MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ ? షాకిచ్చిన తాప్సి.. ఇలియానా, అలియా భట్ పై పరోక్షంగా హాట్ కామెంట్స్

పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ ? షాకిచ్చిన తాప్సి.. ఇలియానా, అలియా భట్ పై పరోక్షంగా హాట్ కామెంట్స్

ఝుమ్మంది నాదం చిత్రంతో హీరోయిన్ గా తాప్సి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కొంతకాలం తెలుగులో వరుసగా చిత్రాలు చేసిన తాప్సి ఆ తర్వాత బాలీవుడ్ బాట పట్టింది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jul 18 2023, 06:57 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Taapsee Pannu

Taapsee Pannu

ఝుమ్మంది నాదం చిత్రంతో హీరోయిన్ గా తాప్సి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కొంతకాలం తెలుగులో వరుసగా చిత్రాలు చేసిన తాప్సి ఆ తర్వాత బాలీవుడ్ బాట పట్టింది. బాలీవుడ్ లో తాప్సి ప్రస్తుతం హీరోయిన్ ఓరియెంటెడ్, కథా బలం ఉన్న చిత్రాల్లో ఎక్కువగా నటిస్తోంది. 

26

తాప్సి బాలీవుడ్ కి వెళ్ళాక మరింత బోల్డ్ గా మారిపోయింది. పలు ఇంటర్వ్యూలలో తాప్సి బోల్డ్ గా మాట్లాడడం చూస్తూనే ఉన్నాం. తాప్సి నటనకు ప్రాధాన్యత ఉన్న రోల్స్ ఎంచుకుంటూనే.. వీలు చిక్కినప్పుడల్లా గ్లామర్ తో అదరగొడుతోంది. తరచుగా తాప్సి వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. తాప్సి కెరీర్ మొదలైంది టాలీవుడ్ అయినప్పటికీ.. ఆమె టాలీవుడ్ దర్శకులని చిత్రాలని టార్గెట్ చేస్తూ తరచుగా కామెంట్స్ చేస్తూ ఉంటుంది. టాలీవుడ్ లో హీరోయిన్లని గ్లామర్ కోసమే వాడుకుంటారు అంటూ తాప్సి పలు సందర్భాల్లో తన అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. 

36

అయితే తాప్సి సమాధానం ఎప్పుడూ నేరుగా ఉండదు. ఏదో ఒక వివాదం రగిలేలా తాప్సి తరచుగా వ్యాఖ్యలు చేస్తూనే ఉంటుంది. ఇటీవల తాప్సి ఆన్లైన్ లో ఫ్యాన్స్ తో చాట్ సెషన్ నిర్వహించింది. ఇక నెటిజన్లు ఊరుకుంటారా ? హీరోయిన్ ఆన్లైన్ లోకి వస్తే పెళ్లి ఎప్పుడు అంటూ గోల చేస్తారు. తాప్సిని కూడా పెళ్లి ఎప్పుడు అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు తాప్సి ఊహించని విధంగా దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. 

46

'నేనింకా గర్భవతిని కాలేదు.. కాబట్టి నా పెళ్లి అంత తొందరగా ఉండకపోవచ్చు' అంటూ ఊహించని కామెంట్స్ చేసింది. పెళ్లి గురించి అడిగితే పెళ్ళికి ముందే గర్భం గురించి ఎందుకు వివాదం రేపింది అంటూ చర్చ జరుగుతోంది. అయితే కొందరు బాలీవుడ్ హీరోయిన్లకు కౌంటర్ గానే తాప్సి ఈ వ్యాఖ్యలు చేసిందని అంటున్నారు. 

56

ఇలియానా, అలియా భట్, నేహా ధూపియా లాంటి వారంతా పెళ్ళికి ముందే గర్భం దాల్చారు. దీనితో అలియా భట్ రణబీర్ ని.. నేహా ధూపియా అంగద్ బేడీని వెంటనే వివాహం చేసుకున్నారు. అయితే ఇలియానా మ్యారేజ్ విషయంలో ఆమె ఇంకా ఓపెన్ కాలేదు. ఇప్పడు పెళ్ళికి ముందే గర్భం.. అది తెలియగానే వెంటనే పెళ్లి అనే ట్రెండ్ ఉందని తాప్సి సదరు హీరోయిన్లకు కౌంటర్ ఇచ్చినట్లయింది. 

66

తాప్సి కూడా గత కొన్నేళ్లుగా బ్యాట్మింటన్ ఆటగాడు మ్యాతీస్ బోతో డేటింగ్ చేస్తోంది. వీరిద్దరూ పలు సందర్భాల్లో జంటగా కనిపించారు. తాప్సి వయసు ప్రస్తుతం 35 ఏళ్ళు. కానీ సొట్టబుగ్గల సుందరి ఇంకా పెళ్లి ఊసే ఎత్తడం లేదు. ప్రస్తుతం తాప్సి.. షారుఖ్ ఖాన్ డుంకి చిత్రంలో నటిస్తోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Biker Review: బైకర్‌ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్‌, రాజశేఖర్‌ మూవీలో హైలైట్స్ ఇవే.. అదొక్కటే మైనస్‌
Recommended image2
Tollywood Directors: బోయపాటి నుంచి రాజమౌళి వరకు..వాళ్ళ కెరీర్ లో బెస్ట్ మూవీస్ ఇవే, ఇలాంటివి ఇక తీయలేరేమో
Recommended image3
Giribabu: కృష్ణ ఓ రోజు ఫోన్ చేసి ఒక మాట అన్నాడు.. అలా చెప్పడం ఏ హీరో వల్ల కాదు.!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved