ఘాటుగా లిప్ లాక్ సీన్.. దారుణంగా ట్రోలింగ్, తన భర్తపై హీరోయిన్ కామెంట్స్
ప్రస్తుతం సినిమాల్లో రొమాంటిక్ సన్నివేశాలు, ముద్దు సన్నివేశాలు సాధారణంగా మారిపోయాయి. కొన్ని చిత్రాల్లో కథ రొమాన్స్ ని డిమాండ్ చేస్తే..మరికొన్ని చిత్రాల్లో కమర్షియల్ ఎలిమెంట్స్ పేరుతో ముద్దు సన్నివేశాలు ఉంటున్నాయి.

ప్రస్తుతం సినిమాల్లో రొమాంటిక్ సన్నివేశాలు, ముద్దు సన్నివేశాలు సాధారణంగా మారిపోయాయి. కొన్ని చిత్రాల్లో కథ రొమాన్స్ ని డిమాండ్ చేస్తే..మరికొన్ని చిత్రాల్లో కమర్షియల్ ఎలిమెంట్స్ పేరుతో ముద్దు సన్నివేశాలు ఉంటున్నాయి. ఇంటిమేట్ సీన్స్ విషయంలో ఎక్కువగా టార్గెట్ అవుతున్నది హీరోయిన్లే. హీరోయిన్లు ఎక్కువగా ట్రోలింగ్ కి గురవుతున్నారు. దీనిపై ఇప్పటికే చాలా మంది నటీమణులు తమ వాయిస్ రైజ్ చేశారు.
సినిమాల్లో రొమాంటిక్ సీన్స్ లో నటిస్తే తప్పేంటి అంటూ రాధికా ఆప్టే లాంటి వారు ఇప్పటికే గళం విప్పిన సంగతి తెలిసిందే. మగవాళ్లకు లేని నిబంధనలు ఆడవాళ్లకు ఎందుకు అంటూ ప్రశ్నిస్తున్నారు. తాజాగా మలయాళీ హీరోయిన్ Durga Krishna సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోలింగ్ ఎదుర్కొంటోంది. అందుకు కారణం ఆమె 'కుడుక్కు 2025'(Kudukku 205) అనే చిత్రంలో ఘాటైన లిప్ లాక్ సన్నివేశంలో నటించడమే.
ఈ మలయాళీ చిత్రంలో Krishnashankar, దుర్గా కృష్ణ జంటగా నటించారు. ఈ మూవీ త్వరలో రిలీజ్ కు రెడీ అవుతోంది. అయితే ఇటీవల ఆ చిత్రంలోని 'మారన్' అనే రొమాంటిక్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లో కృష్ణ శంకర్, దుర్గా కృష్ణ హై ఓల్టేజ్ రొమాంటిక్ సన్నివేశాల్లో నటించారు. ఈ సాంగ్ లో ఇద్దరూ ముద్దులతో రెచ్చిపోయారు. బ్లీజీగా సాగే ఈ రొమాంటిక్ నంబర్ లో ఇద్దరి మధ్య హాట్ హాట్ గా లిప్ లాక్ కూడా ఉంటుంది. ఇద్దరి మధ్య ఈ సాంగ్ లో కెమిస్ట్రీ పీక్స్ అనే చెప్పాలి.
దుర్గా కృష్ణ ఈ ఏడాది ఏప్రిల్ లో అర్జున్ రవీంద్రన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. పెళ్ళైన కొన్ని నెలలకే ఈ సాంగ్ రిలీజ్ కావడంతో నెటిజన్లు దుర్గా కృష్ణపై దారుణమైన ట్రోలింగ్ తో రెచ్చిపోతున్నారు. నెటిజన్లు సోషల్ మీడియాలో ఆమెపై అసభ్యకరమైన మెసేజ్ లు పెడుతున్నారు. రోజు రోజుకు ట్రోలింగ్ ఎక్కువవుతుండడంతో దుర్గా కృష్ణ స్పందించింది.
ట్రోలర్స్ కి ఘాటుగా బదులిచ్చింది. ముందుగా అందరూ సినిమా వేరు, జీవితం వేరు అని అర్థం చేసుకోవాలి. సినిమా అంటే నటన మాత్రమే అని దుర్గా కృష్ణ పేర్కొంది. మారన్ సాంగ్ లో నేను హీరో కృష్ణ శంకర్ కలసి నటించాం. ఈ రొమాంటిక్ సాంగ్ విషయంలో కృష్ణ శంకర్ కు అతడి భార్య మద్దతు లభించింది. కానీ నా భర్త మద్దతు తెలపనందుకు సిగ్గుపడుతున్నాడు.
Also Read: ఫ్యాన్స్ తో సమావేశంలో చిరంజీవి ఆవేదన.. ఆక్సిజన్ బ్యాంక్స్ కి కారణం ఆ ఊరిలో జరిగిన సంఘటనే
రొమాంటిక్ సీన్స్ లో హీరోయిన్ తో పాటు హీరోలు కూడా నటిస్తారు. అలాంటప్పుడు కేవలం హీరోయిన్లని మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటూ దుర్గా కృష్ణ ప్రశ్నించింది. ప్రేక్షకులు ఆ విషయంలో రెండు నాలుకల ధోరణికి స్వస్తి చెప్పాలని కోరింది. చివరకు సోషల్ మీడియాలో మహిళలు కూడా తనని కామెంట్స్ చేస్తున్నారని దుర్గా కృష్ణ పేర్కొంది.
Also Read: హాట్ బాంబ్ మలైకా స్టన్నింగ్ ఫోటోస్.. చూడగానే కిక్కు పక్కా