MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • స్వయంవరం లయ ఎలా ఉన్నారో చూశారా? ఆమె ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారంటే? 

స్వయంవరం లయ ఎలా ఉన్నారో చూశారా? ఆమె ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారంటే? 

తెలుగు అమ్మాయి లయ వెండితెరపై తన మార్కు వేశారు. సూపర్ హిట్ చిత్రాలతో సత్తా చాటారు. పెళ్లి తర్వాత నటనకు గుడ్ బై చెప్పిన లయ చాలా కాలం తర్వాత సోషల్ మీడియాలో దర్శనమిచ్చారు.  

2 Min read
Author : Sambi Reddy
Published : Nov 12 2022, 01:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Laya

Laya


విజయవాడ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన లయ చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేశారు. 1992లో విడుదలైన భద్రం కొడుకో మూవీలో లయ లీడ్ రోల్ చేశారు. ఆ మూవీ స్ట్రీట్ చైల్డ్స్ పై తీసిన చిత్రం. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
28
Laya

Laya


హీరోయిన్ గా లయ మొదటి చిత్రం స్వయంవరం. హీరో వేణు తొట్టెంపూడి ఈ చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన స్వయం వరం మంచి విజయాన్ని సాధించించింది. ఫస్ట్ హిట్ ఖాతాలో వేసుకుంది. 
 

38
Laya

Laya


తెలుగులో లయకు ఆఫర్స్ క్యూ కట్టాయి. ముఖ్యంగా టైర్ టూ హీరోల ఛాయిస్ గా మారారు. మంచి నటిగా పేరు తెచ్చుకున్న లయకు పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ పాత్రలు దక్కాయి. ప్రేమించు ఈ తరహా చిత్రమే. ప్రేమించు మూవీలో లయదే ప్రధాన పాత్ర. సాయి కిరణ్ హీరో. 
 

48
Laya

Laya


సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో తెరకెక్కిన ప్రేమించు హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రేమించు లో లయ అంధురాలు పాత్ర చేశారు. హనుమాన్ జంక్షన్, నువ్వులేక నేనులేను వంటి కమర్షియల్ హిట్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి. ఇండస్ట్రీలో ఉంది కొద్ది రోజులే అయినా 50 కి పైగా చిత్రాల్లో లయ నటించారు. 

58
Laya

Laya


విజయేంద్రవర్మ మూవీలో లయ బాలకృష్ణకు జంటగా నటించారు. తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా ఆమెకు ఆఫర్స్ వచ్చాయి. 2006 వరకు లయ కెరీర్ సక్సెస్ ఫుల్ గా సాగింది. చిన్నదో పెద్దదో ఆఫర్స్ మాత్రం ఆగలేదు. 
 

68
Laya

Laya

2006లో కాలిఫోర్నియా లో డాక్టర్ గా సెటిల్ అయిన గణేష్ గొర్తి అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఆయనతో పాటు కాలిఫోర్నియా వెళ్లిపోయారు. హౌస్ వైఫ్ గా ఉంటున్న లయ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. అమ్మాయి పేరు శ్లోక కాగా అబ్బాయి పేరు వచన్. 
 

78
Laya

Laya

2010లో విడుదలైన బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం మూవీలో లయ నటించారు. 2018లో శ్రీను వైట్ల-రవితేజ కాంబోలో తెరకెక్కిన అమర్ అక్బర్ ఆంటోని మూవీలో లయ నటించారు. 

88
Laya

Laya

చాలా కాలం తర్వాత లయ సోషల్ మీడియాలో దర్శనమిచ్చారు. ఆమె కాలిఫోర్నియాలో జరుగుతున్న ఒక ఎలక్షన్ లో ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చారు. పోలింగ్ కేంద్రంలో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకున్నారు. లయను చూసిన నెటిజెన్స్ తమ ఫీలింగ్స్ తెలియజేస్తున్నారు. ఇన్నేళ్లలో అసలు ఏం మారలేదు అంటున్నారు. లయ అందం అలాగే చెక్కు చెదరకుండా ఉందన్న అభిప్రాయం వెల్లడిస్తున్నారు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Malavika Mohanan: రజనీ, మోహన్‌లాల్, విజయ్... ఆ ముగ్గురు సూపర్ స్టార్ల సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్
Recommended image2
Ananya Nagalla : ప్లాప్ హీరో తో ప్రేమలో పడ్డ హీరోయిన్, అనన్య నాగళ్ల ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా?
Recommended image3
Savitri Vs Janaki : సావిత్రి కి పాటలు పాడను.. జానకి అంత పెద్ద నిర్ణయం తీసుకోడానికి కారణం ఏంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved