MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • శ్వేతా ఎలిమినేటెడ్.. మానస్ డేంజరస్, రవికి దూరంగా ఉండాలి అంటూ కామెంట్స్

శ్వేతా ఎలిమినేటెడ్.. మానస్ డేంజరస్, రవికి దూరంగా ఉండాలి అంటూ కామెంట్స్

Bigg Boss 5 అక్టోబర్ 17సండే ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. శనివారం లోబో ఎలిమినేట్ అయ్యాడనుకుని ఇంటి సభ్యులంతా షాక్ లో ఉంటారు. ఊహించని విధంగా జరిగిన ఎలిమినేషన్ వల్ల హౌస్ మేట్స్ షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు.

2 Min read
Author : pratap reddy | Asianet News
Published : Oct 17 2021, 10:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

Bigg Boss 5 అక్టోబర్ 17సండే ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. శనివారం లోబో ఎలిమినేట్ అయ్యాడనుకుని ఇంటి సభ్యులంతా షాక్ లో ఉంటారు. ఊహించని విధంగా జరిగిన ఎలిమినేషన్ వల్ల హౌస్ మేట్స్ షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు. ఇంటి సభ్యులంతా లోబో గురించే బాధపడుతుండగా సండే ఎపిసోడ్ ప్రారంభం అవుతుంది. లోబోతో తన ఫ్రెండ్ షిప్ ఎలాంటిదో రవి మానస్ కు వివరిస్తుంటాడు. వాడు అమాయకుడు. వాళ్ళ నాన్న రోడ్డులో నడుస్తూ కుప్పకూలిపోయి మరణించారు. అప్పుడు మేమిద్దరం కలిసే ఉన్నాం. ఆ న్యూస్ తీసుకుని ఉరుకులు పరుగులమీద వచ్చాం. ఆ షాక్ ఎలా ఉంటుందో ఊహించుకోండి అని రవి ఎమోషనల్ గా వివరించాడు. 

26

ఈలోపు Nagarjuna స్టైలిష్ గా ఎంట్రీ ఇచ్చాడు. సండే ఫన్ డే కాబట్టి హౌస్ మేట్స్ ని రెండు టీమ్స్ గా డివైడ్ చేసి ఓ గేమ్ పెడతారు. రెండు టీమ్స్ లోని సభ్యులు ఒక్కొక్కరుగా వచ్చి స్లిప్ లో ఉన్న సాంగ్ ని విజిల్ తో ఊదుతూ సౌండ్ చేయాలి. ఆ సౌండ్ బట్టి ఆ సాంగ్ ఏంటో వాళ్ళ టీం సభ్యులు గెస్ చేయాలి. కరెక్ట్ గా గెస్ చేయగలిగితే ఆ టీం కు పాయింట్ వస్తుంది. ఈ గేమ్ కి సంచాలకుడిగా Ravi వ్యవహరిస్తాడు. సరదాగా సాగిన ఈ గేమ్ లో టీం ఎ విజయం సాధిస్తుంది. 

36

ఇంతలో నాగార్జున నామినేషన్స్ లో ఉన్నవారిని సేవ్ చేసే ప్రక్రియ మొదలు పెడతారు. నామినేషన్స్ లో ఉన్న రవి, విశ్వ, జెస్సి, శ్వేత, శ్రీరామ్, సిరి, సన్నీ, ప్రియాంక, షణ్ముఖ్ పైకి లేచి నిలబడతారు. వీరికి ఒక్కొక్కరికి ఒక్కో బొమ్మ ఇస్తారు. ఆబొమ్మని ఓపెన్ చేయగా ప్రియాంక, షణ్ముఖ్ సేఫ్ అయినట్లు తేలుతుంది. మిగిలిన వాళ్ళు అలాగే నామినేషన్స్ లో ఉంటారు. 

46

మరో గేమ్ ఆడిన తర్వాత మరోసారి నామినేషన్స్ లో మిగిలి ఉన్న వారిని సేవ్ చేసే ప్రక్రియ మొదలవుతుంది. ఒక్కొక్కరికి ఒక్కో కుండీ ఇస్తారు. ఆ కుండీలు పగలగొట్టగా శ్రీరామ్, సన్నీ ఇద్దరికీ గ్రీన్ కాయిన్ వస్తుంది. అంటే వారిద్దరూ సేఫ్. మిగిలిన వారికి రెడ్ కాయిన్ వస్తుంది. అంటే వారు అలాగే నామినేషన్స్ లో ఉంటారు.  మూడవసారి రవి, విశ్వ సేవ్ అవుతారు. ఇక చివరగా ముగ్గురు నామినేషన్స్ లో ఉంటారు. శ్వేతా, జెస్సి, సిరి నామినేషన్స్ లో ఉంటారు. 

56

ఈ ముగ్గురిలో జెస్సి సేవ్ అయినట్లు నాగ్ ప్రకటిస్తారు.ఇక మిగిలింది Swetha Varma, సిరి మాత్రమే. వీరిద్దరిని నాగ్ గార్డెన్ ఏరియాలోకి పంపుతారు. అక్కడ ఒక చెక్క బాక్స్ ఉంటుంది. దానిని సిరి, శ్వేతా బ్రేక్ చేయగా అందులో మరో బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ ని హౌస్ లోపలికి తీసుకువస్తారు. తాను కౌంట్ డౌన్ చెప్పాక బాక్స్ ఓపెన్ చేయాలి. అందులో ఎవరి ఫోటో ఉంటుందో వాళ్ళు సేఫ్. మిగిలిన వారు ఎలిమినేట్ అవుతారు అని నాగ్ చెబుతారు. బాక్స్ ఓపెన్ చేయగా సిరి ఫోటో ఉంటుంది. సో బిగ్ బాస్ 5 నుంచి Swetha Eliminate అవుతుంది. శ్వేత ఎలిమినేట్ కావడంతో అనీ మాస్టర్ తీవ్రమైన భావోద్వేగానికి గురవుతారు. సన్నీ కూడా ఎమోషనల్ అవుతారు. 

Also Read: ఘాటుగా లిప్ లాక్ సీన్.. దారుణంగా ట్రోలింగ్, తన భర్తపై హీరోయిన్ కామెంట్స్

66

ఇక శ్వేతా వేదికపై నాగార్జున వద్దకు వస్తుంది. ఏవీ పూర్తయ్యాక ఒక్కొక్కరి గురించి చెబుతుంది. హౌస్ లో ఎవరికి దూరంగా ఉండాలి అని నాగ్ అడగ్గా.. శ్వేతా రవి పేరు చెబుతుంది. డేంజరస్ ఎవరని అడగ్గా.. మానస్ అని చెబుతుంది. మానస్ ఐడియాలని ముందే ఊహించలేం. ఆ విధంగా అతడు డేంజరస్ అని శ్వేతా చెబుతుంది. అంతటితో సండే ఎపిసోడ్ ముగుస్తుంది. 

Also Read: చిరంజీవి కుడి చేతికి సర్జరీ.. చికిత్స చేసింది ఆ దర్శకుడి అల్లుడే

About the Author

PR
pratap reddy
Latest Videos
Recommended Stories
Recommended image1
Malaika Arora: తన డేటింగ్ రూమర్స్‌పై కొడుకు ఎలా రియాక్ట్ అవుతాడో చెప్పిన మలైకా
Recommended image2
Peddi Movie: ధురంధర్ రికార్డులు బద్దలు కొట్టేలా పక్కా ప్లాన్ తో పెద్ది.. ఎలాగో తెలుసా ?
Recommended image3
పోకిరి సెట్‌లో గొడవ.. 19 ఏళ్లుగా స్టార్ హీరోతో మాట్లాడని సీనియర్ నటుడు, ఏం జరిగిందో తెలుసా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved