కోరుకుంటే, క్లినిక్ ఆధారిత సెషన్లు మరింత శక్తివంతంగా ఉంటాయి. 30 ఏళ్లు దాటిన మహిళలు, సన్నని గీతలను గమనిస్తున్న వారు లేదా 40, 50 ఏళ్ల వయసులో చర్మాన్ని బిగుతుగా, యవ్వనంగా ఉంచుకోవాలనుకునే వారు దీనిని ఉపయోగించవచ్చు. ఇది రసాయనాలు, సర్జరీలు లేకుండా యవ్వనమైన రూపాన్ని అందించడంలో సహాయపడుతుంది.
